మహేష్ బాలీవుడ్ వెళ్తాడా..?
ఐతే ఇప్పుడు అదే దారిలో మహేష్ కూడా వస్తున్నాడని అనిపిస్తుంది. మహేష్ 29 సినిమా తర్వాత కచ్చితంగా బాలీవుడ్ నుంచి మన సూపర్ స్టార్ కి ఛాన్స్ లు వస్తాయి.
By: Ramesh Boddu | 31 Aug 2025 10:24 AM ISTబాలీవుడ్ నన్ను ఎఫర్డ్ చేయలేదని ఒకానొక టైం లో చెప్పాడు సూపర్ స్టార్ మహేష్. ఆయన అలా ఎందుకన్నాడు అన్నది అప్పుడు అర్ధం కాలేదు కానీ ఆ తర్వాత మన స్టార్స్ హిందీలో సినిమాలు చేస్తే ఆ విషయం కాస్త అర్థమైంది. ముఖ్యంగా ప్రభాస్ తో ఆదిపురుష్, చరణ్ జంజీర్ రీసెంట్ గా ఎన్ టీ ఆర్ వార్ 2 వచ్చాయి. 3 సినిమాలు మన స్టార్ ఇమేజ్ లకు భిన్నంగా రిజల్ట్ లు వచ్చాయి. ఐతే రాజమౌళి సినిమా తర్వాత ప్రతి ఒక్కరికి పాన్ ఇండియా ఇమేజ్ రావడం సహజమే. అందుకే ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ వార్ 2 చేశాడు. ఇప్పుడు రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తున్నాడు.
మహేష్ ఫుల్ సపోర్ట్..
ఆ సినిమా ఐతే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ షేక్ చేసేలా ఉంటుందని టాక్. మహేష్ కూడా అందుకు ఫుల్ సపోర్ట్ అందిస్తున్నాడు. మహేష్ రాజమౌళి ఈ కాంబో సినిమా నిజంగానే సినీ లవర్స్ కి సూపర్ ఐ ఫీస్ట్ అందిస్తుందని చెప్పొచ్చు. జక్కన్న సినిమా తర్వాత ఏ హీరో అయినా కూడా హిందీ సినిమాలు చేయాల్సిందే. ఎంద్కంటే రాజమౌళితో సినిమా చేశాక బాలీవుడ్ లో కూడా భారీ మార్కెట్ ఏర్పడుతుంది.
అందుకే చరణ్, ప్రభాస్, ఎన్టీఆర్ ఇలా అందరు బాలీవుడ్ సినిమాలు చేస్తున్నారు. ఐతే ఇప్పుడు అదే దారిలో మహేష్ కూడా వస్తున్నాడని అనిపిస్తుంది. మహేష్ 29 సినిమా తర్వాత కచ్చితంగా బాలీవుడ్ నుంచి మన సూపర్ స్టార్ కి ఛాన్స్ లు వస్తాయి. ఐతే ఆప్షన్ ఏం తీసుకోవాలన్నది మహేష్ చేతుల్లో ఉంటుంది. ఎలాగు జక్కన్న సినిమా తర్వాత పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి మహేష్ రేంజ్ మరింత పెరుగుతుంది.
మహేషే బాలీవుడ్ సినిమాలు..
సో మహేష్ కూడా నచ్చిన కథ వస్తే బాలీవుడ్ వెళ్లక తప్పదు. ఐతే ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఎప్పుడు వస్తుందా అని ఎగ్జైటింగ్ గా ఉన్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్. బాలీవుడ్ తనని మోయలేదని ఒకప్పుడు అన్న మహేషే మళ్లీ బాలీవుడ్ సినిమాలు చేస్తాడా అంటే సరైన టైం వచ్చినప్పుడు సరైన డెసిషన్ సరైన స్టెప్ తీసుకోవడంలోనే అసలైన మజా ఉంటుంది. సో తప్పకుండా మహేష్ ఫ్యాన్స్ కి డబుల్ ఫీస్ట్ కన్ఫర్మ్ అని చెప్పొచ్చు.
మహేష్ కూడా పాన్ ఇండియా మార్కెట్ ఓపెన్ చేస్తే ఇక మీదట ఆయన కూడా వరుసగా నేషనల్ వైడ్ అలరించే సినిమాలు చేసే సత్తా ఉంటుంది. మరి ఎస్.ఎస్.ఎం.బి 29 తో మహేష్ మార్కెట్ గ్లోబల్ వైడ్ గా పెరిగే ఛాన్స్ ఉంది కాబట్టి సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.
