మహేష్ బాబు బిజినెస్ ప్లాన్.. 'AMB'లోకి మరో స్టార్ ఫ్యామిలీ!
ఇప్పుడు, అదే సక్సెస్ ఫార్ములాను తెలుగు సినిమాకు గుండెకాయ లాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రిపీట్ చేయడానికి మహేష్ ఏషియన్ సునీల్ టీమ్ రెడీ అయింది.
By: M Prashanth | 30 Oct 2025 5:17 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు కేవలం నటనలోనే కాదు, బిజినెస్ స్ట్రాటజీలలో కూడా 'సూపర్ స్టార్' అనిపించుకుంటున్నారు. ఆయన ఏషియన్ సునీల్‌తో కలిసి గచ్చిబౌలి శరత్ సిటీ మాల్‌లో స్థాపించిన 'AMB థియేటర్' ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లగ్జరీ సినిమా ఎక్స్‌పీరియన్స్‌కు ఇది కేరాఫ్ అడ్రస్‌గా మారింది.
ఇప్పుడు, అదే సక్సెస్ ఫార్ములాను తెలుగు సినిమాకు గుండెకాయ లాంటి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో రిపీట్ చేయడానికి మహేష్ ఏషియన్ సునీల్ టీమ్ రెడీ అయింది. "AMB క్లాసిక్" పేరుతో ఇక్కడ ఒక భారీ మల్టీప్లెక్స్ నిర్మిస్తున్నారని, Tupaki.com గతంలోనే రిపోర్ట్ చేసింది. ఇక లేటెస్ట్ గా, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించి మరో 'క్లాసిక్' అప్‌డేట్ బయటకు వచ్చింది.
ఈ బిజినెస్ వెంచర్‌లో ఇప్పుడు టాలీవుడ్‌లోని మరో పవర్ ఫుల్ స్టార్ ఫ్యామిలీ జాయిన్ అవుతోందట. ఆ ఫ్యామిలీ మరెవరో కాదు, దగ్గుబాటి ఫ్యామిలీ. అవును, సురేష్ బాబు, రానా, వెంకటేష్‌ల కుటుంబం కూడా ఇప్పుడు ఈ "AMB క్లాసిక్" ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం అవుతున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ఇది ఇండస్ట్రీలో చాలా పెద్ద బిజినెస్ డీల్‌గా చెప్పుకోవచ్చు.
ఘట్టమనేని, నారంగ్ (ఏషియన్), ఇప్పుడు దగ్గుబాటి.. ఇలా మూడు బలమైన సినిమా కుటుంబాలు కలిసి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాయంటే, అది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ రూపురేఖలనే మార్చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఏషియన్ సునీల్‌కు, దగ్గుబాటి ఫ్యామిలీకి థియేటర్ డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగంలో దశాబ్దాల అనుభవం ఉంది. గతంలో చాలాసార్లు వీరి మధ్య డీలింగ్స్ జరిగాయి.
ఇక గచ్చిబౌలిలోని 'AMB థియేటర్' హై క్లాస్, లగ్జరీ ఆడియెన్స్‌ను ఎక్కువగా టార్గెట్ చేసింది. కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని 'AMB క్లాసిక్' మాత్రం అన్ని వర్గాల వారికి కనెక్ట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారట. ఆ 'క్లాసిక్' థియేటర్ వైబ్‌ను మిస్ అవ్వకుండా, అదే సమయంలో మోడ్రన్ టెక్నాలజీతో, మాస్, క్లాస్ ఆడియెన్స్‌కు బెస్ట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. మహేష్ బాబు బ్రాండ్ వాల్యూతో పాటు ఏషియన్ సునీల్ దగ్గుబాటి ఫ్యామిలీ అనుభవం 'AMB క్లాసిక్' కు మంచి క్రేజ్ దక్కే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇది ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌కు ఒక ల్యాండ్‌మార్క్‌గా మారడం ఖాయంగా కనిపిస్తోంది.
