బుచ్చిబాబు.. ఆ హీరో కోసం ఎలాంటి స్టోరీనో..
మైథాలజీ కథలు డైరెక్ట్ గా చెప్పడం ఒక విధానం అయితే, వాటి స్ఫూర్తితో కొత్త కథలు క్రియేట్ చేయడం మరో విధానం.
By: M Prashanth | 14 Jun 2026 1:41 AM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు బుచ్చిబాబు సనా కాంబినేషన్ కు సంబంధించిన వార్తలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. రామ్ చరణ్ తో తెరకెక్కించిన పెద్ది సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు.. తాజాగా మహేష్ బాబుకు ఓ కొత్త స్టోరీ లైన్ వినిపించినట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ఆ కథ మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో ఉండొచ్చన్న టాక్ సినీ అభిమానుల్లో ఆసక్తిని పెంచుతోంది.
ప్రస్తుతం మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసితో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయ్యే వరకు ఆయన అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, బుచ్చిబాబు చెప్పిన లైన్ మహేష్ ను ఆకట్టుకుందని, పూర్తి స్క్రిప్ట్ సిద్ధం చేసి మరోసారి నేరేషన్ ఇవ్వాలని సూచించినట్లు ప్రచారం సాగుతోంది.
అయితే ఆ వార్తల్లో నిజమెంత అనేది తెలియకపోయినా.. మైథాలజీ అంశమే ఇప్పుడు ప్రధాన చర్చకు కారణమవుతోంది. ఇప్పటి వరకు బుచ్చిబాబు తెరకెక్కించిన సినిమాలను పరిశీలిస్తే, ఆయన కథల్లో ఎమోషన్స్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉప్పెనలో ప్రేమకథను హృదయానికి హత్తుకునేలా చెప్పిన ఆయన.. పెద్దిలో పోరాట స్ఫూర్తి, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ప్రేక్షకులకు చేరవేశారు. ఈ నేపథ్యంలో ఆయన నిజంగానే మైథాలజీ జోనర్ ను ఎంచుకుంటే ఎలా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
మైథాలజీ కథలు డైరెక్ట్ గా చెప్పడం ఒక విధానం అయితే, వాటి స్ఫూర్తితో కొత్త కథలు క్రియేట్ చేయడం మరో విధానం. ప్రస్తుతం ప్రేక్షకుల టేస్ట్ మారుతున్న వేళ బుచ్చిబాబు ఏ ప్రాసెస్ ను ఎంచుకుంటారన్నది కూడా చర్చనీయాంశమైంది. మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గ మాస్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూనే, తనకు స్ట్రాంగ్ ఎమోషనల్ టచ్ కూడా కొనసాగిస్తారా? లేక పూర్తిస్థాయి మైథాలజికల్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రాలకు మంచి ఆదరణ లభిస్తోంది. భారీ విజువల్స్ తో పాటు స్ట్రాంగ్ స్టోరీ ఉంటే ప్రేక్షకులు ఆదరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అలాంటి సమయంలో మహేష్ బాబు వంటి స్టార్ హీరోతో బుచ్చిబాబు మైథాలజీ కథ చేస్తే అది నేచురల్ గానే అంచనాలను పెంచే అంశం అవుతుంది.
మరోవైపు బుచ్చిబాబు గతంలో మహేష్ బాబు నటించిన 1: నేనొక్కడినే సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. అప్పటి నుంచి మహేష్ తో సినిమా చేయాలనే ఆసక్తి ఆయనలో ఉందనే ప్రచారం కూడా ఉంది. ఇప్పుడు దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తర్వాత మహేష్ కు కథ చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ప్రస్తుతం ఇవన్నీ రూమర్స్ మాత్రమే.
అధికారిక ప్రకటన వెలువడే వరకు క్లారిటీ వచ్చే అవకాశం లేదు. అయినప్పటికీ, ఒకవేళ మైథాలజీ బ్యాక్ డ్రాప్ నిజమైతే మాత్రం బుచ్చిబాబు దాన్ని ఎలా డీల్ చేస్తారు? మహేష్ బాబును ఎలా చూపిస్తారు? అన్నదే ఇప్పుడ హాట్ టాపిక్ గా మారింది. అభిమానులు కూడా క్రేజీ కాంబినేషన్ పై భారీ అంచనాలతో ఎదురుచూస్తున్నారు. మొత్తానికి.. బుచ్చిబాబు మహేష్ కోసం ఎలాంటి స్టోరీ సిద్ధం చేశారో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.
