మహేష్ చనువుగా మాట్లాడే వ్యక్తి అతడు!
దాదాపు చాలా మంది స్టార్ హీరోలు సహ నటులతో చనువుగానే ఉంటారు. వారితో కాంబినేషన్ సన్నివేశాలుటాయి కాబట్టి కలిసి పనిచేసే క్రమంలో క్లోజ్ అవుతుంటారు.
By: Srikanth Kontham | 20 Nov 2025 8:00 PM ISTదాదాపు చాలా మంది స్టార్ హీరోలు సహ నటులతో చనువుగానే ఉంటారు. వారితో కాంబినేషన్ సన్నివేశాలుటాయి కాబట్టి కలిసి పనిచేసే క్రమంలో క్లోజ్ అవుతుంటారు. అప్పటి నుంచి ఎక్కడ కనిపించినా పలకరించడం.. మాట్లాడటం వంటివి జరుగుతుంటాయి. సీనియర్లను మినహాయిస్తే మహేష్, చరణ్, ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్ వీళ్లంతా సహన టులతో ఎంత సరదాగా ఉంటారో? చాలా మంది నటులు చెప్పారు. మహేష్ కనిపించరు గానీ సైలెంట్ గా సెటైర్లు వేస్తాడంటారు. ఎన్టీఆర్ సెట్లో ఉన్నంత సేపు ఒకటే అల్లరి వాతావరణం ఉంటుందంటారు.
బన్నీ కూడా అంతే సరదాగా ఉంటాడు. ఈ ముగ్గురితో పొలిస్తే చరణ్ కాస్త స్లో గా ఉంటాడు. మరీ అంత యాక్టివ్ గా అనిపించడు. అయితే గుంపులో ఉన్న వాళ్లను మాత్రం గుర్తించడం ఏ స్టార్ హీరోకైనా కష్టమే. వాళ్ల కళ్లలో పడేవరకూ అలాంటి వారికి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఒకవేళ గుర్తించినా పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండదు. అయితే మహేష్ మాత్రం అలాంటి నటుడిని ఒకరిని గుర్తించడమే కాదు..పలకరించి మాట్లాడటం..ఖాళీగా ఉంటే పని ఇప్పించడం వంటివి చేస్తారని తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అతడే చెప్పాడు.
అతడి పేరు ఫైటర్ రామకృష్ణ. మహేష్ హీరోగా నటించిన `శ్రీమంతుడు`తో వెలుగులోకి వచ్చాడు. అందులో భారీ శరీరాకృతితో కనిపిస్తాడు. సినిమాలో చాలా యాక్షన్ సన్నివేశాల్లో ఉంటాడు రామకృష్ణ. అప్పటి నుంచే మహేష్ అతడిని గుర్తు పట్టడం మొదలైంది. మహేష్ తన అసిస్టెంట్ రాజును వాడు ఏం చేస్తున్నాడు? అని అడిగేవారుట. ఆ విషయం రాజు వచ్చి చెప్పేవాడు. ఇంటిదగ్గర ఉన్నాడు? అంటే వెంటనే పిలిపించేవారు. కాసేపు సాంగ్ లో నిలబడమను అని చెప్పించేవారు. అప్పటికీ ఏ సీన్ అయితే అందులో పెట్టేవారు.
మళ్లీ అదే రాజును పిలిపించి పేమెంట్ ఇచ్చి పంపించండి అని చెప్పేవారు. ఆయన జేబులో నుంచి తీసి ఇవ్వకపోయినా? ఏదో రూపంలో సహాయం చేసేవారు. గౌరవ ప్రదంగా పని కల్పించేవారు. రాజమౌళి షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా అడిగారు. షూటింగ్ లో ఉన్నాడని చెబితే? ఆ ఉంటే పర్లేదు వదిలేయ్ అని రాజుతో అనేవారు. అవన్నీ రాజు నాకొచ్చి చెప్పేవాడు. అంత పెద్ద స్టార్ నన్ను గుర్తు పెట్టుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నాడు రామకృష్ణ. ఎన్టీఆర్ కూడా తనని అలాగే చూస్తారన్నాడు. వ్యసనాలు మానేయండిరా? అని కుటుంబ జాగ్రత్తలు చెబుతుంటారు.
