మహేష్ కి మ్యాచ్ అయ్యే బొమ్మ..!
టాలీవుడ్ స్టార్స్ అంతా కూడా భారీ సినిమాలతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ రిలీజ్ అంటున్నారు.
By: Ramesh Boddu | 24 Sept 2025 9:53 AM ISTటాలీవుడ్ స్టార్స్ అంతా కూడా భారీ సినిమాలతో పాన్ ఇండియా పాన్ వరల్డ్ రిలీజ్ అంటున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓజీ తో తన స్టైలిష్ యాక్షన్ సినిమాతో వస్తున్నారు. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఓజీ సినిమా మరికొద్ది గంటల్లో రిలీజ్ కాబోతుంది. ఐతే ఇప్పటికే ఎన్ టీ ఆర్, రాం చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్ ఇలా అందరు పాన్ ఇండియా సినిమాలతో వారి ఇమేజ్ కి తగిన సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఓజీతో తన రేంజ్ సినిమాతో వస్తున్నారు. ఐతే టాలీవుడ్ స్టార్స్ లో మహేష్ ఒక్కడే ఇప్పటివరకు పాన్ ఇండియా రిలీజ్ సినిమా చేయలేదు.
రాజమౌళితో చేస్తున్న సినిమా..
అఫ్కోర్స్ ప్రస్తుతం రాజమౌళితో చేస్తున్న సినిమా ఉంది. కానీ స్టార్స్ తమ ఇమేజ్ కి తగిన సినిమాలు.. తమ రేంజ్ పెంచుకునే సినిమాలను చేస్తున్నారు. కానీ రాజమౌళి సినిమా ముందు వరకు మహేష్ సోషల్ మెసేజ్ సినిమాలు చేస్తూ వచ్చాడు. డిఫరెంట్ కంటెంట్ తో కమర్షియల్ సినిమాలు చేయడం మంచిదే కానీ స్టార్ ఖలేజా తెలియాలంటే వాళ్ల ఇమేజ్ కి మ్యాచ్ అయ్యే ఒక భారీ బొమ్మ పడాల్సిందే. మహేష్ కి ఆల్రెడీ రాజమౌళితో సినిమా అలాంటి ప్రాజెక్టే.. అదే కాదు ఆ నెక్స్ట్ కూడా మహేష్ అలాంటి సినిమాలే చేయాల్సి ఉంటుంది.
టాలీవుడ్ లో మోస్ట్ ఫ్యాన్ బేస్ ఉన్న వారిలో మహేష్ ఒకడు.. కాబట్టి మహేష్ కూడా తన రేంజ్ కి తగిన సినిమాలు చేస్తే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. మహేష్ కేవలం తెలుగు సినిమాలు చేసే నేషనల్ వైడ్ గా ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు. వాణిజ్య ప్రకటనల్లో కూడా మహేష్ ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాడు. సినిమాల పరంగా తన రేంజ్ పెంచుకోవాలని ఎప్పుడు ప్రయత్నించలేదు.
మహేష్ పాన్ ఇండియా సినిమాలు..
అంతకుముందు బాలీవుడ్ సినిమాలు చేయరా అంటే దే కాంట్ ఎఫర్డ్ మీ అని చెప్పాడు. కానీ ఇప్పుడు తెలుగు సినిమానే పాన్ ఇండియా రిలీజ్ లు అవుతున్నాయి. సంచలనాలు సృష్టిస్తున్నాయి కాబట్టి తెలుగు దర్శకులతోనే మహేష్ పాన్ ఇండియా సినిమాలు చేసే ఛాన్స్ ఉంటుంది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ సందీప్ వంగ, సుకుమార్ ఇలా టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అందుకుంటున్న డైరెక్టర్స్ తో పనిచేస్తారని తెలుస్తుంది.
సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి సినిమా తర్వాత తన నెక్స్ట్ స్టెప్ కచ్చితంగా ఫ్యాన్స్ అందరినీ సర్ ప్రైజ్ చేసేలా ఉంటుందని తెలుస్తుంది. ఎస్.ఎస్.ఎం.బి 29 సినిమా రిలీజ్ తర్వాత కచ్చితంగా బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం మహేష్ తో సినిమాకు సిద్ధమవుతారని చెప్పొచ్చు.
