వారణాసిలో రాముడు నిడివి ఎంతంటే?
దర్శకధీరుడు రాజమౌళి ప్రతి సినిమాలోనూ భారీ ఎమోషనల్ హై, ఊహకందని సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది.
By: Srikanth Kontham | 9 April 2026 8:34 AM ISTదర్శకధీరుడు రాజమౌళి ప్రతి సినిమాలోనూ భారీ ఎమోషనల్ హై, ఊహకందని సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి`లోనూ అలాంటి ఒక భారీ సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కథాంశంలో భాగంగా మహేష్ సుమారు 25 నిమిషాల పాటు శ్రీరాముడి గెటప్‌లో కనిపించనున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చకొచ్చింది. వారణాసి నేపథ్యంలో సాగే ఓ కీలక ఘట్టంలో మహేష్ ను దైవిక రూపంలో రాజమౌళి ఆవిష్క రిస్తున్నారు. చిన్నపాటి గ్లింప్స్ లా కాకుండా? ఏకంగా 25 నిమిషాల నిడివి గల ఒక భారీ ఎపిసోడ్‌ను రాజమౌళి డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇందులో మహేష్ రాముడిగా కనిపించడమే కాదు. తనదైన శైలిలో ఒక అత్యంత కీలకమైన యుద్ధ సన్నివేశంలో పాల్గొంటారని టాక్. రాజమౌళి మార్క్ గ్రాండియర్, మహేష్ ఇంటెన్సిటీ కలిస్తే వెండితెరపై ఆ దృశ్యం విజువల్ ఫీస్ట్‌లా ఉంటుం దనడంలో సందేహం లేదు. ఆధ్యాత్మిక నగరం వారణాసి ఈ ఎపిసోడ్‌కు పర్‌ఫెక్ట్ బ్యాక్‌డ్రాప్‌గా నిలవనుందిట. మహేష్ కు ఉన్న క్లాస్ అప్పీల్, రాజమౌళి ఇచ్చే మాస్ ఎలివేషన్ 25 నిమిషాల ఎపిసోడ్‌ను సినిమా మొత్తానికే హైలైట్‌గా మారుస్తాయని చెప్పొచ్చు.
ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో `రామాయణం` ,పౌరాణిక గాథలపై విపరీతమైన ఆదరణ పెరిగింది. రామాయణంలో రణబీర్ కపూర్ పూర్తి నిడివి రాముడి పాత్రలు చేస్తోన్న తరుణంలో రాజమౌళి ఓ అడ్వెంచర్ సినిమాలో మహేష్‌ను ఇలా చూపించడం అనేది వ్యూహాత్మకంగా కూడా ఎంతో కలిసొచ్చే అంశం. ఇది తెలుగు ప్రేక్షకులే కాదు దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌ను ఎమోషనల్‌గా కనెక్ట్ చేయడానికి జక్కన్న వేసిన మాస్టర్ ప్లాన్‌గా కనిపిస్తోంది. ఈ ఎపిసోడ్ కేవలం భక్తి కోణంలోనే కాకుండా కథానాయకుడి పాత్రలోని సాహసోపేతమైన కోణాన్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడుతుందని తెలుస్తోంది.
సామాన్యుడు సాహసిగా మారే క్రమంలో పురాణ పురుషుల స్పూర్తిని లేదా వారి లక్షణాలను పుణికిపుచ్చుకోవడం అనే అంశంపై రాజమౌళి దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఆ 25 నిమిషాల్లో మహేష్ నటన, బాడీ లాంగ్వేజ్ రాజమౌళి మేకింగ్ స్టైల్ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు తగ్గట్టుగా ఉండబోతాయి? అనడంలో డౌట్ లేదు.అయితే చిత్ర యూనిట్ నుంచి దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న తీరు చూస్తుంటే రాజమౌళి మరోసారి తన విజువల్ మాయాజాలంతో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.`వారణాసి` వీధులు, గంగా హారతి బ్యాక్‌డ్రాప్, రాముడిగా మహేష్ ఇవన్నీ కలిస్తే థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయం. మరి ఈ విజువల్ వండర్ వెండితెరపై ఎలా ఉండబోతుందో తెలియాలంటే మేకర్స్ ఇచ్చే అప్‌డేట్ వరకు వేచి చూడాల్సిందే.
