Begin typing your search above and press return to search.

మన శంకరవరప్రసాద్‌తో మహేష్‌ బాబు కొత్త జర్నీ..!

2026 సంక్రాంతికి ఈ మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు గాను ఆసియన్‌ సినిమాస్ వారు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది.

By:  Ramesh Palla   |   7 Oct 2025 11:24 AM IST
మన శంకరవరప్రసాద్‌తో మహేష్‌ బాబు కొత్త జర్నీ..!
X

సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు ఇప్పటికే ఆసియన్‌ సినిమాస్‌తో కలిసి AMB సినిమాస్‌ను ప్రారంభించిన విషయం తెల్సిందే. హైదరాబాద్‌లో AMB సినిమాస్ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయింది. సినిమా ఏదైనా అందులో ఒక్కసారి అయినా సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ చేయాలని అనుకునే వారు చాలా మంది ఉన్నారు. ఫ్లాప్ అయిన సినిమాలు కూడా AMB సినిమాస్‌లో మంచి వసూళ్లు సాధించిన దాఖలాలు ఉన్నాయి. మహేష్ బాబు బ్రాండ్‌తో పాటు, సూపర్‌ స్టార్‌ ఇమేజ్‌కి తగ్గట్లుగా AMB సినిమాస్‌ను సూపర్‌ ఆంబియన్స్‌తో రూపొందించారు. అక్కడ వాతావరణంతో పాటు, స్క్రీన్‌ క్వాలిటీ, సౌండ్‌ క్వాలిటీ ఇలా ప్రతి ఒక్కటీ ఆహా.. ఓహో అన్నట్లుగా ఉంటుంది. అందుకే హైదరాబాద్‌ నలు మూలల నుంచి కూడా AMB సినిమాస్‌ కు సినిమాను చూసేందుకు వెళ్తారు అంటారు. ఇప్పుడు AMB సినిమా వారి రెండో అతి పెద్ద మల్టీప్లెక్స్‌ నిర్మాణం జరుగుతుంది.

AMB సినిమా సరికొత్తగా

హైదరాబాద్‌లో సినిమా థియేటర్లు అనగానే ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్ గుర్తుకు వస్తుంది అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అక్కడ మహేష్‌ బాబు ఆసియన్స్‌ వారితో కలిసి మరో AMB సినిమా నిర్మాణం చేపట్టాడు. ఇప్పటికే నిర్మాణ పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఇంటీరియర్‌ వర్క్‌ జరుగుతుందని తెలుస్తోంది. సంక్రాంతి సీజన్‌ వరకు AMB సినిమాస్‌ను ప్రేక్షకులకు అందించేందుకు గాను చకచక పనులు జరుగుతున్నాయి అంటూ వార్తలు వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఉన్న AMB సినిమాస్‌కి అడ్వాన్స్ టెక్నాలజీ, సరికొత్త సౌండ్‌ సిస్టమ్ తో మల్టీప్లెక్స్‌ ను రెడీ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ థియేటర్‌ గురించి స్థానికంగా కుప్పలు తెప్పలుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ మల్టీప్లెక్స్‌ లో 7 బిగ్‌ స్క్రీన్స్ ఉండబోతున్నాయని స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది.

ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్‌ లో AMB సినిమా

2026 సంక్రాంతికి ఈ మల్టీప్లెక్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు గాను ఆసియన్‌ సినిమాస్ వారు ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో మల్టీప్లెక్స్‌లకు మంచి ఆధరణ లభిస్తుంది. కనుక AMB సినిమాస్‌ కొత్త బ్రాంచ్‌ ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుంది అని సినిమా ప్రియులు నమ్మకంగా చెబుతున్నారు. ఆర్‌టీసీ క్రాస్‌ రోడ్స్‌ లో ఉన్న ఇతర థియేటర్లు, మల్టీప్లెక్స్‌లతో పోల్చితే మహేష్ బాబు నుంచి రాబోతున్న AMB సినిమాస్‌ ఖచ్చితంగా అన్ని విధాలుగా అడ్వాన్స్ టెక్నాలజీతో పాటు, అత్యాధునిక హంగులు ఉంటాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. అంతర్జాతీయ స్థాయి టెక్నాలజీతో సినిమాలను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఆసియన్‌ సినిమాస్ వారు ఎప్పటికప్పుడు కృషి చేస్తూ ఉంటారు. AMB సినిమాస్‌ తో ప్రేక్షకులు మరింతగా సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఎంజాయ్‌ చేయవచ్చు అంటున్నారు.

చిరంజీవి మన శంకర వరప్రసాద్‌ గారు సినిమా...

ఇక ఈ మల్టీప్లెక్స్‌ లో మొదటగా మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మన శంకరవరప్రసాద్‌ గారు సినిమా స్క్రీనింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే సంక్రాంతికి విడుదల కాబోతున్న అన్ని సినిమాలు ఈ మల్టీప్లెక్స్‌ లో స్క్రీనింగ్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 7 స్క్రీన్స్‌ కనుక ఖచ్చితంగా రోజులో దాదాపుగా 30 నుంచి 40 షో లో అయినా వేసే అవకాశాలు ఉంటాయి. కనుక ఒక్క ఈ మల్టీప్లెక్స్‌ నుంచే సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే కోటి రూపాయలకు పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి సినిమాతో మహేష్‌ బాబు కొత్త మల్టీప్లెక్స్ జర్నీ మొదలు కాబోతున్న నేపథ్యంలో రెండింటి ఫలితం ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.