మహేష్ బాబు ఆశీస్సులతో సీక్వెల్‌తో రానున్న అల్లుడు..!
మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మెల్ల మెల్లగా హీరోలు ఎంట్రీ ఇస్తున్న విషయం మనం చూస్తున్నాం.
By: Ramesh Palla | 21 Oct 2026 12:23 PM ISTమహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మెల్ల మెల్లగా హీరోలు ఎంట్రీ ఇస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఇటీవల రమేష్ బాబు కొడుకు జయకృష్ణ హీరోగా ఎంట్రీ ఇచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందిన 'శ్రీనివాస మంగాపురం' సినిమాతో జయకృష్ణ హిట్ కొట్టలేక పోయాడు. దాంతో మరో సినిమాతో జయకృష్ణ వచ్చి హిట్ కొట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో మహేష్ బాబు కాకుండా ఆయన ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన ఏ ఒక్కరూ హిట్ కొట్టలేక పోయారు. చాలా ఏళ్ల క్రితమే హీరోగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా మరో ప్రయత్నంకు రెడీ అయ్యాడు. హీరోతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అశోక్ చేసిన ప్రతి సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరుస్తూ వచ్చింది. అయినా పట్టువదలని విక్రమార్కుడు తరహాలో మరో సినిమాకు రెడీ అయ్యాడు. ఈసారి ఒక హిట్ మూవీ కి సీక్వెల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
హుషారు సీక్వెల్ కోసం ఏర్పాట్లు...
ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని సొంతం చేసుకుని, మ్యూజికల్‌గా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న 'హుషారు' సినిమాకు సీక్వెల్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ సీక్వెల్లో ముగ్గురు మెయిన్ లీడ్‌లో కనిపించబోతున్నారు. వారిలో ఒక హీరోగా అశోక్ గల్లా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం హుషారు సినిమాలో నటించిన తేజస్ స్థానంలో అశోక్ ను తీసుకున్నట్లు చెబుతున్నారు. హుషారు సినిమాకు దర్శకత్వం వహించిన హర్ష కొనుగంటి ఈ సీక్వెల్‌కు దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ కి మంచి డిమాండ్ ఉంది. కనుక హుషారు కి చేస్తున్న సీక్వెల్ తో కచ్చితంగా మంచి విజయం దక్కడం ఖాయం అనే నమ్మకం ను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.
గల్లా అశోక్ కొత్త సినిమాకు ఏర్పాట్లు...
హుషారు 2 కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నట్లు సమాచారం అందుతోంది. హుషారు 2 కి సంబంధించిన నటీనటుల విషయమై అతి త్వరలోనే క్లారిటీ రాబోతుంది. హుషారు లో కనిపించిన కొందరు నటీనటులు హుషారు 2 లో కనిపించబోతున్నారు. ఒకరు ఇద్దరు మెయిన్ లీడ్ యాక్టర్స్ ను తప్పించారని తెలుస్తోంది. ఆ స్థానంలోనే అశోక్ గల్లాకు ఛాన్స్ దక్కింది. హుషారు కథకు కొనసాగింపుగా ఉంటుందా లేదంటే మొత్తం కొత్త కథతో సినిమాను రూపొందిస్తున్నారా అనేది చూడాలి. హీరోగా అశోక్ చేసిన ప్రతి ప్రయత్నం విఫలం కావడంతో ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకుని వెయిట్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో హిట్ కొట్టేనా చూడాలి. ఇండస్ట్రీలో మెయిన్ లీడ్ లో నటించి చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వక పోయినా, బ్యాక్ గ్రౌండ్ ఉన్న కారణంగా అశోక్ గల్లా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ కెరీర్లో ముందుకు సాగుతున్నాడు.
మహేష్ బాబు వారణాసి సినిమా తర్వాత...
అశోక్ గల్లా ఓకే చెప్పిన హుషారు 2 కి సంబంధించిన స్టోరీ లైన్ ను మహేష్ బాబు విని ఓకే చెప్పాడనే వార్తలు గుప్పుమంటున్నాయి. మహేష్ బాబు ఆశీస్సులతో ఈ సినిమా ప్రారంభించబోతున్నారు. వారణాసి సినిమాతో బిజీగా ఉన్నప్పటికీ ఏదో ఒక సమయంలో కచ్చితంగా మహేష్ బాబు ప్రజెన్స్ తో హుషారు 2 ప్రమోషన్స్ జరిగే అవకాశం ఉంది. అంతే కాకుండా మహేష్ బాబు సపోర్ట్ కూడా సినిమాకు ఉంటుందనే వార్తలు వస్తున్నాయి. మహేష్ బాబు తన మేనల్లుడు అశోక్ గల్లాకు ఒక హిట్ ను ఇప్పించేందుకు సాధ్యం అయినంత వరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమాతో ఆ ప్రయత్నం సఫలం అయ్యేనా చూడాలి. ప్రముఖ వ్యాపారవేత్త అయిన గల్లా జయదేవ్ తన కొడుకు హిట్ కోసం చాలానే కష్టపడుతున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. మరి ఈ సినిమాతో ఆయన ఆశ నెరవేరి హిట్ కొట్టి, సోలో హీరోగా మళ్లీ గల్లా అశోక్ సినిమా చేసేనా చూడాలి.
