Begin typing your search above and press return to search.

మహేష్ బాబు పేరిట నమోదైన వరస్ట్ రికార్డులు ఏంటంటే.?

'రాజకుమారుడు' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు మహేష్ బాబు...మొదటి సినిమాతోనే ప్రిన్స్ గా తనకంటూ ఒక ట్యాగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.

By:  Gopi Velupala   |   3 Oct 2026 11:00 PM IST
మహేష్ బాబు పేరిట నమోదైన వరస్ట్ రికార్డులు ఏంటంటే.?
X

'రాజకుమారుడు' సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు మహేష్ బాబు...మొదటి సినిమాతోనే ప్రిన్స్ గా తనకంటూ ఒక ట్యాగ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలతో కొంతవరకు మెప్పించినప్పటికి తన పూర్తిస్థాయి నట పోటెన్షియాల్టిని బయటికి తీసిన సినిమా మాత్రం 'నిజం' అనే చెప్పాలి. అందులో ఒక డీసెంట్ యాక్టింగ్ లో మహేష్ బాబు నటన చూసిన చాలా మంది మహేష్ బాబు గొప్ప నటుడు తను ఎలాంటి పాత్రనైనా సరే చేయగలడు అంటూ అతని గురించి గొప్పగా మాట్లాడారు. ఇక ఈ క్రమంలోనే 'ఒక్కడు' సినిమాతో ఆయన మాస్ లో తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను విస్తరించుకున్నాడు. అలాగే తన కెరియర్ లోనే మొదటి బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని సాధించాడు. పోకిరి, దూకుడు, శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి లాంటి సినిమాలతో ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేశాడు. యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని అలరించాడు. అలాంటి మహేష్ బాబు కెరియర్ లో కొన్ని వరస్ట్ రికార్డులు కూడా ఉన్నాయి. మహేష్ అభిమానులు వీటి గురించి మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ మహేష్ బాబు ఎవరినైతే నమ్మాడో వాళ్లే అతనికి వరస్ట్ రికార్డులను కట్టబెట్టారు.

అప్పటినుంచి మహేష్ బాబు పూర్తి కథలను విని డేట్స్ ఇవ్వాలని బ్లైండ్ గా ఫిక్స్ అయ్యాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తుపాకీ, కత్తి లాంటి వరుస బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందుకున్న మురుగదాస్ డైరెక్షన్లో నటించాలని ఉంది అంటూ మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో ఓపెన్ గా చెప్పాడు. దాంతో మురుగదాస్ సైతం మహేష్ బాబు నిర్ణయానికి కట్టుబడి 'స్పైడర్' అనే సినిమాని మహేష్ బాబుతో చేద్దామని అతనికి కథను వినిపించాడు. కథ కూడా మహేష్ బాబు ఫైనల్ చేశాడు. మొత్తానికైతే మురుగదాస్ మీద పూర్తి నమ్మకంతో సినిమా ఎలా వస్తుంది ఏంటి అనే విషయాలను కూడా పట్టించుకోని మహేష్ బాబు తనను పూర్తిగా నమ్మాడు. దాంతో కథ విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసిన మురుగదాస్ మొత్తానికైతే స్పైడర్ సినిమా రూపంలో మహేష్ బాబుకి ఒక భారీ డిజాస్టర్ ను కట్టబెట్టాడు. 120 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు 50 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది...

