పెళ్లి రోజు నాడు నమ్రత స్పెషల్ పోస్ట్
టాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చే జంట మహేష్ బాబు- నమ్రత శిరోద్కర్ జంటనే.
By: Sravani Lakshmi Srungarapu | 10 Feb 2026 3:42 PM ISTటాలీవుడ్ లో బెస్ట్ కపుల్ అంటే ఎవరికైనా వెంటనే గుర్తొచ్చే జంట మహేష్ బాబు- నమ్రత శిరోద్కర్ జంటనే. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరిద్దరూ ఎంతో మంది జంటలకు ఆదర్శం. అయితే నమ్రత- మహేష్ పెళ్లి చేసుకుని ఇవాళ్టికి 21 ఏళ్లు. ఈ సందర్భంగా నమత్ర సోషల్ మీడియాలో చేసిన స్పెషల్ పోస్ట్ అందరి దృష్టిని ఎట్రాక్ట్ చేస్తోంది.
పెళ్లి రోజు సందర్భంగా నమ్రత స్పెషల్ పోస్ట్
కాలం మారినా, భావాలు మాత్రం అలాగే నిలిచిపోయాయని మరోసారి రుజువు చేసింది నమ్రత చేసిన ఈ స్పెషల్ పోస్ట్. “Still choosing you… everyday” అంటూ తన భర్త మహేష్ బాబుకు 21వ మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్టార్ డమ్, గ్లామర్, కెరీర్ ఒత్తిళ్ల మధ్య కూడా ఒక బంధాన్ని ఇంత అందంగా నిలబెట్టుకోవడం MB–నమ్రతల స్పెషాలిటీ.
ప్రేమించి పెళ్లి చేసుకున్న మహేష్- నమ్రత
మిస్ ఇండియా విజేత అయిన నమ్రత తర్వాత హీరోయిన్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సమయం నుంచే మహేష్ బాబుతో పరిచయముంది. వంశీ మూవీ టైమ్ లో మొదలైన వీరిద్దరి స్నేహం, ఆ తర్వాత ప్రేమగా మారి, అది పెళ్లి వరకు వెళ్లింది. 2005, ఫిబ్రవరి 10న వీరిద్దరూ పెళ్లితో ఒక్కటయ్యారు. పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరి జంట టాలీవుడ్ ఇండస్ట్రీకే ఓ ఐడియల్ కపుల్ గా నిలిచింది.
సినిమాలను కాదని, ఫ్యామిలీకే ఓటేసిన నమ్రత
అయితే పెళ్లి తర్వాత సినిమాలను వదిలేసి, ఫ్యామిలీ లైఫ్ కే ప్రాధాన్యమిచ్చిన నమ్రత, మహేష్ బాబు కెరీర్లో కీలక దశల్లో భార్యగా అతనికి మద్దతుగా నిలుస్తూ, పిల్లల్ని చూసుకుంటూ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు నమ్రత. వీరికి 2006లో గౌతమ్ అనే అబ్బాయి పుట్టగా, 2012లో సితార వీరి కుటుంబంలోకి ఎంటరైంది. గౌతమ్ బాగా పెద్దవాడై విదేశాల్లో చదువుకుంటుంటే, సితార ఇండియాలోనే చదువుకుంటూ, మరోవైపు యాడ్స్ లో నటిస్తూ ఆడియన్స్ ను అలరిస్తోంది.
ఇక మహేష్ బాబు విషయానికొస్తే ప్రొఫెషనల్ గా చూసుకుంటే తానెంత పెద్ద సూపర్ స్టార్ అయినా, ఇంట్లో మాత్రం సాధారణ భర్త, తండ్రిగా ఉంటారనే మాట తరచూ వినిపిస్తుంటుంది. ఫ్యామిలీకి సరిగ్గా సమయాన్ని కేటాయించడం, కుటుంబం మొత్తం కలిసి రెగ్యులర్ గా విదేశాలకు వెకేషన్లకు వెళ్తూ వారితో కలిసి క్వాలిటీ టైమ్ ను స్పెండ్ చేస్తుంటారు మహేష్. 21 ఏళ్ల వారి జర్నీలో ప్రేమ, గౌరవం, ఒకరినొకరు అర్థం చేసుకునే విధానం.. ఇవన్నీ వారి బంధాన్ని మరింత స్ట్రాంగ్ గా చేశాయి. పెళ్లై ఇన్నేళ్లవుతున్నా, ప్రతీ రోజూ నిన్నే సెలెక్ట్ చేసుకుంటున్నాను అని నమ్రత చెప్తున్నారంటే, వారిద్దరి మధ్య ఎంత బాండింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఈ జంట కేవలం సెలబ్రిటీ కపుల్ మాత్రమే కాదు, కొన్ని కోట్ల మంది ఫ్యాన్స్ కు ఓ రిలేషన్‌షిప్ గోల్ కూడా.
