అతడు రీ రిలీజ్.. యువతి డాన్స్ పెర్ఫార్మెన్స్ తో హోరెత్తిన థియేటర్!
ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మించిన చిత్రం 'అతడు'.
By: Madhu Reddy | 9 Aug 2025 12:42 PM ISTప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో జయభేరి ఆర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మించిన చిత్రం 'అతడు'. ఇందులో మహేష్ బాబు హీరోగా, త్రిష హీరోయిన్ గా నటించారు. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ టీవీలోకి వచ్చిన తర్వాత క్లాసిక్ మూవీ గా నిలిచిపోయింది. ఇకపోతే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో 4K లో ఈ సినిమాను రీ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా మహేష్ అభిమానులు థియేటర్లలో తెగ హంగామా చేస్తున్నారని చెప్పవచ్చు.
అందులో భాగంగానే "పిల్లగాలి అల్లరి" పాటకు ఒక యువతి డాన్స్ చేసిన వీడియో ఇప్పుడు నెట్టెంట తెగ వైరల్ అవుతోంది. సినిమాలో అచ్చం త్రిష ధరించిన కాస్ట్యూమ్స్ తో పాటు సేమ్ స్టెప్పులతో ఆ మహిళ అదరగొట్టేసింది. ప్రస్తుతం ఈ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అదరగొట్టేసింది అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికైతే మరోసారి త్రిషను గుర్తు చేసిందని, ఆమెపై ప్రశంసల వర్షం కూడా కురిపిస్తున్నారు మహేష్ బాబు అభిమానులు.
ఇకపోతే థియేటర్లలో అభిమానులు ఇలా సందడి చేయడం ఇదేం తొలిసారి కాదు. ఈ ఏడాది మే 31వ తేదీన మహేష్ బాబు 'ఖలేజా' సినిమాను రీ రిలీజ్ చేశారు. తెలుగు స్టేట్స్ తో పాటు యూఎస్ లో కూడా రిలీజ్ చేశారు. ఇకపోతే విజయవాడలోని ఒక థియేటర్లో అభిమానులు చాలా అత్యుత్సాహం చూపించారు. ముఖ్యంగా మహేష్ బాబు సీన్ లను రీ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది డాన్సులు వేస్తే.. మరి కొంతమంది డైలాగ్స్ తో అదరగొట్టేశారు. ఇంకొంతమంది హాస్పిటల్ సీన్ చేసి ఆకట్టుకున్నారు. అయితే ఇక్కడ మరో అభిమాని ఏకంగా మహేష్ బాబు ఎంట్రీ సీన్ రీ క్రియేట్ చేసి ఆశ్చర్యపరిచారు. ఏకంగా థియేటర్లోకి పాములు తీసుకొని వచ్చి తెగ సంచలనం సృష్టించారు. ఇలా మహేష్ బాబు సినిమాలు రీ రిలీజ్ అయినప్పుడు థియేటర్లలో ఆ సన్నివేశాలను రీ క్రియేట్ చేస్తూ వైరల్ అవుతున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే ఆ లేడీ యువతి కూడా త్రిష గెటప్ లో వచ్చి.. రీ క్రియేట్ చేసి అందరి దృష్టిలో పడింది.
మహేష్ బాబు సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎస్ ఎస్ ఎం బి 29 అనే వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నారు.. ఆఫ్రికన్ అడ్వెంచర్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం రాబోతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఒక లోతైన లోయలో జరుపుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాదులో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇందులో ప్రముఖ గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా కథానాయికగా ఎంపికైన విషయం తెలిసిందే. ఆమె పార్ట్ కి సంబంధించి కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో మహేష్ బాబుకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను రాజమౌళి తన ఎక్స్ ఖాతా ద్వారా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను నవంబర్లో రిలీజ్ చేస్తామని అంచనాలు పెంచేశారు.
