Begin typing your search above and press return to search.

అదే జ‌రిగితే? మ‌హేష్ కండీష‌న్ బ్రేక్ అయిన‌ట్లే!

అయితే విజ్యువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో సిద్ధహస్తుడైన సంజయ్ లీలా భన్సాలీతో మహేష్ చర్చలు జరిపారనే వార్త వినబడటంతో కండిషన్‌ను పక్కన పెట్టినట్లేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

By:  Srikanth Kontham   |   15 Sept 2026 6:55 PM IST
అదే జ‌రిగితే? మ‌హేష్ కండీష‌న్ బ్రేక్ అయిన‌ట్లే!
X

సూపర్ స్టార్ మహేష్ గ్లోబ‌ల్ ప్రాజెక్ట్ `వారణాసి` తర్వాత ఏ ద‌ర్శ‌కుడితో సినిమా చేస్తారు? అన్న దానిపై స‌స్పెన్స్ కొన‌సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. వాట్ నెక్స్ట్ మ‌హేష్ అన్న దానిపై అభిమానుల్లో క్యూరియాసిటీ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ఈనేప‌థ్యంలో ప్ర‌శాంత్ నీల్.. సందీప్ రెడ్డి వంగా పేర్లు తెర‌పైకి వ‌చ్చాయి. వాళ్లిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రితో? సినిమా చేసే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ వ‌రుస‌లో బాలీవుడ్ క‌ళాత్మ‌క చిత్రాల ద‌ర్శ‌కుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా చేరారు. ఇటీవల మహేష్ తో భ‌న్సాలీ భేటీ అయినట్లు మీడియా క‌|థ‌నాలు వెడెక్కిస్తున్నాయి.

ఇదే స‌మ‌యంలో మ‌హేష్ కండీష‌న్ కూడా వైర‌ల్ అవుతోంది. `హిందీ పరిశ్రమ నన్ను భరించలేదు. నేను అక్కడికి వెళ్లి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. నేను ఏం చేసినా తెలుగు సినిమా నుంచే చేస్తాను. నా సినిమా ప్రపంచవ్యాప్తంగా ఆడుతుంది` అని మహేష్ చాలా వేదికలపై స్పష్టం చేశారు. ఆ ర‌కంగా స్వచ్ఛమైన టాలీవుడ్ స్థానికతకు, తెలుగు సినిమా స్థాయిని పెంచడానికి కట్టుబడిన మహేష్ హిందీ చిత్రసీమకు నేరుగా వెళ్లనని పెట్టిన కండిషన్ ఇప్ప‌టి వ‌ర‌కూ అలాగే నిలిచింది.

అయితే విజ్యువల్ వండర్స్ క్రియేట్ చేయడంలో సిద్ధహస్తుడైన సంజయ్ లీలా భన్సాలీతో మహేష్ చర్చలు జరిపారనే వార్త వినబడటంతో కండిషన్‌ను పక్కన పెట్టినట్లేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భన్సాలీ తెరకెక్కించే చిత్రాలు అన్నీ బాలీవుడ్ నిర్మాణంలోనే రూపుదిద్దుకుంటాయి. ఒకవేళ భన్సాలీ దర్శకత్వంలో మహేష్ నటిస్తే అది ఖచ్చితంగా మహేష్ నిబంధనను బ్రేక్ చేసినట్లే అవుతుంది. ఈ వార్త వెనుక మరొక కోణం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది.

మహేష్ బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచనలో లేకపోతే.. సంజయ్ లీలా భన్సాలీనే టాలీవుడ్‌కు వచ్చి ప్యాన్-ఇండియా/గ్లోబల్ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్ కేంద్రంగా డిజైన్ చేస్తున్నారా అనే చర్చ మొదలైంది. రాజమౌళి `వారణాసి` తర్వాత మహేష్ ఇమేజ్ ప్రపంచ స్థాయిలో మరింత పెరగడం ఖాయం. ఆ ఇమేజ్‌కు తగ్గట్టుగా భన్సాలీ ఓ భారీ పీరియాడిక్ విజువల్ ఎపిక్‌ను ప్లాన్ చేసి ఉండొచ్చ‌ని సమాచారం.

భన్సాలీ మార్కు గ్రాండియర్, మహేష్ చార్మింగ్ స్క్రీన్ ప్రెజెన్స్ కలిస్తే వెండితెరపై అద్భుతమైన కాంబినేషన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కథ , నిర్మాణ సంస్థ ఎక్కడిది అనేదే అసలైన ప్రశ్న. మహేష్ టాలీవుడ్ హౌస్‌లలోనే సినిమా ప్లాన్ చేస్తారా? లేక భన్సాలీ నిర్మించే హిందీ చిత్రంలో భాగమవుతారా? అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా? వారణాసి తర్వాత మహేష్ అడుగులు ఎలా ఉంటాయి? అన్న‌ది ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.