Begin typing your search above and press return to search.

మ‌హేష్ 10 సార్లు చూసిన ఒకే ఒక్క సినిమా!

ఇప్పుడెక్క‌డ చూసినా `శివ` రీ-రిలీజ్ పైనే చర్చే జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ ఇదే చ‌ర్చ కొన‌సాగుతుంది.

By:  Srikanth Kontham   |   10 Nov 2025 4:44 PM IST
మ‌హేష్ 10 సార్లు చూసిన ఒకే ఒక్క సినిమా!
X

ఇప్పుడెక్క‌డ చూసినా `శివ` రీ-రిలీజ్ పైనే చర్చే జ‌రుగుతోంది. న‌వంబ‌ర్ 14 వ‌ర‌కూ ఇదే చ‌ర్చ కొన‌సాగుతుంది. ఇండ‌స్ట్రీ మొత్తం శివ గురించి మాట్లాడు తుంది. స్టార్ హీరోల నుంచి డైరెక్ట‌ర్ల వ‌ర‌కూ ప్ర‌తీ ఒక్క‌రూ `శివ` గురించే మాట్లాడుతున్నారు. `శివ‌`తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. `శివ` రిలీజ్ అయ్యే స‌మ‌యానికి ఇప్పుడు స్టార్ హీరోల‌గా ఉన్న వాళ్లు అంతా స్కూల్ పిల్ల‌లు. ప్ర‌భాస్, మ‌హేష్‌, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్‌, బన్నీ ఇలా అంద‌రూ కూడా స్కూల్ కి వెళ్లేవారు. ఈ సినిమా గురించి వీళ్లంతా స్పందించారు. `శివ` రిలీజ్ స‌మ‌యంలో తామంతా ఎలాంటి అనుభూతికి లోన‌య్యామ‌ని గుర్తు చేసుకుంటున్నారు.

మ‌రి `శివ‌`తో సూప‌ర్ స్టార్ మ‌హేష్ కున్న అనుబంధం ఏంటి? అంటే మ‌హేష్ తాను ఎక్కువ సార్లు చూసిన గొప్ప చిత్రంగా పేర్కొన్నారు. నాలుగైదు సార్లు కాదు ఏకంగా `శివ` చిత్రాన్ని ప‌దిసార్లు చూసిన‌ట్లు తెలిపారు. తొలిసారి సినిమా చూసిన‌ప్పుడు మైండ్ బ్లోయింగ్ అనిపించింది. రెండు రోజుల త‌ర్వాత మ‌ళ్లీ చూసాను. అలా ప‌దిసార్లు చూసాను. ఎన్నిసార్లు చూసినా చూడాల‌నించిన చిత్ర‌మ‌ది అన్నారు. అంత వ‌ర‌కూ మ‌హేష్ ఏ సినిమా కూడా అన్నిసార్లు చూసిన చిత్రంగా చెప్ప‌లేదు. తొలిసారి త‌న‌కు బాగా న‌చ్చిన చిత్రంగా పేర్కొన్నారు.

`శివ` రిలీజ్ అయ్యే స‌మ‌యానికి మ‌హేష్ బాల న‌టుడిగా తెరంగేట్రం చేసారు. `నీడ` సిన‌మాతో మ‌హేష్ 1979 లో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత `పోరాటం`, `శంఖారావం`, `బ‌జార్ రౌడీ` చిత్రాల్లో న‌టించారు. అటుపై 1988 లో `ముగ్గురు కొడుకులు` చిత్రంలోనూ న‌టించారు. అనంత‌రం 1989 లో `గుఢచారి 117` లో న‌టించారు. స‌రిగ్గా అదే ఏడాది `శివ‌` రిలీజ్ అయింది. బాల న‌టుడిగా మ‌హేష్ కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యం అది. కానీ `గుఢ‌చారి 117` త‌ర్వాత బాల న‌టుడిగా నాలుగైదు సినిమాలు చేసి తొమ్మిదేళ్లు గ్యాప్ తీసుకున్నారు.

అనంత‌రం 1999లోనే మ‌హేష్ `రాజ‌కుమారుడు` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. చాలా మంది వార‌సుల‌ను `శివ` ఎంతో ఇన్ స్పైర్ చేసిన చిత్రం. ఆ సినిమా చూసి హీరో అవ్వాల‌నుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అలా మ‌హేష్ కెరీర్ లో కూడా `శివ` కీల‌క‌మనే చెప్పాలి. `శివ` రిలీజ్ అనంత‌రం రాంగో పాల్ వ‌ర్మ వ‌ద్ద అసిస్టెంట్ డైరెక్టర్లుగా ప‌ని చేయాల‌ని అప్ప‌టి త‌రం ద‌ర్శ‌కులు చాలా మంది అనుకునే వారు.