Begin typing your search above and press return to search.

ఫ్యామిలీ ఫంక్షన్ లో మెరిసిన మహేష్ బాబు.. ఆయన లుక్కుకి లేడీ ఫాన్స్ ఫిదా!

ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే మహేష్, ఈ ఫ్యామిలీ ఫోటోలో మరింత హుందాగా, ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు.

By:  Madhu Reddy   |   17 March 2026 10:52 AM IST
ఫ్యామిలీ ఫంక్షన్ లో మెరిసిన మహేష్ బాబు.. ఆయన లుక్కుకి లేడీ ఫాన్స్ ఫిదా!
X

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎక్కడ ఉన్నా అందరి కళ్ళు అయన పైనే, తాజాగా ఘట్టమనేని సాయి రాఘవ పిల్లల పుట్టినరోజు వేడుకలో మహేష్ తన ఫ్యామిలీతో కలిసి సందడి చేశారు. ఈ ప్రైవేట్ ఈవెంట్‌కు సంబంధించిన ఫోటోలను ప్రియాంక ఘట్టమనేని సోషల్ మీడియాలో షేర్ చేయగా, అవి కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యాయి. ఎప్పుడూ స్టైలిష్‌గా కనిపించే మహేష్, ఈ ఫ్యామిలీ ఫోటోలో మరింత హుందాగా, ఎంతో కూల్‌గా కనిపిస్తున్నారు. ఈ ఫోటోలను చూసి లేడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆ విశేషాలు చూద్దాం..




కుటుంబ సభ్యులతో కలిసి సందడి:

ఈ పుట్టినరోజు వేడుక కేవలం ఒక వేడుకలా కాకుండా, ఘట్టమనేని కుటుంబం అంతా ఒకే చోట చేరిన అరుదైన సందర్భంలా కనిపిస్తోంది. ఫోటోలో మహేష్ బాబుతో పాటు నమ్రత శిరోద్కర్, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, మంజుల ఘట్టమనేని, సంజయ్ స్వరూప్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ఆనందంగా నవ్వుతూ కనిపించారు. చాలా కాలం తర్వాత కుటుంబ సభ్యులందరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడటం అభిమానులకు కనువిందుగా మారింది. ముఖ్యంగా మహేష్ బాబు ఎంతో సింపుల్‌గా కనిపిస్తూనే, తనదైన ఎలిగాన్స్‌తో ఫోటోలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు.




రాజమౌళి - మహేష్ కాంబో:

ఇక సినిమాల విషయానికి వస్తే, మహేష్ బాబు ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం వారణాసి. ఇది ఒక మైథో-ఫాంటసీ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా మరియు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇండియన్ సినిమాలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజమౌళి మార్కు టేకింగ్‌తో మహేష్ బాబు విశ్వరూపం చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.




పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు సిద్ధం:

2024 లో వచ్చిన గుంటూరు కారం తరువాత వస్తున్నా మూవీ కావటం తో అభిమానులలో అంచనాలు పెరిగి పోయాయి. ఇక ‘వారణాసి’ ఆయన పాన్ ఇండియా లెవల్లో తన మార్కెట్‌ను పదిలపరుచుకుంటారని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా ఏప్రిల్ 7, 2027న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటి వరకు చూడని సరికొత్త లుక్‌లో మహేష్ ఈ సినిమాలో కనిపిస్తారని సమాచారం. రాజమౌళి సినిమా అంటేనే ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వచ్చినా, అవుట్‌పుట్ మాత్రం వరల్డ్ క్లాస్‌లో ఉంటుందని అందరికీ తెలిసిందే. అందుకే ఈ కాంబో కోసం ఇండియన్ బాక్సాఫీస్ ఆసక్తిగా చూస్తోంది.




మొత్తానికి అటు సినిమాలతోనూ, ఇటు వ్యక్తిగత జీవితంలోనూ మహేష్ బాబు ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ఈ ఫ్యామిలీ ఫోటోలు ఆయన సింప్లిసిటీకి అద్దం పడుతుండగా, ‘వారణాసి’ చిత్రం ఆయనను గ్లోబల్ స్టార్‌గా మార్చేస్తుందని అభిమానులు నమ్ముతున్నారు. ఇక సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.