బ్రహ్మోత్సవం

'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో సక్సెస్ ని అందించిన శ్రీకాంత్ అడ్డాల తో మహేష్ బాబు మరో సినిమా చేయాలనుకున్నాడు. ఒక సినిమాతో తనకి సక్సెస్ ను అందించిన దర్శకుడిని మరోసారి రిపీట్ చేస్తూ మూవీ చేయడం మహేష్ కి అప్పట్లో ఆనవాయితీగా మారింది. కాబట్టి సీతమ్మ వాకిట్లో మూవీ తరువాత మరోసారి శ్రీకాంత్ అడ్డాలను సైతం కథ రెడీ చేసుకోమని చెప్పాడు. దాంతో 'బ్రహ్మోత్సవం' కథతో శ్రీకాంత్ మహేష్ బాబు దగ్గరికి వచ్చాడు. నిజానికి మహేష్ బాబు ఆ పూర్తి కథ కూడా వినకుండా కేవలం శ్రీకాంత్ అడ్డాల మీద ఉన్న నమ్మకంతోనే అతనికి సినిమా ఇచ్చాడు. నిజానికి బ్రహ్మోత్సవం సినిమాలో కథ ఏమీ ఉండదు. ఎంతసేపు రిలేషన్ షిప్స్ మీదనే సినిమాను నడిపించే ప్రయత్నం చేశాడు. కానీ అందులో కోర్ ఎలిమెంట్ ఏంటి అనే విషయాన్ని పర్ఫెక్ట్ గా చెప్పలేకపోయాడు. ఎమోషన్స్ సైతం పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేయడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో బ్రదర్స్ మధ్య బాండింగ్ చాలా గొప్పగా చూపించిన దర్శకుడు బ్రహ్మోత్సవం సినిమా విషయంలో పూర్తిగా చేతులెత్తేశాడు. దానివల్ల ఈ సినిమా భారీ ఫ్లాప్ గా నిలిచింది. దాదాపు 40 కోట్ల వరకు ప్రొడ్యూసర్లకు నష్టాన్ని మిగిల్చింది...

ఆగడు

దూకుడు సినిమాతో మహేష్ బాబుకు భారీ కంబ్యాక్ ను అందించిన శ్రీను వైట్ల దర్శకత్వంలో చేసిన 'ఆగడు' సినిమా పరిస్థితి కూడా ఇంతే... గబ్బర్ సింగ్ మూవీ ఫ్లేవర్ తో శ్రీను వైట్ల అలాంటి టెంపు లైన్ లోనే 'ఆగడు' సినిమాను తెరక్కెక్కించాడు. కానీ ఈ మూవీ అనుకున మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఈ మూవీ దాదాపు 30 కోట్ల వరకు నష్టాన్ని మిగిల్చింది...

మహేష్ బాబు తన కెరియర్ లో ఎన్ని గొప్ప విజయాలను సాధించినా కూడా వెనుతిరిగి చూసుకుంటే అతని కెరియర్లో ఇలాంటి భారీ డిజాస్టర్లు ఉండడం అతనికి తీవ్రమైన బాధను కలిగిస్తుందట. అందుకే ఆయన ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో ఎక్కడా కూడా కన్ఫ్యూజన్ లేకుండా పూర్తి క్లారిటీతో ముందుకు సాగాలని ప్రొడ్యూసర్లను సేఫ్ జోన్ లో ఉంచడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న వారణాసి సినిమా బడ్జెట్ విపరీతంగా పెరిగిపోతున్నప్పటికి రాజమౌళి ఉన్నాడనే కాన్ఫిడెంట్ తో మహేష్ బాబు ఉన్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే రాజమౌళి ఆ సినిమా కోసం ఎంత బడ్జెట్ పెట్టించినా కూడా అంతకుమించిన వసూళ్లను రాబట్టగలిగే కెపాసిటి రాజమౌళికి ఉంది. సినిమాని ప్రమోషన్స్ తోనే జనాల్లోకి తీసుకెళ్తాడు. మొదటి రోజు టికెట్ రేట్ ఎంత పెట్టినా సరే మనం ఆ సినిమా చూడాల్సిందే అనేంతలా ప్రేక్షకుడిలో ఒక క్యూరియాసిటీ రేకెత్తించడంలో రాజమౌళి సిద్ధహస్తుడు. కాబట్టి వారణాసి సినిమా విషయంలో మహేష్ బాబు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండొచ్చు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 3,000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో మేకర్స్ ఉన్నారు...