Begin typing your search above and press return to search.

45 ఏళ్ల సినీ జీవితంలో మహేష్ బాబు ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా?

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేస్తున్న మహేష్ బాబు.. 1975 ఆగస్టు 9న తమిళనాడు చెన్నైలో కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు జన్మించారు.

By:  Madhu Reddy   |   9 Aug 2025 10:03 AM IST
45 ఏళ్ల సినీ జీవితంలో మహేష్ బాబు ఎన్ని కోట్లు సంపాదించారో తెలుసా?
X

టాలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సొంతం చేస్తున్న మహేష్ బాబు.. 1975 ఆగస్టు 9న తమిళనాడు చెన్నైలో కృష్ణ, ఇందిరాదేవి దంపతులకు జన్మించారు. 4 సంవత్సరాల వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి 'నీడ' అనే సినిమా ద్వారా అడుగుపెట్టారు. ఆ తర్వాత తన తండ్రితో కలిసి పలు చిత్రాలలో బాల నటుడిగా నటించిన మహేష్ బాబు.. రాఘవేంద్రరావు దర్శకత్వంలో అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించిన 'రాజకుమారుడు' సినిమాతో హీరోగా మారారు. అలా ఇప్పటివరకు 28 చిత్రాలలో నటించిన మహేష్ బాబు.. ఇప్పటివరకు 9 నంది అవార్డులు, 5 ఫిలింఫేర్ సౌత్ అవార్డులు, 4 సైమా అవార్డులు, 2 గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులు కూడా అందుకున్నారు.

ఇకపోతే ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కావడంతో పెద్ద ఎత్తున ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఏడాది 50వ పుట్టినరోజు చేసుకుంటున్న మహేష్ బాబు.. తన 45 ఏళ్ల సినీ కెరియర్ లో ఎంత ఆస్తి కూడబెట్టారు అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి. మహేష్ బాబు హీరోగా ఇప్పటివరకు 28 చిత్రాలలో నటించారు. అలా ఇప్పటివరకు రూ.30 నుండీ రూ.35 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న మహేష్ బాబు.. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమా కోసం ఏకంగా రూ.75 కోట్లకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం.

ఒకవైపు సినిమాలు.. మరొకవైపు పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వీటి ద్వారా సుమారుగా ఏడాదికి రూ.12 - రూ.20 కోట్ల వరకు వస్తున్నట్లు సమాచారం. అలాగే 'ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్స్' అనే నిర్మాణ సంస్థ కూడా ఉంది. దీని ద్వారా భారీగా సినిమాలను నిర్మిస్తూ.. ఊహించని లాభాలు అందుకుంటున్నారు. అలాగే ఏషియన్ సంస్థతో కలిసి థియేటర్ రంగంలోకి కూడా అడుగుపెట్టిన మహేష్ బాబు.. రియల్ ఎస్టేట్ రంగాలతో పాటు పలు వ్యాపారాలలో కూడా పెట్టుబడులు పెట్టారు. వీటికి తోడు రెస్టారెంట్స్ , ది హంటర్ కో పేరుతో వస్త్ర వ్యాపారం కూడా చేస్తున్నారు.

ఇప్పటివరకు సొంతంగా మహేష్ బాబు సుమారుగా రూ.500 కోట్లకు పైగా సంపాదించినట్లు సమాచారం. అటు తండ్రి నుంచి సంక్రమించిన ఆస్తులు వేరే ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాదులో మహేష్ బాబు నివసించే మాన్షన్ హౌస్ విలువ సుమారుగా రూ.50 కోట్ల విలువ ఉంటుందని, అలాగే ఇటీవల రూ.8కోట్ల విలువైన కేరవాన్ కూడా ఆయన సొంతం చేసుకున్నట్లు సమాచారం. అంతేకాదు ఆయన కార్ గ్యారేజీలో అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి.

ఒకవైపు5ఆస్తులు సంపాదించుకోవడమే కాదు నిజమైన శ్రీమంతుడిగా కూడా నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్దాపురం గ్రామాలను దత్తత తీసుకున్న మహేష్ బాబు.. గుండె జబ్బుతో బాధపడుతున్న వేలాది మంది చిన్నారులకు శాస్త్ర చికిత్సలు చేయించి, నిజమైన శ్రీమంతుడిగా కూడా పేరు సొంతం చేసుకున్నారు.