వారణాసి తర్వాత మహేష్ ప్లాన్ అదే!
ఇదిలా ఉంటే వారణాసి తర్వాత మహేష్ బాబు ప్లాన్స్ మరింత యాంబీషస్‌గా కనిపిస్తున్నాయి.
By: Sravani Lakshmi Srungarapu | 27 April 2026 12:29 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో కీలక మలుపు తిరిగే ప్రాజెక్ట్‌గా వారణాసి నిలవబోతోందనే అంచనాలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు పూర్తి స్థాయి పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేయని మహేష్, ఈ సినిమాతో తన ఇమేజ్‌ను నేషనల్ నుంచి గ్లోబల్ స్థాయికి తీసుకెళ్లాలని చూస్తున్నారు. ముఖ్యంగా S. S. రాజమౌళి దర్శకత్వం ఈ ప్రాజెక్ట్‌కు భారీ క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. రాజమౌళి సినిమాలకు ఉన్న అంతర్జాతీయ గుర్తింపు దృష్ట్యా, వారణాసి మహేష్ బాబుకు కేవలం సినిమా కాకుండా ఒక కెరీర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్ట్‌గా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
గుంటూరు కారం తర్వాత మూడేళ్ల గ్యాప్
అయితే ఈ జర్నీలో మహేష్ కెరీర్లో మూడేళ్ల గ్యాప్ వచ్చింది. గుంటూరు కారం తర్వాత మహేష్ నుంచి ఇంత పెద్ద గ్యాప్ తీసుకోవడం రిస్క్‌గా కనిపించినా, తర్వాత వస్తుంది రాజమౌళి సినిమా కాబట్టి అది తన మార్కెట్ ను, క్రేజ్ ను, ఫాలోయింగ్ ను పెంచుతుందే తప్పించి ఏ మాత్రం రిస్క్ అనుకోవడానికి లేదు. రాజమౌళి ప్రాజెక్ట్స్‌కు సహజంగానే ఎక్కువ సమయం పడుతుండటంతో, ఈ గ్యాప్‌ను ఫ్యాన్స్ కూడా అంగీకరిస్తున్నారు. అంతేకాదు, సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఈ వెయిటింగ్ పీరియడ్ మరింత ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచే ఫ్యాక్టర్‌గా మారవచ్చు.
మూడేళ్లలో మూడు సినిమాలు
ఇదిలా ఉంటే వారణాసి తర్వాత మహేష్ బాబు ప్లాన్స్ మరింత యాంబీషస్‌గా కనిపిస్తున్నాయి. మూడేళ్లలో మూడు సినిమాలు రిలీజ్ చేయాలనే టార్గెట్ తో ఆయన ముందుకెళ్తున్నట్టు టాక్. ఇది కేవలం బిజీ షెడ్యూల్ మాత్రమే కాకుండా, మార్కెట్‌ను నిరంతరం యాక్టివ్‌గా ఉంచే వ్యూహంగా భావిస్తున్నారు. వారణాసి తర్వాత మహేష్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ ప్రాజెక్ట్, అలాగే ఏషియన్ సునీల్ తో మరో సినిమా చర్చల్లో ఉండటం గమనార్హం. ఒకేసారి పలు ప్రాజెక్టులను ప్లాన్ చేయడం ద్వారా గ్యాప్‌లను తగ్గించడమే కాకుండా, విభిన్న జానర్లతో ఆడియన్స్‌ను ఆకట్టుకోవాలని మహేష్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టులకు ఎవరు దర్శకత్వం వహిస్తారనేది ఇంకా ఫైనల్ కాకపోవడం ఆసక్తిని పెంచుతోంది.
భారీ రెమ్యూనరేషన్ డిమాండ్
ఇక రెమ్యునరేషన్ అంశం కూడా ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. వారణాసి తర్వాత పెరిగే మార్కెట్ ను దృష్టిలో ఉంచుకుని ఆయన భారీ పారితోషికం డిమాండ్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. వారణాసి సక్సెస్ అయితే, ఆయన మార్కెట్ విలువ భారీగా పెరిగే అవకాశం ఉండటంతో, ఈ హైక్ నిర్మాతలపై బడ్జెట్ ప్రెజర్‌ను పెంచే అవకాశముంది. ఇదే సమయంలో, స్టార్ మార్కెట్ పెరిగితే రికవరీ కూడా అదే స్థాయిలో ఉండే అవకాశం ఉండటంతో, నిర్మాతలు కూడా ఈ రిస్క్‌ను అంగీకరించడానికి అవకాశాలున్నాయి.
అయితే ఈ మొత్తం ప్లాన్‌లో అత్యంత కీలకమైంది రాజమౌళితో సినిమా చేసిన తర్వాత వచ్చే ప్రాజెక్టులపై భారీ అంచనాలు ఏర్పడటం సహజం. గతంలో పలువురు స్టార్ హీరోలు ఈ ప్రెజర్‌ను ఫేస్ చేసినప్పటికీ, వాళ్లలో ఎక్కువ మంది ఫ్లాపులనే ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహేష్ తర్వాతి ప్రాజెక్టులు, వాటి ఎంపికపై మరింత జాగ్రత్త వహించాల్సిన అవసరముందని అంతా అభిప్రాయపడుతున్నారు. మరో వైపు మార్కెట్ ఎక్స్‌పాన్షన్ విషయంలో కూడా మహేష్ బాబు స్పష్టమైన వ్యూహంతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది. వారణాసి తర్వాత నార్త్ ఇండియా మరియు ఓవర్సీస్ మార్కెట్లపై ఫోకస్ పెంచే అవకాశం ఉంది. రాజమౌళి బ్రాండ్ వల్ల వచ్చే విజిబిలిటీని ఉపయోగించుకుని, తన తర్వాతి సినిమాలను కూడా పాన్ ఇండియా లెవల్‌లో ప్లాన్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా చూస్తే, వారణాసి మహేష్ బాబు కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలవడమే కాకుండా, ఆయన భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ప్రాజెక్ట్‌గా మారనుంది.
