బన్నీ..మహేష్ కెరీర్ గ్యాప్ ఎలా ఉందంటే?
ఈ సినిమా రిలీజ్ కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకుంటున్నాడు. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Entertainment Desk | 4 Jan 2026 7:00 AM ISTసూపర్ స్టార్ మహేష్ కెరీర్ లో రిలీజ్ ల పరంగా పెద్దగా గ్యాప్ కనిపించదు. ఏడాదికి రెండు సినిమాలు టార్గెట్ గా పెట్టుకున్నా? ఒక సినిమా మాత్రం కచ్చితంగా రిలీజ్ అయ్యేలా చూసుకున్నారు. 'రాజకుమారుడు' నుంచి 'గుంటూరు కారం' వరకూ మహేష్ లైనప్ చూస్తే? విషయం క్లియర్ గా తెలుస్తోంది. 1999లో 'రాజకు మారుడు' రిలీజ్ అనంతరం 2007 వరకూ ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేసారు. అదే సమయంలో 'అతిది' రూపంలో భారీ డిజాస్టర్ పడింది. దీంతో మూడేళ్లు గ్యాప్ తీసుకుని 'ఖలేజా' సినిమా చేసాడు. కానీ ఈ సినిమా కూడా డిజాస్టరే అయింది.
మహేష్ కెరీర్ లో బ్యాక్ టూ బ్యాక్ ప్లాప్ చిత్రాలు ఆ రెండు. ఆ తర్వాత ఏడాది 'దూకుడు'తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. మహేష్ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత మళ్లీ 2020 వరకూ ఎలాంటి గ్యాప్ లేకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చాడు. 'సరిలేరు నీకెవ్వరుతో' మరో బ్లాక్ బస్టర్ పడింది. దీంతో తదుపరి సినిమా అంతకు మించి ఉండాలని రెండేళ్లు గ్యాప్ తీసుకుని 'సర్కారు వారి పాట'తో 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈసినిమా అంచనాలు అందుకోలేదు. దీంతో మళ్లీ రెండేళ్లు గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో 'గుంటూరు కారం' చేసాడు.
ఈ సినిమా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం దర్శక శిఖరం రాజమౌళితో గ్లోబల్ స్థాయిలో 'వారణాసి' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఏకంగా పాన్ వరల్డ్ టార్గెట్ గా రిలీజ్ అవుతున్న చిత్రమిది. ఈ సినిమా రిలీజ్ కోసం రెండేళ్లు గ్యాప్ తీసుకుంటున్నాడు. 2027లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. అలాగే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో కూడా పెద్దగా గ్యాప్స్ లేవు. నటుడిగా ప్రయాణం మొదలైన తర్వాత ఏడాదికో సినిమా చొప్పున రిలీజ్ చేసుకుంటూ వచ్చాడు. 2003 'గంగోత్రి' నుంచి 'నా పేరు సూర్య '(2018) వరకూ ఏడాదికో సినిమా థియేటర్లో కనిపించింది. అటుపై రెండేళ్లు గ్యాప్ తీసుకుని 'అల వైకుంఠపురములో' సినిమా చేసాడు.
ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో తదుపరి రిలీజ్ కు నో గ్యాప్ అనేసాడు. ఈసారి 'పుష్ప' ప్రాంచైజీతో పాన్ ఇండియానే షేక్ చేసాడు. బాలీవుడ్ ని సైతం ఒణింకిం చిన స్టార్ గా నిలిచాడు. 2021 లో 'పుష్ప ది రైజ్' రిలీజ్ అవ్వగా..అటుపై మూడేళ్లు గ్యాప్ తీసుకుని 'ది రూల్' ని రిలీజ్ చేసారు. ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ ఇంటర్నేషనల్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమతో గ్లోబల్ మార్కెట్ నే టార్గెట్ చేసాడు. ఈ సినిమా రెండేళ్ల గ్యాప్ అనంతరం 2027లో రిలీజ్ అవుతుంది.
