Begin typing your search above and press return to search.

గ్లోబ్ ట్రాటర్ 'సంచారి'.. ఈ ట్విస్ట్ ఏంటి?

ప్రస్తుతం సోషల్ మీడియాలో సాంగ్ తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆ పాటపై కాపీరైట్ ఆరోపణలు వినిపిస్తున్నాయి.

By:  M Prashanth   |   13 Nov 2025 9:00 PM IST
గ్లోబ్ ట్రాటర్ సంచారి.. ఈ ట్విస్ట్ ఏంటి?
X

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్‌ లో రూపొందుతున్న భారీ చిత్రం గ్లోబ్ ట్రాటర్ నుంచి రీసెంట్ గా మొదటి పాట రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సంచారి టైటిల్ తో వచ్చిన ఆ పాటను స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ ఆలపించడం విశేషం. మహేష్ రోల్ వీరత్వాన్ని, యాత్రను ఆ పాట వర్ణించిందనే చెప్పాలి.

అయితే శ్రుతి హాసన్ గాత్రం గూస్ బంప్స్ తెప్పించేలా ఉండడంతో పాట విని ఫ్యాన్స్, మ్యూజిక్ లవర్స్ పండగ చేసుకుంటున్నారు. చైతన్య ప్రసాద్ రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయని చెబుతున్నారు. కీరవాణి కంపోజిషన్ అదిరిపోయిందని అంటున్నారు. ఓవరాల్ గా సాంగ్ మంత్రముగ్ధుల్ని చేస్తుందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో సాంగ్ తెగ వైరల్ అవుతోంది. అదే సమయంలో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ఆ పాటపై కాపీరైట్ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2WEI, ఎడ్డా హేస్ రాసిన బర్న్‌ సాంగ్ లాగే సంచారి పాట ఉందని కొందరు నెటిజన్లు ఇప్పుడు చెబుతున్నారు. అంతే కాదు కంపేర్ చేసిన ఆడియో క్లిప్స్ ను కూడా పోస్ట్ చేస్తున్నారు.

అది విన్న కొందరు నెటిజన్లు.. కాస్త చిన్న సమిలారిటీస్ ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానిపై మూవీ టీమ్ నుంచి ఇప్పటి వరకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ప్రస్తుతం వారంతా ఎల్లుండి రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే భారీ ఈవెంట్ ఏర్పాట్లతో బిజీ బిజీగా ఉన్నారు.

నిజానికి.. SSMB 29 ప్రాజెక్టు ప్రమోషన్స్.. సంచారి సాంగ్ తో మొదలయ్యాయని చెప్పాలి. కొన్ని నెలల క్రితం జస్ట్ ప్రీ లుక్ ను విడుదల చేసిన జక్కన్న.. సంచారి సాంగ్ ను సడెన్ సర్పైజ్ గా రిలీజ్ చేసి సందడి చేశారు. మంచి అంచనాలు కూడా క్రియేట్ చేశారు. కానీ పాటపై కాపీరైట్ గుసగుసలు రావడంతో హాట్ టాపిక్ గా మారింది.

అయితే నెటిజన్లు పోస్ట్ చేస్తున్న ఆడియో క్లిప్స్ లో సిమిలారిటీస్ చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి. దీంతో మ్యూజిక్ వరల్డ్ లో అలాంటివి కామన్ అని పలువురు మూవీ లవర్స్ ఇప్పుడు అభిప్రాయపడుతున్నారు. రాజమౌళి అలాంటి విషయాల్లో ఎప్పుడు మిస్టేక్ చేయరని అంటున్నారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు చిన్న సిమిలారిటీ.. సాంగ్ చుట్టూ కాపీ రైట్ ఆరోపణ వచ్చేలా చేసింది. మరి దీనిపై మేకర్స్ రెస్పాండ్ అవుతారేమో చూడాలి.