స్టార్ హీరోయిన్ కటౌట్.. ఘట్టమనేని లెగసీ కొనసాగిస్తుందా..?
ఐతే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మంజుల కూతురు జాన్వి ఘట్టమనేని హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతుంది.
By: Ramesh Boddu | 29 Oct 2025 10:17 AM ISTసూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని మహేష్ బాబు సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నారు. దాదాపు పాతికేళ్లుగా మహేష్ ఫ్యాన్స్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా తో ప్రభంజనానికి రెడీ అవుతున్నాడు. ఐతే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మహేష్ సిస్టర్ మంజుల తన నటనా ప్రతిభ కనబరచాలని అనుకుంది. కథానాయికగా కాకుండా షో సినిమాతో నటనతో పాటు నిర్మాతగా అవార్డ్ గెలుచుకుంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో మంజుల అలా తళుక్కున మెరిసిన విషయం తెలిసిందే.
మంజుల కూతురు జాన్వి ఘట్టమనేని హీరోయిన్ గా..
ఐతే ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి మంజుల కూతురు జాన్వి ఘట్టమనేని హీరోయిన్ గా తెరంగేట్రం చేయబోతుంది. తెర మీద అభినయంతో మెప్పించడానికి అన్ని విధాలుగా తనను తాను సిద్ధం చేసుకుంటుంది జాన్వి ఘట్టమనేని. యాక్టింగ్, డాన్స్, లుక్ ఇలా కూడా పర్ఫెక్ట్ గా ఉండేలా చూసుకుంటుంది. ఎలాగు మదర్ మంజుల గైడన్స్, మేన మామ స్పూర్తి ఉంటుంది కాబట్టి జాన్వి చాలా ఫోకస్ గా ఉంటుందని చెప్పొచ్చు.
10 ఏళ్ల వయసులోనే జాన్వి మంజుల డైరెక్షన్ సినిమాలో తెరంగేట్రం చేసింది. ఐతే ఇప్పుడు లీడ్ హీరోయిన్ గా మెప్పించాలని చూస్తుంది. ఇప్పటికే వాణిజ్య ప్రకటనలో జాన్వి తన సత్తా చాటుతుంది. పెద్ద పెద్ద బ్రాండ్స్ ఆమెతో యాడ్స్ చేసేందుకు వస్తున్నారు. జాన్వి తెరంగేట్రం ఎప్పుడు.. ఎవరితో అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒక బడా ప్రాజెక్ట్ తో సూపర్ లాంచింగ్ ఆమెకు ఉండబోతుందని తెలుస్తుంది.
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న యాక్టర్..
ప్రస్తుతం ఆడియన్స్ లో తనకంటూ ఒక ఐడెంటిటీ వచ్చేలా తన ఫోటోలతో టచ్ లో ఉంటుంది జాన్వి ఘట్టమనేని. జాన్వి ఫోటోస్ చూస్తుంటే స్టార్ హీరోయిన్ కటౌట్ అనేలా ఉన్నాయి. కచ్చితంగా సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వస్తున్న యాక్టర్ కాబట్టి ఆమెకు మంచి పుష్ ఉంటుంది. ఎలాగు సూపర్ స్టార్ ఫ్యాన్స్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి కాస్త టాలెంట్ చూపిస్తే మాత్రం జాన్వి టాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. మరి జాన్వి ఎంట్రీ ఎప్పుడు.. సూపర్ స్టార్ ఫ్యామిలీ ప్లానింగ్ ఎలా ఉంది అన్నది త్వరలో తెలుస్తుంది.
కాస్త వెనక్కి వెళ్తే.. మంజుల ఘట్టమనేని కూడా యాక్టింగ్ మీద ఆసక్తితోనే ఆమె సినిమాల్లోకి వచ్చారు. ఐతే ఆమె కూడా హీరోయిన్ గా చేయాలని కలలు కన్నారు. కానీ సూపర్ స్టార్ కృష్ణ అందుకు అంగీకరించలేదు. అంతేకాదు ఫ్యాన్స్ నుంచి కూడా రిక్వెస్ట్ లు రావడంతో మంజుల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది. ఐతే అప్పుడు తనకు కుదరలేదు కాబట్టి ఇప్పుడు తన కూతురికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు మంజుల.
