Begin typing your search above and press return to search.

మహేష్ బాబు ను కష్టపెట్టిన దర్శకులు వీళ్లే...అందుకే వాళ్ళతో మరో సినిమా చేయలేదా?

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు... బాల నటుడిగా అలరించిన ఆయన 'రాజకుమారుడు' సినిమాతో మెయిన్ హీరోగా మారిపోయాడు.

By:  Gopi Velupala   |   24 Sept 2026 6:00 AM IST
మహేష్ బాబు ను కష్టపెట్టిన దర్శకులు వీళ్లే...అందుకే వాళ్ళతో మరో సినిమా చేయలేదా?
X

సూపర్ స్టార్ కృష్ణ నటవారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నటుడు మహేష్ బాబు... బాల నటుడిగా అలరించిన ఆయన 'రాజకుమారుడు' సినిమాతో మెయిన్ హీరోగా మారిపోయాడు. మొదటి సినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన మహేష్ బాబు ఆ తర్వాత సినిమాలతో తనకంటూ ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ముఖ్యంగా మహేష్ బాబు హీరోగా కెరియర్ ను స్టార్ట్ చేసిన మొదట్లోనే కొంతమంది స్టార్ డైరెక్టర్లు అతనితో సినిమాలు చేశారు. అందులో కొందరు అతనికి సక్సెస్ లను అందిస్తే మరి కొంతమంది ప్లాప్ లను ఇచ్చారు. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు సినిమా కోసం విపరీతంగా కష్టపడడానికి సిద్ధంగా ఉంటాడు. కానీ తను పడే కష్టానికి మించి ఒక ఇద్దరు దర్శకులు మహేష్ బాబును విపరీతంగా ఇబ్బంది పెట్టారట. అందువల్లే ఆ దర్శకులతో మహేష్ బాబు మరో సినిమా చేయలేదని చాలా మంది ఫన్నీ గా చెప్పుకుంటుంటారు. ఇంతకీ ఆ దర్శకులు ఎవరు అంటే ఒకరు తేజ కాగా, మరొకరు కృష్ణవంశీ కావడం విశేషం. తేజ డైరెక్షన్లో మహేష్ బాబు 'నిజం' అనే సినిమా చేశాడు. ఈ సినిమాలో మహేష్ బాబు సైకిల్ మీద నుంచి వచ్చి పడిపోయే సన్నివేశాన్ని ఎలాంటి డూప్ లేకుండా మహేష్ బాబు తనే రియల్ గా చేశాడు.

నిజానికి మహేష్ బాబు రియల్ గా చేసినప్పటికి ఆ సైకిల్ ఎక్కడ పడాలి అనేది తేజ డిజైన్ చేశారట. అందువల్లే సైకిల్ మీద వస్తున్న మహేష్ కి తెలియకుండానే మధ్యలో ఒక బండరాయిని పెట్టి సైకిల్ తొక్కుకుంటూ రమ్మని చెప్పాడు. ఆ సైకిల్ తొక్కే మహేష్ బాబుకి బండిరాయి ఎక్కడుందో తెలియదు కాబట్టి అనుకోకుండా రోడ్డు మధ్యలో నుంచి వస్తుంటే సైకిల్ బండ రాయి ఎక్కి కింద పడిపోతుంది. ఇక ఈ సన్నివేశాన్ని దర్శకుడు చాలా రియలెస్టిక్ గా చిత్రీకరించడానికి బండ ఎక్కడ పెట్టారో సైకిల్ ఎక్కడ పడిపోవాలో కూడా మహేష్ బాబు కి చెప్పలేదట.

అది ఆటో మేటిగ్గా జరిగితేనే బావుంటుందని రియాలెస్టిక్ గా రావడానికి అలా చేశారట. మొత్తానికైతే ఈ సినిమాలో మహేష్ బాబు అద్భుతమైనటువంటి నటనను కనపరిచాడు. సినిమా అనుకున్న రేంజ్ లో ఆడకపోయిన కూడా మహేష్ బాబుకు నటన పరంగా మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు తన ఎంటైర్ కెరీర్ ని కనక చూసుకుంటే తను అద్భుతంగా నటించిన త 3 సినిమాల్లో నిజం సినిమా కూడా ఒకటి అనే చెప్పాలి. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు ఇమేజ్ అనేది తారాస్థాయికి వెళ్లకపోయిన కూడా ఈ సినిమాతో నటుడిగా తనకంటూ ఒక పరిణితి సంపాదించుకున్నాడు.

కృష్ణవంశీ దర్శకత్వంలో చేసిన 'మురారి' సినిమా గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ సినిమాతో మహేష్ బాబు కి ఒక మంచి విజయం దక్కడమే కాకుండా తన నట పోటెన్షియాలిటీ కూడా పూర్తిస్థాయిలో బయటికి వచ్చింది. అయితే ఈ సినిమా సమయంలో కొన్ని సన్నివేశాలను దర్శకుడు రియలెస్టిక్ గా రావడానికి మహేష్ బాబు ను చాలా ఇబ్బంది పెట్టి మరి యాక్టింగ్ చేయించుకున్నారట. దాంతో మహేష్ బాబు సినిమా కోసం విపరీతంగా కష్టపడ్డాడు. అయినప్పటికి కృష్ణవంశీ తో మాత్రం మరొక సినిమా చేయలేదు. కారణం ఏంటి అంటే అతను నటులను చాలా ఇబ్బంది పెడతాడు. ఏం చేసైనా తనకు కావలసింది రాబట్టుకుంటాడు. కాబట్టి అందుకే అతనితో సినిమా చేయలేదు అంటూ మహేష్ బాబు మీద కొంతమంది కామెంట్స్ చేస్తుంటారు. నిజానికి మహేష్ కి సెట్ అయ్యే కథలను వాళ్ళు మరోసారి తన దగ్గరికి తీసుకురాలేదని అందుకే ఆయన మరోసారి వాళ్ళతో జత కట్టలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా కూడా మహేష్ బాబు తన మీద ఎలాంటి వార్తలు వచ్చినా వాటిని లైట్ తీసుకుంటాడు. కాబట్టే వేటి గురించి ఆయన పెద్దగా పట్టించుకోడు...