'వారణాసి' కోసం మహేష్ ఎన్ని భాషలు?
మహేష్‌కు తమిళంలో మాత్రం ఇప్పటికే అనుభవం ఉంది. ‘స్పైడర్’ తమిళ వెర్షన్‌కు ఆయనే డబ్బింగ్ చెప్పారు.
By: M Prashanth | 23 Aug 2026 8:00 PM IST‘వారణాసి’ని రాజమౌళి పాన్ వరల్డ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే. సినిమా ఎన్నో భాషల్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందనే టాక్ ఇప్పటికే ఉంది. కానీ మహేష్ అభిమానులకు మరో పాయింట్ ఇప్పుడు డౌట్ క్రియేట్ చేస్తోంది. సినిమాలో రుద్రగా మహేష్ కనిపించడం ఒక విషయం అయితే.. ఇతర భాషల్లో కూడా ఆయన వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తే ఎన్ని భాషల్లో స్వయంగా డబ్బింగ్ చెబుతారన్నదే ఇప్పుడు అసలైన విషయం.
మహేష్‌కు తమిళంలో మాత్రం ఇప్పటికే అనుభవం ఉంది. ‘స్పైడర్’ తమిళ వెర్షన్‌కు ఆయనే డబ్బింగ్ చెప్పారు. ఆ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కింది. తమిళ ప్రమోషన్స్ సమయంలో కూడా మహేష్ అక్కడి ప్రేక్షకులతో నేరుగా మాట్లాడారు. అంటే తమిళం విషయంలో ఆయనకు పెద్దగా కొత్తేమీ లేదు.
కానీ హిందీ విషయంలో పరిస్థితి పూర్తిగా కొత్తది. మహేష్ ఇప్పటివరకు హిందీ సినిమా చేయలేదు. అందుకే ‘వారణాసి’ కోసం హిందీలో కూడా స్వయంగా డబ్బింగ్ చెబితే అది ఆయన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ అవుతుంది. పైగా రాజమౌళి తన మెయిన్ హీరోలతో వీలైనన్ని భాషల్లో వాళ్లే డబ్బింగ్ చెప్పించడానికి ఇష్టపడతారు. ‘ఆర్ఆర్ఆర్’ సమయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌తో తెలుగు మాత్రమే కాకుండా హిందీ, తమిళం, కన్నడలో కూడా డబ్బింగ్ చెప్పించారు.
అందుకే మహేష్‌తో కూడా అదే రూట్‌లో వెళ్తారా అన్నది చూడాలి. తమిళం వరకు ఆయన చేసేయగలడు. హిందీ కోసం మాత్రం ప్రాక్టీస్ అవసరం కావచ్చు. కన్నడ లేదా మలయాళంలో కూడా ప్రయత్నిస్తారా? లేక తెలుగు, తమిళం, హిందీ వరకు మహేష్ వాయిస్ ఉంచి మిగతా భాషలకు డబ్బింగ్ ఆర్టిస్టులను తీసుకుంటారా? ప్రస్తుతం దీనిపై టీమ్ నుంచి క్లారిటీ లేదు.
మరోవైపు ‘వారణాసి’ని దాదాపు 50 భాషల్లో హ్యూమన్ డబ్బింగ్‌తో తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రతి భాషలోనూ క్యారెక్టర్‌కు సరిపోయే గొంతు ఉండేలా చూసే పని చిన్నది కాదు. కానీ మెయిన్ కాస్ట్ విషయానికి వస్తే వీలైనన్ని చోట్ల ఒరిజినల్ వాయిస్ ఉంచాలని రాజమౌళి చూస్తే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన గత సినిమాల్లో కూడా నటుడి గొంతు వల్ల వచ్చే ఎమోషన్‌ను ఎక్కువగా పట్టించుకున్నారు.
ప్రస్తుతం ‘వారణాసి’ షూటింగ్ జెట్ స్పీడ్ లో వెళుతోంది. సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. షూటింగ్‌తో పాటు విజువల్ ఎఫెక్ట్స్, డబ్బింగ్, ఇతర భాషల పనులు కూడా సమాంతరంగా నడపాల్సి ఉంటుంది. 50 భాషల ప్లాన్ నిజంగా అదే స్థాయిలో అమలైతే మాత్రం పోస్ట్ ప్రొడక్షన్‌లో డబ్బింగ్ ఒక్కటే పెద్ద సెక్షన్ అవుతుంది.
