మహేష్ ఎంట్రీతో 3 వేల నుంచి 20 వేలకు!
మార్కెట్ లో తమ బ్రాండ్ వ్యాల్యూ పెరిగిందంటే అందుకు కారణం మహేష్ మాత్రమేనని అభిప్రా యపడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ యాప్ బాగా ప్రాచుర్యంలో ఉంది.
By: Srikanth Kontham | 11 Sept 2025 9:00 PM ISTసూపర్ స్టార్ మహేష్ ఆదాయం సినిమాలను మించి ఎండార్స్ మెంట్స్ ద్వారా అందుకుంటున్నారు. ఒక బ్రాండ్ ని ప్రమోట్ చేసారంటే కోట్లలలో ఆదాయం సమకూరుతుంది. అందుకే మహేష్ ఎన్ని సినిమాలతో బిజీగా ఉన్నా? ఏడాదిలో కొంత సమయాన్ని ఎండార్ మెంట్స్ కి కేటాయిస్తారు. ఇప్పటికే ఆయన పలు సంస్థ లకు ప్రచార కర్తగా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. అందులో ఒకటి అన్ లైట్ బస్ టికెటింగ్ యాప్ ఒకటి. కొన్ని సంవత్సరాలు గా ఆయాప్ ని మహేష్ ప్రమోట్ చేస్తున్నారు.
దీంతో ఆ సంస్థ అధిక లాభాల్లోకి వెళ్లినట్లు సదరు సంస్థ సీఈవో తాజాగా ప్రకటించారు. మహేష్ తమ సంస్థతో టైఅప్ కాని సమయంలో వ్యాపారం ఆశించిన స్థాయిలో సాగలేదన్నారు. రోజుకు మూడు వేల టికెట్ బుకింగ్స్ తోనే సరిపెట్టుకోవాల్సి వచ్చేదన్నారు. కానీ మహేష్ ఎంటర్ అయిన తర్వాత రోజుకు బుకింగ్స్ 20 వేలకు చేరాయన్నారు. ప్రస్తుతం 20 వేలు పైనే బుకింగ్స్ జరుగుతున్నాయని తెలిపారు.
మార్కెట్ లో తమ బ్రాండ్ వ్యాల్యూ పెరిగిందంటే అందుకు కారణం మహేష్ మాత్రమేనని అభిప్రాయ పడ్డారు. తెలుగు రాష్ట్రాల్లో ఆ యాప్ బాగా ప్రాచుర్యంలో ఉంది. మహేష్ ఇప్పటికీ అదే యాప్ కు ప్రచార కర్తగా కొనసాగడం విశేషం. సాధారంణగా బ్రాండ్ సంస్థలు హీరోతో అగ్రిమెంట్ ముగిసిన తర్వాత మరో కొత్త హీరోతో ప్రమోట్ చేసుకుంటాయి. పారితోషికం ఎక్కువైనా? తక్కువైనా? కొత్త హీరోని తెరపైకి తెస్తే బాగుంటుందని సంస్థలు భావిస్తుంటాయి. కానీ సదరు సంస్థ మాత్రం ఇప్పటికీ మహేష్ ని కొనసాగించడం విశేషం.
మహేష్ కంపెనీ బ్రాండ్ వ్యాల్యుని బట్టి పారితోషికం తీసుకుంటారు. సెకెన్ కి కోటి రూపాయలు అందుకుంటారనే ప్రచారం ఉంది. గతంలో ఓ శీతలపానీయాల కంపెనీ బ్రాండ్ ని ప్రమోట్ చేసిన సమయంలో12 కోట్ల వరకూ ఛార్జ్ చేసినట్లు..అదే అతడి హయ్యెస్ట్ పారితోషికంగా నెట్టింట వైరల్ అయింది. ఏడాదికి పదికి పైగా యాడ్స్ చేస్తే 100 కోట్ల నుంచి 150 కోట్ల వరకూ ఆదాయం ఉంటుంటుందని ఓ అంచనా. మహేష్ పాన్ ఇండియా ఇమేజ్ అనంతరం అతడి మార్కెట్ రెట్టింపు అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎంబీ 29 తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
