Begin typing your search above and press return to search.

సూప‌ర్ స్టార్ క్యాప్ రేటెంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏం చేసినా, ఎలా క‌నిపించినా ఫ్యాన్స్ మ‌ధ్య డిస్క‌ష‌న్ టాపిక్ గా మార‌డం కొత్తేమీ కాదు.

By:  Sravani Lakshmi Srungarapu   |   9 July 2026 4:03 PM IST
సూప‌ర్ స్టార్ క్యాప్ రేటెంతో తెలిస్తే నోరెళ్ల‌బెట్టాల్సిందే!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఏం చేసినా, ఎలా క‌నిపించినా ఫ్యాన్స్ మ‌ధ్య డిస్క‌ష‌న్ టాపిక్ గా మార‌డం కొత్తేమీ కాదు. ఆయన సినిమాలు మాత్రమే కాదు, ప‌ర్స‌న‌ల్ స్టైల్ కూడా తరచూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటుంది. తాజాగా మహేష్ ధరించిన ఒక క్యాప్ ఇప్పుడు నెటిజన్ల దృష్టిని పూర్తిగా ఆకర్షించింది. ప్రముఖ లగ్జరీ ఫ్యాషన్ బ్రాండ్ లూయిస్ విట్టన్‌కు చెందిన ఈ క్యాప్ ధర సుమారు రూ.77,500గా ప్రచారం జరుగుతుండటంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిస్క‌ష‌న్ మొదలైంది.

ఈ క్యాప్‌కు సంబంధించిన ఫొటోలు వైరల్ కావడంతో ఫ్యాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొంద‌రు సూపర్ స్టార్ స్టైల్ అంటే ఇదేన‌ని కామెంట్స్ చేస్తుంటే, మ‌రికొంద‌రు మహేశ్ లుక్‌కు ఈ క్యాప్ పర్ఫెక్ట్‌గా సెట్ అయింద‌ని కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొంద‌రు ఒక సాధారణ క్యాప్‌కు ఇంత భారీ ధర ఉండటంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నవారూ ఉన్నారు. ఫ్యాషన్ విషయంలో ఇంట‌ర్నేష‌న‌ల్ బ్రాండ్స్ ను సెలెక్ట్ చేసుకోవ‌డం మ‌హేష్ కు కొత్తేమీ కాదని సినీ అభిమానులు గుర్తుచేస్తున్నారు.

ఇక సినిమాల విష‌యానికొస్తే, మ‌హేష్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న వారణాసి సినిమాపై కూడా ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమాగా ప్రచారం పొందుతోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న‌ ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుందని ఆల్రెడీ రాజ‌మౌళి చెప్పిన విష‌యం తెలిసిందే. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్, యాక్షన్ ఎపిసోడ్లు, విజువల్ స్కేల్ పరంగా ఈ సినిమా భారతీయ సినీ హిస్ట‌రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాలనే టార్గెట్ తో మేకర్స్ పనిచేస్తున్నట్లు సమాచారం.

మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న వారణాసి నుంచి స్పెషల్ టీజ‌ర్ లేదా ఫస్ట్ లుక్‌కు మించిన విజువల్ ట్రీట్ వచ్చే అవకాశాలపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. అయితే దీనిపై చిత్రబృందం ఇంకా ఎలాంటి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ ఇవ్వ‌లేదు. అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ప్రియాంక చోప్రా హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక ప్రతినాయక పాత్రలో కనిపించనున్న విష‌యం తెలిసిందే. ఓ వైపు విలువైన లగ్జరీ క్యాప్‌తో మహేష్ బాబు స్టైల్ వార్తల్లో నిలుస్తుండగా, మరోవైపు వారణాసి'పై వస్తున్న ప్రతి అప్డేట్ ఫ్యాన్స్ అంచనాలను మరింత పెంచుతోంది.