ఘట్టమనేని ఇంట్లో పెళ్లి వేడుకలు: నమ్రత శిరోద్కర్ స్పెషల్ పోస్ట్!
మహేష్ బాబు మేనల్లుడు (సోదరి పద్మిని ఘట్టమనేని కుమారుడు), యువ హీరో సిద్ధార్థ్ గల్లా (హీరో గల్లా అశోక్ సోదరుడు) వివాహం ఇటలీలో ఘనంగా జరుగుతోంది.
By: Sivaji Kontham | 12 July 2026 6:48 PM ISTసూపర్‌స్టార్ మహేష్ బాబు కుటుంబంలో సరికొత్త వివాహ వేడుకలు మొదలయ్యాయి. మహేష్ బాబు మేనల్లుడు (సోదరి పద్మిని ఘట్టమనేని కుమారుడు), యువ హీరో సిద్ధార్థ్ గల్లా (హీరో గల్లా అశోక్ సోదరుడు) వివాహం ఇటలీలో ఘనంగా జరుగుతోంది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని మహేష్ బాబు భార్య నమ్రత షిరోద్కర్ సోషల్ మీడియా వేదికగా ఒక అందమైన పోస్ట్‌ను పంచుకున్నారు.
పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ``వేడుకలు మొదలయ్యాయి.. ఈ అందమైన కొత్త జంటకు (సిద్ధార్థ్ గల్లా, ఐగు) జీవితాంతం ప్రేమ, ఆనందం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కొత్త అధ్యాయం మీరు కలలుగన్న దానికంటే మరింత అద్భుతంగా సాగాలి`` అంటూ నమ్రత హార్ట్‌ఫుల్ విషెస్ తెలిపారు. ఈ ఫొటోల్లో నమ్రత ధరించిన పింక్ కలర్ చీర ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో నెటిజన్లు ఈ లుక్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఫొటోల్లో సూపర్‌స్టార్ మహేష్ బాబు ఎక్కడా కనిపించకపోవడంతో ఘట్టమనేని అభిమానులు కామెంట్ బాక్స్‌లో రచ్చ చేస్తున్నారు. ``మా బాస్ మహేష్ బాబు ఎక్కడ?`` అంటూ తెగ వెతుకుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి (SSMB29) ప్రాజెక్ట్ కోసం మహేష్ బాబు వర్క్‌షాప్స్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ పోస్ట్ కింద కొందరు ఆకతాయిలు, ఇంటర్నెట్ బాట్లు వింత వింతగా కామెంట్లు పెడుతున్నా.. అభిమానులు మాత్రం ``ఘట్టమనేని వారి కుటుంబం ఇలాగే ఎప్పుడూ నవ్వుతూ, కళకళలాడుతూ ఉండాలి`` అంటూ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
సిద్ధార్థ్ గల్లా ఎవరు?
ఇక సిద్ధార్థ్ గల్లా విషయానికొస్తే.. అతడు ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ - పద్మావతి ఘట్టమనేని ల రెండవ కుమారుడు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఈయన మేనల్లుడు. ఇతడు టాలీవుడ్ చిత్రసీమలో హీరోగా అడుగుపెట్టనున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. కానీ ప్రస్తుతం తన కుటుంబ వ్యాపారాలు, ఇతర రంగాలపై దృష్టి సారించి సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ కుటుంబానికి చెందిన మరొకరు (సిద్ధార్థ్ అన్నయ్య) గల్లా అశోక్ ఇప్పటికే `హీరో` అనే చిత్రంతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చారు.
అన్నయ్య గల్లా అశోక్ ఇప్పటికే `హీరో`చిత్రంతో టాలీవుడ్‌కు పరిచయం కాగా, ఇప్పుడు సిద్ధార్థ్ కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు సర్వసిద్ధమయ్యారు. నటన, డాన్స్, ఫైట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్న ఈ యువ వారసుడి తొలి చిత్రాన్ని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో ఒక కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నట్లు సమాచారం. నటనపై ఆసక్తితో పాటు, సిద్ధార్థ్ గల్లా తమ సొంత నిర్మాణ సంస్థ `అమర రాజా మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్`కు డైరెక్టర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
