Begin typing your search above and press return to search.

మ‌హేష్ అభిమాని చేసిన ప‌నికి షాకైన నెటిజ‌న్లు

అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అందులోనూ టాలీవుడ్ సెల‌బ్రిటీలకు ఉండే క్రేజే వేరు.

By:  Sravani Lakshmi Srungarapu   |   16 Nov 2025 2:39 PM IST
మ‌హేష్ అభిమాని చేసిన ప‌నికి షాకైన నెటిజ‌న్లు
X

అభిమానం ఏ రేంజ్ లో ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. అందులోనూ టాలీవుడ్ సెల‌బ్రిటీలకు ఉండే క్రేజే వేరు. త‌మ అభిమాన హీరోల కోసం ఫ్యాన్స్ ఏం చేయ‌డానికైనా వెనుకాడ‌రు. వారి కోసం ఏదేదో చేస్తూ త‌మ హీరోనే గొప్ప అనిపించుకుంటూ ఉంటారు. ఇప్ప‌టికే ఎంతోమంది హీరోల అభిమానులు ఈ కోవ‌లో ప్ర‌య‌త్నించి ఎన్నో సార్లు వార్త‌ల్లోకెక్కారు.

త‌మ హీరోల పేరిట అన్న‌దానాలు చేయ‌డం, ర‌క్త‌దానాలు చేయ‌డంతో పాటూ వివిధ సేవా కార్య‌క్ర‌మాలు చేస్తూ త‌మ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు. ఇప్పుడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కు ఉన్న ఓ అభిమాని చేసిన ప‌ని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. త‌న ఫేవ‌రెట్ హీరో అన్ని విష‌యాల్లోనూ గొప్పేన‌ని, ఆయ‌న గురించి ఎవ‌రూ త‌ప్పుగా మాట్లాడే ఛాన్స్ ఇవ్వ‌కూడ‌ద‌ని భావించి ఓ అభిమాని చేసిన ప‌ని చూసి ఇదేం అభిమానంరా బాబూ అని షాక‌వుతున్నారు.

మ‌హేష్ కారుపై ఓవ‌ర్ స్పీడ్ ఫైన్

అస‌లు విష‌యంలోకి వెళ్తే హీరో మ‌హేష్ బాబు కారు పీవీఎన్ఆర్ హైవే పై స్పీడ్ లిమిట్ ను దాటి వెళ్ల‌డంతో పోలీసులు అత‌ని కారుకు రెండు సార్లు జ‌రిమానా విధించారు. అక్టోబ‌ర్ 4వ తేదీన, అక్టోబ‌ర్ 15వ తేదీన మ‌హేష్ బాబు కారుకు ఓవ‌ర్ స్పీడ్ ఛ‌లాన్ ప‌డింది. అయితే వార‌ణాసి ఈవెంట్ నేప‌థ్యంలో ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ మ‌హేష్ కారుపై ఉన్న ఛ‌లాన్ల గురించి సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప‌లువురు డిస్క‌ష‌న్స్ చేస్తూ వ‌చ్చారు.

దీంతో ఆ పోస్టులు చూసి త‌ట్టుకోలేక‌పోయిన వ్య‌క్తి వెంట‌నే ఆ రెండు ఛ‌లాన్ల‌ను స్వ‌యంగా తానే చెల్లించి అంద‌రి నోటికి తాళం వేశాడు. TS 36 N 4005 నెంబ‌రుతో ఉన్న మ‌హేష్ బాబు కారుకు పోలీసులు రూ.2070 ఫైన్ ను విధించ‌గా, మ‌హేష్ ఫ్యాన్స్ లో ఉన్న ఓ వీరాభిమాని ఆ ఫైన్ ను చెల్లించారు. ఈ విష‌యం తెలుసుకున్న నెటిజ‌న్లు ఇదేం పిచ్చి ప్రేమ‌రా బాబూ అని ఆశ్చ‌ర్య‌పోతూ పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ బాబు చేస్తున్న పాన్ వ‌ర‌ల్డ్ మూవీకి మేక‌ర్స్ వార‌ణాసి అనే టైటిల్ ను ఫిక్స్ చేసి, తాజాగా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను రిలీజ్ చేయ‌గా, దానికి ఆడియ‌న్స్ నుంచి భారీ రెస్పాన్స్ వ‌స్తోంది.