మహేష్ లుక్ ముందే రానుందా?
ముఖ్యంగా మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందోనని.. ఆయన పాత్ర పేరు ఏమై ఉంటుందోనని సోషల్ మీడియాలో తెగ డిస్కస్ చేసుకుంటున్నారు.
By: M Prashanth | 13 Nov 2025 8:00 PM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పుడు దర్శక ధీరుడు రాజమౌళితో వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. పాన్ వరల్డ్ రేంజ్ లో భారీ బడ్జెట్ తో పెద్ద ఎత్తున రూపొందుతున్న ఆ మూవీని గ్లోబ్ ట్రాటర్ అంటూ మేకర్స్ ప్రమోట్ చేస్తుండగా.. ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అది కూడా హై రేంజ్ లో ఉన్నాయని చెప్పాలి.
ముఖ్యంగా గ్లోబ్ ట్రాటర్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రీసెంట్ గా మాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తోపాటు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా లుక్స్ ను రిలీజ్ చేయగా.. సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి. అనేక మంది సినీ ప్రియుల దృష్టిని కూడా ఆకర్షించాయి.
అయితే ఇప్పుడు అందరి ఫోకస్ మహేష్ బాబు లుక్ పైనే ఉంది. ఎందుకంటే కొన్ని నెలల క్రితం రాజమౌళి రిలీజ్ చేసిన ప్రీ లుక్ పోస్టర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. దీంతో ఆయన అవతార్.. ఎలా ఉండబోతుందోనన్న ఉత్సుకత ఇప్పుడు ప్రతి ఒక్క ఫ్యాన్ తోపాటు సినీ ప్రియుల్లో కనిపిస్తుంది. ఎంతో ఈగర్ గా అంతా వెయిట్ చేస్తున్నారు.
ముఖ్యంగా మహేష్ బాబు లుక్ ఎలా ఉంటుందోనని.. ఆయన పాత్ర పేరు ఏమై ఉంటుందోనని సోషల్ మీడియాలో తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. అయితే మహేష్ లుక్.. శుక్రవారం విడుదల అయ్యే అవకాశం ఉందని ఇప్పుడు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంటే ఈవెంట్ కు ఒక ముందు రోజు గానే రిలీజ్ చేయనున్నారని సమాచారం.
నిజానికి.. నవంబర్ 15వ తేదీన హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ ఈవెంట్ జరగనుంది. అందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతుండగా.. ఈవెంట్ లో టైటిల్ ను రివీల్ చేస్తారని సమాచారం. ఆ సమయంలో మహేష్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని వార్తలు రాగా.. ఇప్పుడు ముందు రోజే విడుదల
అవ్వనుందని తెలుస్తోంది.
ఏదేమైనా, రాజమౌళి- మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న ప్రాజెక్ట్ నుంచి సూపర్ స్టార్ లుక్ కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా కౌంట్ డౌన్ కూడా మొదలుపెట్టేశారు. ఇప్పటికే జక్కన్న పక్కా ప్లాన్ తో సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజమౌళి ఎప్పుడూ తన సినిమాల విషయంలో అద్భుతమైన ప్రెజెంటేషన్ ఇస్తారు. కాబట్టి మహేష్ బాబు లుక్ కూడా ప్రత్యేకంగా ఉంటుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. మరి చూడాలి ఏం జరుగుతుందో.
