Begin typing your search above and press return to search.

మ‌హేష్‌, బ‌న్నీల‌కు పోటీగా ర‌ణ‌బీర్ క‌పూర్!

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్లు మహేష్ , అల్లు అర్జున్ తదుపరి చిత్రాలతో గ్లోబల్ మార్కెట్‌పైనే కన్నేశారు.

By:  Srikanth Kontham   |   16 March 2026 8:00 AM IST
మ‌హేష్‌, బ‌న్నీల‌కు పోటీగా ర‌ణ‌బీర్ క‌పూర్!
X

భారతీయ చలనచిత్ర పరిశ్రమ సరిహద్దులు దాటి ప్రపంచ స్థాయికి చేరుకుంటుంది. ముఖ్యంగా టాలీవుడ్ సూపర్ స్టార్లు మహేష్ , అల్లు అర్జున్ తదుపరి చిత్రాలతో గ్లోబల్ మార్కెట్‌పైనే కన్నేశారు. అలాగే బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణబీర్ కపూర్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన రామాయణం చిత్రంతో అంతర్జాతీయ వేదికపైకి వస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రాబోయే రోజుల్లో మహేష్, బన్నీలకు రణబీర్ కపూర్ ఒక బలమైన ప్రత్యర్థిగా మారే అవ‌కాశం లేక‌పోలేదు. గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీనిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ మహేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ వారణాసి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఐమాక్స్ ఫార్మాట్‌లో రూపొందుతోంది. హాలీవుడ్ యాక్షన్ అడ్వెంచర్ తరహాలో ఉండబోయే ఈ సినిమాతో మహేష్ గ్లోబల్ మార్కెట్‌లో నేరుగా అడుగుపెట్టబోతున్నారు. రాజమౌళి బ్రాండ్ ఇమేజ్ తోడవ్వడంతో మహేష్ బాబు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఈ సినిమాతో మహేష్ తన మార్కెట్‌ను ఆసియా దేశాల నుంచి అమెరికా వరకు విస్తరించడం ఖాయం.

అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే పుష్ప చిత్రంతో పాన్-ఇండియా సంచలనంగా మారారు. ప్ర‌స్తుతం బ‌న్నీ తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ అట్లీతో తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ - అల్లు అర్జున్ క్రేజ్ కలిస్తే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరో సునామీ సృష్టించడం ఖాయం. గ్లోబల్ టెక్నాలజీని వాడుతూ పారలల్ వరల్డ్స్ కాన్సెప్ట్‌తో రాబోతున్న చిత్ర‌మిది. అంతర్జాతీయ వేదికపై బ‌న్నీని ఒక గ్లోబల్ యాక్షన్ స్టార్‌గా నిలబె ట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్ప‌టికే నార్త్ మార్కెట్‌లో బన్నీకి తిరుగులేని ఫాలోయింగ్ పెద్ద ప్లస్ పాయింట్.

అయితే వీరిద్దరికీ సవాల్ విసురుతూ రణబీర్ కపూర్ `రామాయణం`తో రేసులోకి ఉన్నారు. ఇది కేవలం ఒక చిత్రం మాత్రమే కాదు. భారతీయ సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే ఒక భారీ ప్రయత్నం. నితీష్ తీవారీ హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తుండటంతో భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో కూడా భారీ వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. రాముడిగా రణబీర్ కపూర్ కనిపించబోతుండటంతో ఈ చిత్రానికి గ్లోబల్ వైడ్‌గా ఉండే ఎమోషనల్ కనెక్ట్ రణబీర్‌ను మహేష్, బన్నీల కంటే ముందే గ్లోబల్ లీగ్‌లోకి తీసుకెళ్ళే అవకాశం ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే? రాబోయే రెండు మూడేళ్లలో ఇండియన్ సినిమా గ్లోబల్ మార్కెట్‌ను శాసించబోతోందన్న‌ది కాద‌న‌లేని నిజం.