Begin typing your search above and press return to search.

మ‌హేష్ మైండ్ లో ర‌న్ అవుతోన్న ఇద్ద‌రే ఇద్ద‌రు!

రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఎంచుకునే ప్రాజెక్ట్ అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన మైండ్‌లో ఇద్దరే ఇద్దరు పవర్‌ఫుల్ దర్శకులు ర‌న్ అవుతున్నార‌ని బలమైన ప్రచారం జరుగుతోంది.

By:  Srikanth Kontham   |   3 Sept 2026 1:00 AM IST
మ‌హేష్ మైండ్ లో ర‌న్ అవుతోన్న ఇద్ద‌రే ఇద్ద‌రు!
X

సూపర్‌స్టార్ మహేష్ -దర్శకధీరుడు రాజమౌళి కాంబినేష‌న్ లో అడ్వెంచర్ డ్రామా `వారణాసి` జాతీయ స్థాయిలో అంచనాలు అంత‌కంత‌కంత‌కు పెంచేస్తోంది. సినిమా కోసం మహేష్ ప్రత్యేకమైన ఫిజికల్ మేకోవర్ పొందుతూ ప్రపంచస్థాయి వర్క్‌షాప్‌లలో పాల్గొంటున్నారు. అయితే ఈ పాన్-వరల్డ్ ప్రాజెక్ట్ తర్వాత మహేష్ తదుపరి చిత్రం ఏ దర్శకుడితో ఉండబోతోంది? అనే అంశం ఇప్ప‌టికే ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి సినిమా తర్వాత మహేష్ ఎంచుకునే ప్రాజెక్ట్ అదే స్థాయిలో ఉండాలనే ఉద్దేశంతో ఆయన మైండ్‌లో ఇద్దరే ఇద్దరు పవర్‌ఫుల్ దర్శకులు ర‌న్ అవుతున్నార‌ని బలమైన ప్రచారం జరుగుతోంది.

వారిలో ఒకరు రా అండ్ రస్టిక్ యాక్షన్ మేకర్ సందీప్ రెడ్డి వంగా కాగా.. మరొకరు విజనరీ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్. వీరిద్దరిలో ఒకరికే మహేష్ త‌దుపరి సినిమా చేసే అవకాశం ఇవ్వనున్నారని తెలుస్తోంది. సందీప్ రెడ్డి వంగా తీర్చిదిద్దే క్యారెక్టరైజేషన్లు, హై-వోల్టేజ్ ఎమోషన్లు హీరోల ఇమేజ్‌ను సరికొత్తగా ఆవిష్కరిస్తాయి. మహేష్‌లోని వింటేజ్ మాస్ , ఇంటెన్సిటీని బయటకు తీసే సామర్థ్యం సందీప్‌కు ఉందని అభిమానులు సైతం భావిస్తున్నారు. గతంలోనే ఇద్ద‌రి మధ్య చర్చలు జరిగినప్పటికీ, సరైన సమయం కోసం నిరీక్షించారు.

తాజాగా `వారణాసి` తర్వాత మహేష్‌ను మరో స్థాయిలో నిలబెట్టే పవర్‌ఫుల్ కథ సందీప్ వద్ద ఉందనే వార్తలు తెర‌పైకి వ‌స్తున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్ తనదైన బిగ్ స్కేల్ లార్జర్ ద్యాన్ లైఫ్ ఎలివేషన్లకు, వరల్డ్ బిల్డింగ్‌కు పేరుగాంచారు. `కెజిఎఫ్`, `సలార్` వంటి చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన ప్రశాంత్ నీల్ మేకింగ్ స్టైల్ మహేష్ మాస్ ఇమేజ్‌కు తోడైతే బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం తప్పదనే అంచనాలు ఉన్నాయి. ఇద్ద‌రి కాంబినేషన్ కుదిరితే భారీ అంచనాలతో గ్లోబల్ వైడ్ మార్కెట్‌ను టార్గెట్ చేయడం సులువవుతుంది.

రాజమౌళి కాంబినేషన్ తర్వాత ప్రతీ కథానాయకుడిపై మార్కెట్ ఒత్తిడి .. ప్రేక్షకుల అంచనాలు భారీ పెరుగుతాయన్న‌ది వాస్త‌వం. అలాంటి సమయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా తన రేంజ్‌ను నిలబెట్టుకునేలా సందీప్ రెడ్డి వంగా లేదా ప్రశాంత్ నీల్‌లతో ముందుకు వెళ్లడమే సరైన వ్యూహమని మహేష్ భావిస్తున్నట్లు సమాచారం. ఇద్దరిలో ఎవరు ముందుగా మహేష్‌ను మెప్పించే స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తారో? వారితోనే ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. మొత్తానికి మహేష్ భవిష్యత్తు ప్రాజెక్ట్‌లపై స్పష్టమైన ప్లానింగ్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. సందీప్ రెడ్డి వంగా అందించే ఇంటెన్స్ డ్రామానా లేక ప్రశాంత్ నీల్ సృష్టించే లార్జర్ ద్యాన్ లైఫ్ యాక్షన్ వరల్డా అనే దానిపై త్వరలోనే క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంది.