రాజమౌళి సెంటిమెంట్‌కు అనిల్ రావిపూడి విరుగుడు.. మహేష్ బాబు స్మార్ట్ ప్లాన్!
రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా సరే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా అందరికీ ఈ నెగెటివ్ సెంటిమెంట్ తగిలింది.
By: Madhu Reddy | 17 Jun 2026 12:45 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ జక్కన్న ఎస్.ఎస్. రాజమోళి దర్శకత్వంలో రాబోతున్న భారీ అడ్వెంచర్ సినిమా వారణాసి గురించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ నెక్స్ట్ ఎవరితో చేయబోతున్నారనే దానిపై ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. మహేష్, రాజమోళి సినిమా తర్వాత వచ్చే నెగెటివ్ సెంటిమెంట్‌ను బ్రేక్ చేయడానికి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో పని చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిలింనగర్‌లో టాక్ వినిపిస్తోంది. ఆ వివరాలు చూద్దాం..
‘వారణాసి’ తర్వాత ముగ్గురు దర్శకుల రేస్:
రాజమౌళి సినిమా అంటేనే ఏళ్ల తరబడి షూటింగ్ జరుగుతుంది. అందుకే ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే మహేష్ బాబు తన తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి మహేష్ బాబు నెక్స్ట్ సినిమా రేసులో ముగ్గురు క్రేజీ దర్శకుల పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. వారిలో బుచ్చిబాబు, సందీప్ రెడ్డి వంగా, అనిల్ రావిపూడి ఉన్నారు. అయితే వీరిలో ఒకరి వైపే మహేష్ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
సందీప్ వంగా బిజీ.. అనిల్‌కే ఛాన్స్:
నిజానికి ఏషియన్ సినిమాస్ బ్యానర్‌లో సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో మహేష్ సినిమా చేయాల్సి ఉంది. కానీ సందీప్ ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్, రణబీర్ కపూర్ యానిమల్ పార్క్, సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక దీంతో ఇప్పట్లో ఈ కాంబినేషన్ కుదిరేలా లేదు. అందుకే రాజమౌళి భారీ యాక్షన్ సినిమా తర్వాత కాస్త తేలికపాటి ఎంటర్‌టైనర్ చేయాలని భావిస్తున్న మహేష్.. అనిల్ రావిపూడి చెప్పిన కథకు ఓకే అనేలా ఉన్నారట.
మహేష్ బాబు ‘కోచ్’ అవతారం?:
అనిల్ రావిపూడి ఆల్రెడీ మహేష్ బాబుకు ఒక ఇంట్రెస్టింగ్ లైన్ వినిపించారట. అది ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ ‘స్పోర్ట్స్ డ్రామా’ కథ అని సమాచారం. ఇందులో మహేష్ బాబు ఒక పవర్‌ఫుల్ 'కోచ్' పాత్రలో సరికొత్తగా కనిపించబోతున్నారనే క్రేజీ టాక్ నడుస్తోంది. ఇక గతంలో వీరి కాంబోలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ఈ కొత్త ప్రాజెక్ట్‌పై అంచనాలు ఇప్పుడే పెరిగిపోతున్నాయి.
అనిల్ రావిపూడి హిట్ ఫార్ములా:
ఇండస్ట్రీలో అనిల్ రావిపూడి సినిమా తీస్తే హిట్ గ్యారెంటీ అనే ఒక బలమైన నమ్మకం ఉంది. గతేడాది వెంకటేష్ తో తో సూపర్ హిట్ కొట్టిన అనిల్, ఈ ఏడాది మన శంకర్ వరప్రసాద్ మూవీతో ఇండస్ట్రీని షేక్ చేసి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్నారు. ఇక వచ్చే ఏడాది వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో ఒక క్రేజీ మల్టీస్టార్ మూవీతో రానున్నారు. ఇలా వరుస హిట్లతో ఉన్న అనిల్ ఫార్ములా మహేష్‌కు బాగా ప్లస్ కానుంది.
రాజమౌళి శాపానికి విరుగుడు:
టాలీవుడ్‌లో ఒక విచిత్రమైన సెంటిమెంట్ ఉంది. రాజమౌళితో సినిమా చేసిన తర్వాత ఏ హీరోకైనా సరే నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది. ఇక రామ్ చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇలా అందరికీ ఈ నెగెటివ్ సెంటిమెంట్ తగిలింది. అయితే 100% సక్సెస్ ట్రాక్ రికార్డ్ ఉన్న అనిల్ రావిపూడితో సినిమా చేస్తే ఆ ‘రాజమౌళి సెంటిమెంట్’ను ఈజీగా బ్రేక్ చేయవచ్చని మహేష్ బాబు స్మార్ట్‌గా ప్లాన్ చేస్తున్నారట.
భారీ బడ్జెట్, హై వోల్టేజ్ అడ్వెంచర్ సినిమాగా రాబోతున్న ‘వారణాసి’ తర్వాత మహేష్ బాబుకు ఒక కంప్లీట్ ఫ్యామిలీ అండ్ స్పోర్ట్స్ ఎంటర్‌టైనర్ పక్కాగా సెట్ అవుతుంది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, ఎమోషన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట ఖాయం. మరి జక్కన్న సెంటిమెంట్‌ను బ్రేక్ చేస్తూ మహేష్-అనిల్ రావిపూడి కాంబో త్వరలోనే అఫీషియల్‌గా ఎప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి.
