మహేష్ నెక్స్ట్ ఏంటి? ఆ కాంబో డౌటేనా?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు వారణాసి మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 29 Jan 2026 11:00 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు వారణాసి మూవీతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో జరుగుతున్న షెడ్యూల్ లో మహేష్ బాబు పాల్గొంటున్నారు. కీలక సన్నివేశాలు ఆయన ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నట్లు సమాచారం.
వచ్చే ఏడాది వేసవి కానుకగా వారణాసి మూవీ రిలీజ్ కానుండగా.. ఆ తర్వాత మహేష్ బాబు ఏ సినిమా చేయనున్నారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది. ఎందుకంటే ఇప్పటి వరకు ఎలాంటి అనౌన్స్మెంట్ రాలేదు. సాధారణంగా చాలా మంది స్టార్ హీరోలు ఓ సినిమా చేస్తూనే.. మరో మూవీని కన్ఫర్మ్ చేస్తుంటారు. కానీ మహేష్ బాబు లైనప్ విషయంలో ఎలాంటి ప్రకటన రాకపోవడం గమనార్హం.
అయితే వారణాసి తర్వాత మహేష్ బాబు.. టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో సినిమా చేయనున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఎక్కడా ఎలాంటి లీక్ గానీ.. ప్రకటన గానీ రాకపోయినప్పటికీ వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. వారణాసి తర్వాత మహేష్, స్పిరిట్ తర్వాత సందీప్.. ఇద్దరూ కలిసి భారీ ప్రాజెక్ట్ కోసం చేతులు కలపనున్నారని అంతా అనుకున్నారు.
కానీ అది జరిగేలా కనిపించడం లేదు. ఒక వేళ ఫ్యూచర్ లో మహేష్- సందీప్ కాంబినేషన్ లో మూవీ వచ్చే ఛాన్స్ ఉన్నా.. వారణాసి, స్పిరిట్ తర్వాత వారి కలయికలో సినిమా రూపొందే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు చూసుకుంటే వారణాసి తర్వాత మహేష్ బాబు ఫ్రీగానే ఉంటారు. కానీ సందీప్ మాత్రం బిజీగా ఉండనున్నట్లు రీసెంట్ గా క్లారిటీ వచ్చింది!
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సందీప్ వంగా తదుపరి సినిమా యానిమల్ పార్క్ అని తెలిపారు. అంతే కాదు.. ఆ మూవీ షూటింగ్ 2027లో ప్రారంభం అవుతుందని చెప్పారు. దీంతో స్పిరిట్ కంప్లీట్ అయ్యాక.. యానిమల్ పార్క్ పై సందీప్ ఫోకస్ పెట్టనున్నట్లు అర్థమైంది. అందుకే మహేష్ బాబు.. నెక్స్ట్ మూవీ సందీప్ తో ఉండదని తెలుస్తోంది.
మరి సందీప్ కాకుంటే.. మహేష్ బాబు ఎవరితో వర్క్ చేయనున్నారనేది ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు. సోషల్ మీడియాలో దానిపై ఎలాంటి ఊహాగానాలు చక్కర్లు కొట్టడం లేదు. కాబట్టి మహేష్ బాబుతో వర్క్ చేసే ఛాన్స్ అందుకునే డైరెక్టర్ ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే వారణాసి రావడానికి ఇంకా ఏడాది సమయం ఉంది. కాబట్టి ఇంతలో మహేష్ నెక్స్ట్ మూవీపై ఏమైనా అప్డేట్ వస్తుందేమో వేచి చూడాలి.
