Begin typing your search above and press return to search.

హీరో స‌క్సెస్ తో ఎంతో గ‌ర్వంగా భార్య‌!

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియా సినిమాలు చేయ‌క‌పోయినా.

By:  Srikanth Kontham   |   3 May 2026 6:36 PM IST
హీరో స‌క్సెస్ తో ఎంతో గ‌ర్వంగా భార్య‌!
X

సూపర్ స్టార్ మహేష్ క్రేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పాన్ ఇండియా సినిమాలు చేయ‌క‌పోయినా. ఆ రేంజ్ పాలోయింగ్ ఇప్ప‌టికే మ‌హేష్ సొంతం. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ అంతర్జాతీయ వేదికపై మహేష్ ను తెలుగు సినిమాలోనే అతిపెద్ద నటుడు అని సంబోధించడంతో భార్య నమ్రత శిరోద్కర్ ఎంతో గర్వంగా ఫీల్ అయ్యారు.ఈ ఘటన మహేష్ నటిస్తోన్న‌ ప్రతిష్టాత్మక చిత్రం `వారణాసి` షూటింగ్ కోసం విదేశాల‌కు వెళ్లినప్పుడు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఒక అధికారిక కార్యక్రమంలో భాగంగా నిర్వాహకులు మహేష్ ను వేదికపైకి ఆహ్వానిస్తూ ఆయన స్టార్‌డమ్‌ను కొనియాడారు.

ఆ సమయంలో అక్కడే ఉన్న నమ్రత భర్తకు ద‌క్కుతోన్న‌ గౌరవాన్ని చూసి ఎంతో ఉత్సాహంగా చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. మహేష్ వెనుక బలమైన శక్తిగా నిలిచే నమ్రత ఆయన ప్రతి విజయానికి ఎంతో అండగా ఉంటారని మరోసారి ప్రూవ్ అయింది. నమ్రత శిరోద్కర్ మహేష్ బాబు భార్యగానే గానే కాదు. మ‌హేష్ కెరీర్‌ను, బ్రాండ్ ఇమేజ్‌ను మేనేజ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తారన్న‌ది తెలిసిందే. షూటింగ్ లొకేషన్లలోనే కాదు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా మహేష్‌తో కలిసి చురుగ్గా పాల్గొంటారు. మహేష్ కు లభించే ప్రతి ప్రశంసను తన సొంత విజయంగా భావిస్తారు.

ఈ వైఖ‌రి చూసి నెటిజన్లు సపోర్టివ్ వైఫ్ అంటూ నెటి జ‌నులు ఎప్ప‌టిక‌ప్పుడు ప్రశంసిస్తుంటారు. `నిజమైన సూపర్ స్టార్‌కి దక్కాల్సిన గౌరవం ఇదే. `నమ్రత గారు మహేష్ గారికి లభించే ప్రతి అప్లాజ్‌ను ఎంజాయ్ చేయడం చూడముచ్చటగా ఉంది` ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. మహేష్ స్టార్‌డమ్‌ను అంతర్జాతీయ స్థాయిలో గుర్తించడం తెలుగు సినిమా గర్వించదగ్గ విషయమని ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. టాలీవుడ్ ఆద‌ర్శ‌దం ప‌తులంటూ నెటి జ‌నులెప్పుడు ఈ జంటను కొనియాడుతుంటారు మహేష్ -నమ్రత శిరోద్కర్ మధ్య అనుబంధం చూస్తుంటే? విజేత వెనుక ఒక బలమైన వ్యక్తి ఉంటారనే మాట అక్షర సత్యమనిపిస్తోంది.

`వార‌ణాసి` గ్లోబ‌ల్ స్థాయిలో స‌క్సెస్ అయిందంటే మ‌హేష్ ఇమేజ్ అంత‌ర్జాతీయంగానూ రీచ్ అవుతుంది. నాటి నుంచి మహేష్ ను ప్ర‌పంచం ఓ హాలీవుడ్ స్టార్ గానే చూస్తుందన‌డంలో ఎలాంటి సందేహం లేదు. మ‌హేష్ వ్య‌క్తిగ‌త స్టైలింగ్ వెనుక న‌మ్ర‌త‌ను కీల‌క పాత్ర‌ధారిగాను చెబుతారు. న‌మ్ర‌త మిస్ ఇండియా యూనివ‌ర్శ్ టైటిల్ గెలుచు కున్న సంగ‌తి తెలిసిందే. న‌టిగా అనుకున్నంత‌ స‌క్సెస్ ను చూడ‌క‌పోయినా? మ‌హేష్ స‌తీమ‌ణిగా మాత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అన్నింటికి మించి మ‌హేష్ గొప్ప స‌తీమ‌ణిగా ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలిచారు.