Begin typing your search above and press return to search.

మహేశ్ రివ్యూ కూడా వచ్చేసింది.. ఇది సంగతి!

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ రిలీజ్‌కు ముందు టీమ్‌కు కావాల్సిన బూస్ట్ ఒక్కొక్కటిగా వచ్చేస్తోంది.

By:  M Prashanth   |   30 Sept 2026 9:38 PM IST
మహేశ్ రివ్యూ కూడా వచ్చేసింది.. ఇది సంగతి!
X

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ రిలీజ్‌కు ముందు టీమ్‌కు కావాల్సిన బూస్ట్ ఒక్కొక్కటిగా వచ్చేస్తోంది. బాలకృష్ణ వాయిస్ ఓవర్, ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత ఇప్పుడు మహేశ్ బాబు నుంచి కూడా రివ్యూ రావడం సినిమాపై ఉన్న బజ్‌ను ఇంకాస్త పెంచింది. స్టార్ హీరోలు సినిమా చూసి ఒక చిన్న లైన్ పెట్టి వదిలేస్తారు. కానీ మహేశ్ మాత్రం ఫహాద్ నుంచి డైరెక్టర్ శశాంక్ వరకు ఒక్కొక్కరిని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పెద్ద పోస్ట్ పెట్టారు.

సినిమా మొత్తం తనకు ఒక కంప్లీట్ ఎక్స్‌పీరియన్స్‌లా అనిపించిందని మహేశ్ చెప్పారు. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్ కూడా బాగా పనిచేసిందని, సినిమాలో ఉన్న కంటెంట్ తనకు ప్రత్యేకంగా నచ్చిందని రాశారు. రిలీజ్‌కు ముందే ఇలాంటి రెస్పాన్స్ రావడం వల్ల సినిమా టోన్ గురించి బయటికి మరో క్లూ వెళ్లింది. ఇప్పటివరకు ట్రైలర్‌లో కనిపించిన ఫాంటసీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు మహేశ్ కామెంట్స్ కూడా అదే దిశలో ఉన్నాయి.

ఫహాద్ ఫాజిల్ గురించి మాత్రం మహేశ్ ప్రత్యేకంగా మాట్లాడారు. ప్రతి సినిమాతో తనను తాను మార్చుకుంటూ కొత్తగా ట్రై చేస్తున్న తీరు ఇన్‌స్పైరింగ్‌గా ఉందని చెప్పారు. ఫహాద్, చిన్నారి సారా ఇద్దరూ కలిసి కనిపించిన సీన్స్ చాలా బాగా వచ్చాయని, వారి పాత్రలు స్క్రీన్‌పై నిజంగా జీవిస్తున్నట్లుగా అనిపించాయని రాశారు. ట్రైలర్ వచ్చినప్పటి నుంచి ఈ ఇద్దరి బాండింగ్‌నే టీమ్ ఎక్కువగా హైలైట్ చేస్తోంది.

నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయకు కూడా మహేశ్ మెసేజ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డారో ఇప్పుడు రిలాక్స్ అవ్వొచ్చని చెప్పడం హైలెట్. శోభు యార్లగడ్డతో కలిసి మంచి సినిమా తీసుకొచ్చారని రాశారు. కార్తికేయకు నిర్మాతగా ఇది ప్రత్యేకమైన ప్రాజెక్ట్ కావడంతో మహేశ్ నుంచి వచ్చిన ఈ మాటలు ఆయనకు కూడా మంచి బూస్ట్ అయ్యాయి.

డైరెక్టర్ శశాంక్ యేలేటి గురించి కూడా మహేశ్ వివరణ ఇచ్చారు. ఒక కొత్త ప్రపంచాన్ని స్క్రీన్‌పై తీసుకొచ్చిన తీరు బాగుందని, ఫస్ట్ ఫిల్మ్‌కి మంచి సినిమా తీశారని ప్రశంసించారు. ఫహాద్ లాంటి నటుడిని హ్యాండిల్ చేయడం, ఫాంటసీ సెటప్‌తో సినిమా తీయడం మొదటి సినిమాకే పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు మహేశ్ పోస్ట్‌తో శశాంక్ పేరు కూడా మరింతగా హైలైట్ అవుతోంది.

అక్టోబర్ 2న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. రిలీజ్‌కు ముందు బాలయ్య, ఎన్టీఆర్, ఇప్పుడు మహేశ్ బాబు నుంచి వచ్చిన సపోర్ట్‌తో టీమ్ ప్రమోషన్స్‌కు కావాల్సినంత మైలేజ్ వచ్చేసింది. ఇక నుంచి అసలు లెక్క ఆడియన్స్ చేతుల్లోనే ఉంటుంది. మరి కంటెంట్ మహేశ్ చెప్పినట్లే ఆడియెన్స్ కి కూడా కనెక్ట్ అవుతుందో లేదో చూడాలి.