Begin typing your search above and press return to search.

మహేష్ 'అతడు'.. 25ఏళ్ల క్రితం రూ.కోటి.. మరి ఇప్పుడేంత?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 50వ బర్త్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సెలబ్రిటీలు, అభిమానులు విషెస్ చెబుతున్నారు.

By:  M Prashanth   |   9 Aug 2025 2:00 PM IST
మహేష్ అతడు.. 25ఏళ్ల క్రితం రూ.కోటి.. మరి ఇప్పుడేంత?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు 50వ బర్త్ డే జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనకు సెలబ్రిటీలు, అభిమానులు విషెస్ చెబుతున్నారు. 50 ఏళ్లు అయినా అదే గ్లామర్ ఆయన సొంతమని అంతా కొనియాడుతున్నారు. అయితే మహేష్ పుట్టినరోజు కానుకగా అతడు సినిమా గ్రాండ్ గా రీ రిలీజ్ అయింది.

మహేష్ బాబు కెరీర్ లో అతడు మూవీకి ప్రత్యేక గుర్తింపు ఉందనే చెప్పాలి. సూపర్ స్టార్ లోని కొత్త కోణాన్ని ఆ సినిమా ఆవిష్కరించింది. అయితే మహేష్ కు అనుకున్నంత రిజల్ట్ రాకపోయినా.. ఎన్నో రికార్డులు మాత్రం క్రియేట్ చేసింది. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, మణిశర్మ మ్యూజిక్, మహేష్ స్టైలిష్ యాక్టింగ్ తో క్లాసిక్ గా నిలిచింది.

2005లో రిలీజ్ అయిన ఆ సినిమా.. ఇప్పుడు 20 ఏళ్ల తర్వాత నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నిన్న (ఆగస్టు 8) పలు చోట్ల ప్రీమియర్స్ కూడా పడటం విశేషం. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగాయని టాక్ వినిపించింది. జెట్ స్పీడ్‌ లో కొన‌సాగాయని తెలుస్తోంది. ఓవర్సీస్ లో కూడా అదే జోరు ఉందని సమాచారం.

అయితే అప్పట్లో ఓవర్సీస్ లో అతడు మూవీ బ్లాక్ బస్టర్ హిట్. ముఖ్యంగా అమెరికాలో తెలుగు సినిమా మార్కెట్ అప్పటికీ ఇప్పటికీ చాలా తేడా. తక్కువ స్క్రీన్లలో సినిమాలు రిలీజ్ అయ్యేవి. ఎక్కువగా చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే సందడి చేసేవి. అప్పుడే అతడు మూవీ ఒక్కసారిగా యూఎస్ బాక్సాఫీస్ ను షేక్ చేసింది.

ఓవర్సీస్ హక్కులు రూ. 30 లక్షలకు కొనుగోలు చేయగా.. సినిమా రూ.కోటి కంటే ఎక్కువ వసూళ్లు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత మహేష్ మరో మూవీ పోకిరి ఇంకా అదరగొట్టింది. నెవ్వర్ బిఫోర్ అనేలా కలెక్షన్స్ సాధించింది. సైనికుడు మూవీ అనుకున్నంత స్థాయిలో మెప్పించలేకపోయినప్పటికీ ఓపెనింగ్స్ అదిరిపోయాయి.

అలా మహేష్ ఇప్పటికీ యూఎస్ మార్కెట్ ను శాసిస్తున్నారు. ఇప్పుడు అతడు మూవీతో సందడి చేస్తున్నారు. ఫ్యాన్స్, ఆడియన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. మరి రీ రిలీజ్ లో అతడు మూవీ.. ఓవర్సీస్ లో ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.. ఎంత వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.