Begin typing your search above and press return to search.

ఏడాది మొత్తం మహేష్ బాబు ఖాళీగా ఉండాల్సిందేనా?

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘వారణాసి’ షూటింగ్ పూర్తయింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా మిగిలి ఉండటంతో సినిమా విడుదల 2027 ఆగస్టు లేదా ఏడాది చివరి వరకు వాయిదా పడే అవకాశం ఉందని సమాచారం. దీంతో మహేష్ బాబు తదుపరి సినిమా 2028లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

By:  Ramesh Palla   |   27 Nov 2026 10:42 PM IST
ఏడాది మొత్తం మహేష్ బాబు ఖాళీగా ఉండాల్సిందేనా?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు చివరగా 2024 సంక్రాంతికి ‘గుంటూరు కారం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ సినిమా విడుదల అయ్యి మరికొన్ని రోజులు అయితే మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అయినా ఇప్పటి వరకు ఆయన కొత్త సినిమా విడుదల కాలేదు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్‌ బాబు హీరోగా రూపొందుతున్న 'వారణాసి' సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌లో అనే ప్రకటన వచ్చింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్ వర్క్ ఆలస్యం అవుతున్న కారణంగా వచ్చే ఏడాది ఆగస్టు లేదా వచ్చే ఏడాదిలోనే చివరి వరకు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. వారణాసి సినిమా అప్‌డేట్‌ ఏంటీ.. ఏంటీ అంటూ ఫ్యాన్స్ పదే పదే యూనిట్‌ సభ్యులను, సోషల్‌ మీడియా ద్వారా అడుగున్న నేపథ్యంలో ఇటీవలే అధికారిక ప్రకటన వచ్చింది.

మహేష్‌ బాబు వారణాసి సినిమా షూటింగ్‌...

వారణాసి సినిమా షూటింగ్ పూర్తి అయినట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. సినిమాకు సంబంధించిన పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ బ్యాలన్స్ ఉన్నట్లుగా మేకర్స్‌ పేర్కొన్నారు. ఇతర దర్శకుల సినిమాలు, చిన్న సినిమాలు అయితే వీఎఫ్‌ఎక్స్‌ వర్క్‌, ఇతర పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ రెండు మూడు నెలలు మహా అయితే ఆరు నెలలు తీసుకుని పూర్తి చేస్తారు. కానీ రాజమౌళి సినిమా కనుక కాస్త ఎక్కువ సమయం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే 2027 చివరి వరకు ఈ సినిమా విడుదల ఎప్పుడు ఉంటుందో అని ఫ్యాన్స్‌ ఎదురు చూడాల్సి రావచ్చు. రాజమౌళి తో సినిమా అంటే ఏ హీరో అయినా ఆ సినిమా పూర్తి అయ్యి, విడుదల అయ్యే వరకు మరే సినిమాను చేయడానికి వీలు లేదు. ఆ విషయం మహేష్‌ బాబుకు కూడా వర్తిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కనుక మహేష్‌ బాబు కొత్త సినిమా ప్రారంభం కచ్చితంగా 2028లోనే ఉండే అవకాశం ఉంది.

రాజమౌళి ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌...

ఇప్పటికే వారణాసి షూటింగ్‌ పూర్తి చేసినట్లుగా ప్రకటన వచ్చింది, కనుక ఈ ఏడాది కాలం పాటు మహేష్‌ బాబు ఏం చేస్తాడు అనేది చాలా మందిలో ఉన్న ప్రశ్న. సాధారణంగా అయితే మహేష్‌ బాబు తన ప్రతి సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత కొన్ని వారాల పాటు హాలీడే ట్రిప్‌ కి వెళ్లడం మనం చూస్తూ ఉంటాం. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత ఏకంగా ఏడాది కాలం పాటు మహేష్‌ బాబు పూర్తి హాలీడేస్‌లోనే ఉండాల్సింది. ఈ బ్రేక్ టైంలో మహేష్‌ బాబు మంచి కథలు ఎంపిక చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. పిల్లలతో ఆయన ఎప్పటిలాగే ఈ ఖాళీ సమయంను గడిపి ఎంజాయ్‌ చేసే అవకాశాలు ఉన్నాయి. మహేష్‌ బాబు కథలు విని పెట్టుకుని వారణాసి విడుదల అయిన వెంటనే బ్యాక్ టు బ్యాక్‌ రెండు సినిమాలను మొదలు పెట్టే విధంగా స్క్రిప్ట్‌ ను రెడీ చేయించుకోవాలని కూడా కొందరు సూచిస్తున్నారు.

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబోలో వారణాసి మూవీ...

రాజమౌళి దర్శకత్వంలో దాదాపుగా రూ.1400 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న 'వారణాసి' సినిమాను పాన్‌ వరల్డ్‌ రేంజ్‌లో విడుదల చేయబోతున్నారు. ఇప్పటి వరకు జక్కన్న సినిమాలు ఇండియన్‌ సినీ ప్రేక్షకులను మెప్పించాయి. ఈసారి అంతకు మించి అన్నట్లుగా గ్లోబల్‌ లెవల్‌ లో సినిమాను తీసుకు వెళ్లే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్‌ కి ఒక ఆస్కార్‌ ను సొంతం చేసుకున్న జక్కన్న టీం, ఈసారి అంతకు మించి ఆస్కార్‌ లను దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి వారణాసి షూటింగ్‌ పూర్తి చేసి మహేష్ బాబు రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లి పోయినా జక్కన్న అండ్‌ టీం మాత్రం కఠినంగా శ్రమించాల్సి ఉంటుంది.

మధ్యలో మహేష్‌ బాబు డబ్బింగ్‌ కోసం, ఇతర పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కోసం అప్పుడప్పుడు డేట్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇక ప్రమోషన్‌ సమయంలో కనీసం రెండు నెలల పాటు మహేష్‌ బాబును జక్కన్న మళ్లీ కష్టపెట్టే అవకాశాలు ఉన్నాయి. మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌ లు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారని, సినిమా విడుదల తర్వాత వారి కష్టం స్క్రీన్‌ పై కనిపించబోతుందని యూనిట్‌ సభ్యులు అంటున్నారు. ఇక ఈ సినిమా కోసం కీరవాణి అందిస్తున్న సంగీతం నెవ్వర్‌ బిఫోర్‌ అన్నట్లుగా ఉండబోతుందని కూడా యూనిట్‌ సభ్యులు ధీమాతో చెబుతున్నారు.