'బాబు' మాస్టర్ ప్లాన్.. అందుకే సైలెంటా!
టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల లైనప్ చూస్తే ఎవరి చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో క్లియర్ గా కనిపిస్తోంది.
By: M Prashanth | 25 Oct 2026 9:00 AM ISTటాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాల లైనప్ చూస్తే ఎవరి చేతిలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయో క్లియర్ గా కనిపిస్తోంది. కొందరు ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో ప్రాజెక్ట్ మొదలుపెడుతున్నారు. ఇంకొందరు వరుసగా కొత్త దర్శకులతో సినిమాలను ఫిక్స్ చేసుకుంటున్నారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు మాత్రం ఇందుకు భిన్నంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసిపైనే తన కంప్లీట్ ఫోకస్ పెట్టారు.
ఆ సినిమా తర్వాత ఏ డైరెక్టర్ తో వర్క్ చేయబోతున్నారనే విషయంపై మాత్రం ఇప్పటివరకు అఫిషియల్ అనౌన్స్మెంట్ లేదు. అసలు మహేష్ ఇలా సైలెంట్ గా ఉండటానికి కారణమేంటి.. దీని వెనుక ఏదైనా ప్లాన్ ఉందా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొన్ని రోజులుగా అనిల్ రావిపూడి, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకుల పేర్లు మహేష్ లైనప్ లో ఉన్నట్టు వినిపిస్తున్నాయి.
అయితే వీటిలో ఎవరి పేరు కూడా అఫిషియల్ గా ఫిక్స్ కాలేదు. ఒకవైపు ఇతర స్టార్ హీరోలు తమ తర్వాతి సినిమాలపై ముందుగానే నిర్ణయాలు తీసుకుంటుంటే.. మహేష్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను ప్రకటించకపోవడం గమనార్హం. దీనికి ప్రధాన రీజన్ వారణాసి కావచ్చని అనేక మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి సినిమా అంటే ఉండే అంచనాలు వేరు. కథ, పాత్ర, మేకోవర్, షూటింగ్.. ఇలా ప్రతి విషయంలోనూ ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.
పైగా సినిమాను పాన్ వరల్డ్ రేంజ్ లో ప్రేక్షకులకు రీచ్ అవ్వాలనే టార్గెట్ తో రూపొందిస్తున్నారు. ఇలాంటి సమయంలో మరో సినిమాను ప్రకటించడం కంటే, ప్రస్తుత ప్రాజెక్ట్ పైనే కంప్లీట్ ఫోకస్ పెట్టడం మహేష్ కు యూజ్ అవ్వచ్చు. మరో ముఖ్యమైన విషయం ఆయన మార్కెట్. మహేష్ బాబుకు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే వారణాసితో ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ ఆయనకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది.
అందుకే ఆ మూవీ రిజల్ట్, ప్రేక్షకుల రెస్పాన్స్ ఆయన తర్వాతి సినిమాపై కూడా ఎఫెక్ట్ చూపవచ్చు. అందుకే నెక్స్ట్ మూవీని ఇప్పుడే ప్రకటించకుండా, సరైన కథతో పాటు దర్శకుడిని ఎంచుకోవాలని చూస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. ఇక మహేష్ తర్వాత సినిమా విషయంలో దర్శకుడి సెలక్షన్ మాత్రమే కాదు.. కథ కూడా కీలకమే. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో కేవలం స్టార్ దర్శకుడితో సినిమా చేయడం మాత్రమే సరిపోదు.
స్టోరీ, రోల్, కొత్తదనం కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే తొందరపడకుండా నిర్ణయం తీసుకోవడం సరైనదే కావచ్చు. అలా మహేష్ బాబు తర్వాతి సినిమా విషయంలో ఇప్పటికైతే క్లారిటీ లేదు. వేరే హీరోలు వరుస ప్రాజెక్టులతో ముందుకు వెళ్తుంటే.. మహేష్ మాత్రం ఒక్క సినిమాపైనే దృష్టి పెట్టడం, కొత్త మూవీ విషయంలో సైలెంట్ గా ఉండడం వెనుక మాస్టర్ ప్లాన్ ఉందా? లేక సరైన కథ, దొరికే వరకు వేచి చూస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
