మహేష్ కి అసలైన సవాల్ మొదలైంది!
సూపర్ స్టార్ మహేష్ కి అసలైన సవాల్ కి సమయం ఆసన్నమైందా? ఇకపై అన్నీ కఠిన పరీక్షలేనా? అంటే అవుననే తెలుస్తోంది.
By: Srikanth Kontham | 15 Feb 2026 8:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ కి అసలైన సవాల్ కి సమయం ఆసన్నమైందా? ఇకపై అన్నీ కఠిన పరీక్షలేనా? అంటే అవుననే తెలుస్తోంది. జార్జియా షెడ్యూల్ కి టీమ్ రెడీ అవుతోంది. ఈనెలఖరు నుంచి షూటింగ్ జార్జియాలో మొదలు కానుందని సమాచారం. మహేష్ తో పాటు కీలక నటీనటులు ఇందులో భాగమవుతారు. ఇక్కడ భారీ యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. జార్జియాలో అడుగు పెట్టడం కూడా మహేష్ కిదే తొలిసారి. ఇంతవరకూ మహేష్ జార్జియాకి కేవలం వెకేషన్ పరంగానే వెళ్లి ఉంటాడు. కానీ సినిమా షూటింగ్ నిమిత్తం వెళ్లడం ఇదే తొలిసారి.
దీంతో ఈ షెడ్యూల్ కోసం మహేష్ కూడా అంతే ఎగ్జైట్ మెంట్ తో ఎదురు చూస్తున్నాడు. కానీ జార్జియా షెడ్యూల్ మాత్రం మహేష్ కి సవాల్ విసిరేదే. కఠినమైన లోకేషన్స్ లో పని చేయడం అంత సులభం కాదు. గతంలో జార్జియాలో షూటింగ్ చేసిన అనుభవంతో నటీనటులు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? అన్నది వివరించిన సందర్భాలున్నాయి. ఇంతకీ వారణాసి షూటింగ్ జార్జియాలో ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందంటే ఈ ప్రదేశాలు ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి.
జార్జియాలోని కాకసస్ పర్వతం. మంచుతో నిండిన పర్వత ప్రాంతం శిఖరాలతో కూడా ఉంటుంది. ట్రెక్కర్స్ , ప్రకృతి ప్రేమికులకు ఓ స్వర్గంలా ఉంటుంది. ఇక్కడ మహేష్ పై కొన్ని సుందర సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు చిత్ర వర్గాల నుంచి తెలిసింది. కానీ ఇక్కడ షూటింగ్ ఎంతో కఠినంగా ఉంటుంది. ఎంతో భద్రత మధ్య షూటింగ్ నిర్వహించాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా స్థానికుల అవసరం తప్పనిసరి. అలాగే నల్ల సముద్రానికి జార్జియా ఖ్యాతి గడించింది. అందమైన సముద్ర తీరాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక్కడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచారం.
అలాగే పురాతన చరిత్ర, గుహ నగరలకు నిలయం ఇది. ఉప్లిస్ట్సిఖే అనేది ఎంతో ఖ్యాతిగడించింన ప్రాంతం. ఇది రాళ్లలో చెక్కబడిన అతి పురాతనమైన నగరం. 3,000 ఏళ్ల నాటి చరిత్ర దీని సొంతం. మ్త్సఖేటా జార్జియా పాత రాజధాని. ఇక్కడ చర్చిలు, కోటలు మధ్యయుగ కాలం నాటి శిల్పకళను ప్రతిబింబిస్తాయి. ఇలాంటి ప్రదేశాలన్నింటా వారణాసి షూటింగ్ జరుతుందని తెలుస్తోంది. అసవరం మేర ఆ ప్రాంతానికి అనుగుణంగా చిన్నపాటి సెట్స్ కూడా వేస్తారని తెలిసింది.
జార్జియాలో షూటింగ్ దర్శకుడు రాజమౌళికి కొత్తేం కాదు. కానీ ఈ లోకేషన్స్ లో మాత్రం షూటింగ్ చేయలేదు. గతంలో `బాహుబలి` సినిమాలో కొన్ని సన్నివేశాలు అక్కడే చిత్రీకరించారు. కానీ వారణాసి కోసం కొన్ని ప్రత్యేక లొకేషన్లను ఎంచుకున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 50 శాతం పూర్తయింది. వారణాసి నేపథ్యం కోసం వారణాసి సెట్లు వేసి పూర్తి చేసారు. అలాగే అల్యూమినియం ఫ్యాక్టరీ, కోకాపేటలో కొన్ని ఇండోర్ సీన్లను పూర్తి చేశారు. ఒడిశా కోరాపుట్ జిల్లా లో లోనే షూటింగ్ ప్రారంభించి అక్కడా కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించిన సంగతి తెలిసిందే. అక్కడా అవసరం మేర కాశీ నగరం సెట్ వేసారు. అలాగే కెన్యా లోని అంబోసెలి నేషనల్ పార్క్ అడవుల్లో కొన్ని కీలకమైన షెడ్యూల్స్ నిర్వహించారు.
