Begin typing your search above and press return to search.

ఫ్యాన్స్‌ని మిస్ అండ‌ర్‌స్టాండ్ చేసుకుంటాం: మ‌హేష్.పి

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- భాగ్య‌శ్రీ బోర్సే జంట‌గా నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` నవంబర్ 27న విడుదల కానుంది.

By:  Sivaji Kontham   |   22 Nov 2025 10:41 PM IST
ఫ్యాన్స్‌ని మిస్ అండ‌ర్‌స్టాండ్ చేసుకుంటాం: మ‌హేష్.పి
X

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని- భాగ్య‌శ్రీ బోర్సే జంట‌గా నటించిన `ఆంధ్రా కింగ్ తాలూకా` నవంబర్ 27న విడుదల కానుంది. మహేష్ బాబు పి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీమేక‌ర్స్ అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించింది. ఈ సినిమాలో ఉపేంద్ర కీల‌క పాత్ర‌ను పోషించారు.

ఈ శ‌నివారం సాయంత్రం వైజాగ్‌ ఆర్‌కె బీచ్‌లో గ్రాండ్ సంగీత కచేరీని నిర్వహించారు. న‌టీన‌టులు ఒక ప్రైవేట్ విమానంలో వైజాగ్‌కు చేరుకున్నారు. రామ్ ఈ చిత్రంలో ఒక సినీ నటుడి అభిమాని అయిన సాగర్ పాత్రలో నటించగా, భాగ్యశ్రీ బోర్సే హీరో ప్రేమికురాలు మహాలక్ష్మిగా కనిపించనున్నారు. ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందించారు. మురళి శర్మ, రావు రమేష్, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేష్ సహాయక పాత్రల్లో కనిపించనున్నారు.

వైజాగ్ ఈవెంట్లో ద‌ర్శ‌కుడు మ‌హేష్‌ మాట్లాడుతూ.. నిజానికి ఈ సినిమాకి మాస్ట‌ర్ పీస్ అనే వ‌ర్కింగ్ టైటిల్ అనుకున్నాం. అప్ప‌టి నుంచి `ఆంధ్రా కింగ్ తాలూకా` అనే టైటిల్ ఫిక్స్ అయ్యేవ‌ర‌కూ నా టీమ్ శ్రమించిన తీరుకు నేను రుణ‌ప‌డి ఉంటాను. టైటిల్ మార్చాక ఆ స్తాయికి త‌గ్గ‌ట్టు సినిమాని మ‌లిచేందుకు నా ర‌చ‌యిత‌లు, ద‌ర్శ‌క‌త్వ శాఖ టీమ్ లు చాలా శ్ర‌మించాయి. నా టెక్నిక‌ల్ టీమ్ అంతా కావాల్సిన విధంగా స‌పోర్ట్ చేసారు. ఎండా కొండా నీటిలోను ప‌ని చేసాం. అన్ని విధాలా అంద‌రూ స‌హ‌క‌రించారు. భాగ్య‌శ్రీ‌ని ఈ పాత్ర‌కు సూట‌వుతుందా లేదా అని ఆడిష‌న్ చేసి మ‌రీ ఎంపిక చేసాను. త‌ను అనుష్క త‌ర‌హాలో పెద్ద స్టార్ అవుతుంది. ఒక ద‌ర్శ‌కుడిని డైరెక్ట్ చేయ‌డం అత్యంత క‌ష్ట‌మైన‌ది. అప్ప‌టికే పెద్ద ద‌ర్శ‌కుడు అయిన‌ ఉపేంద్ర గారు అన్ని విధాలా నాకు స‌పోర్ట్ చేసారు. తెల్ల‌వారు ఝామున కూడా ఆయ‌న‌ను నిద్ర‌లేపి ప‌ని చేయిస్తే స‌హ‌క‌రించారు. ఈ సినిమాకి నిర్మాత‌లు, సంగీత ద‌ర్శ‌కులు అంద‌రూ డ్యూయోలు. రామ్ నేను ఒక డ్యూయో అనుకుంటాను. మేం ఏం చేసినా క‌లిసి చేసాం. నేను చూసిన‌ది ఆయ‌న చూసారు. ఆయ‌న చూసిన‌ది నేను చూసాను. అంత‌గా సింక్ అయ్యి ప‌ని చేసాం. నేను చూసినది త‌క్కువ మంది హీరోలే అయినా రామ్ వేరే. న‌టుడిగా రామ్ డెడికేష‌న్ వేరు. ఆయ‌న‌కు ఉన్న సినిమా నాలెజ్ వైడ్ రేంజ్ లో ఉంటుంది. 22 సినిమాల హీరో అనుకుంటున్నాం కానీ 60 సినిమాల నాలెజ్ ఉంది. నేను ఎప్పుడూ ఒక మాట చెబుతాను. నా బిగ్గెస్ట్ ఛాలెంజ్.. మీ అనుభ‌వాన్ని నేను ఎంత వాడుకోగ‌ల‌నా? అనేదే నా ఛాలెంజ్. నాకు ఇంకా ఏం ఇస్తారు? ఏం నేర్పిస్తారు? అని అడిగేవాడిని. మేమంతా ఫైన‌ల్ ప్రొడ‌క్ట్ కోసం చాలా శ్ర‌మించాం. ఒక‌మాస్ట‌ర్ పీస్ తీయాల‌నే త‌ప‌న‌లో నిర్మాత‌ల నుంచి ఎక్కువ‌ ఖ‌ర్చు చేయిచాను. న‌వీన్- ర‌వి గారు ఒకే మాట‌పై ఉండి ప‌ని చేస్తారు. అది ఈ సినిమాకి క‌లిసొచ్చింది`` అని తెలిపారు.

ఇది ఫ్యాన్ - హీరో సినిమా కాదు. ఇది ఒక ప్రిమైజ్. ఒక కొడుకు ఎలా ఉంటాడు? ఒక తండ్రి ఎలా ఉంటాడు? ఒక‌ ల‌వ‌రు బోయ్ ఎలా ఉంటాడు? ఇవే కాదు...మ‌న‌లో ఇంకొక‌డు కూడా ఉంటాడు. వాడు ఒక ఫ్యాన్. ఎవ‌రో ఒక‌రిని అభిమానించ‌కుండా ఈ ప్ర‌పంచంలో ఎవ‌రూ ఉండ‌రు. మ‌నం ఏం ఇస్తాం. వాళ్ల నుంచి ఏం ఆశిస్తాం? ఈ ఆలోచ‌న‌లోనే అంద‌మైన రిలేష‌న్ షిప్ ఉంది. అభిమానులు హీరోల కోసం స‌మ‌యం కేటాయించి టైమ్ వేస్టు చేసుకుంటున్నార‌నే త‌ప్పుడు అభిప్రాయం ఉంది. కానీ అది స‌రికాదు. ఒక అభిమాని కోణంలోనే కాకుండా లైఫ్ లో ఎన్ని ర‌కాల ఎమోష‌న్స్ ఉంటాయో అన్నిటినీ ఒక ఫ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూపించాం. న‌వంబ‌ర్ 27న థియేట‌ర్లోల సినిమాని వీక్షించండి.. అని కూడా అన్నారు.