Begin typing your search above and press return to search.

ఆ రెండు క‌టౌట్ల మ‌ధ్య పాన్ ఇండియాలో పోటీ!

హైట్ ప‌రంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ మాత్రం ప్ర‌భాస్ కు స‌రి తూగుతాడు. క‌టౌట్ క్లాస్ అయినా? రూపంలో భారీ మార్పులు తీసుకొస్తే? మ‌హేష్ మాస్ అప్పిరియ‌న్స్ పీక్స్ లోనే ఉంటుంది.

By:  Srikanth Kontham   |   19 Feb 2026 11:58 AM IST
ఆ రెండు క‌టౌట్ల మ‌ధ్య పాన్ ఇండియాలో పోటీ!
X

ప్ర‌భాస్ ఇమేజ్ ఇప్ప‌టికే పాన్ ఇండియాను దాటి పాన్ వ‌ర‌ల్డ్ కి రీచ్ అయింది. చైనా, జ‌పాన్, మ‌లేషియా స‌హా ప్ర‌పంచ దేశాల్లో డార్లింగ్ ఫాలోయింగ్ అసాధార‌ణం. ప్ర‌భాస్ బ‌ర్త్ డే వ‌చ్చిదంటే? ఆ పుట్టిన రోజును హైద‌రాబాద్ వ‌చ్చి డార్లింగ్ ఇంటి ముందు సెల‌బ్రేష‌న్ చేసే రేంజ్ కి డార్లింగ్ రీచ్ అయ్యాడు. ఈ విష‌యంలో ఇప్ప‌టికే ప్ర‌భాస్ కి పోటీగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ త‌యార‌య్యాడు. జ‌పాన్ లో తార‌క్ ను అభిమానించే వారెంతో మంది ఉన్నారు. తార‌క్ ఏ దేశం వెళ్తే అక్క‌డ జ‌పాన్ అభిమానులు వాలిపోవ‌డం అన్న‌ది చూసాం. ఇలా తార‌క్-ప్ర‌భాస్ మ‌ధ్య ఈ ర‌క‌మైన పోటీ ఉంది.

అయితే క‌టౌట్ , కంటెంట్ విష‌యంలో మాత్రం ప్ర‌భాస్ కు పోటీగా మ‌హేష్ మారే అవ‌కాశం ఉంది. స‌రైన యాక్ష‌న్ క‌టౌట్ ఉన్న హీరో ఎవ‌రు? అంటే అది ప్ర‌భాస్ మాత్ర‌మే. అత‌డి క‌టౌట్ ని ఆధారంగా చేసుకునే ప్ర‌శాంత్ నీల్ `స‌లార్` లాంటి ప్రాజెక్ట్ మొద‌లు పెట్టాడు. `స‌లార్` లో యాక్ష‌న్ స‌న్నివేశాల్లో డార్లింగ్ క‌టౌట్ కు ఏ రేంజ్ లో సెట్ అయ్యాయో తెలిసిందే. తొలి భాగం సీజ్ ఫైర్ లో ప్ర‌భాస్ యాక్ష‌న్ ఓ రేంజ్ లో హైలైట్ అవుతుంది. `స‌లార్ 2` లో అంత‌కు మించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ ఉండ‌బోతున్నాయి. ఈ క‌థ ప్ర‌భాస్ కు త‌ప్ప మ‌రే స్టార్ కు సూట‌వ్వ‌ద‌న్న‌ది వాస్త‌వం.

హైట్ ప‌రంగా సూప‌ర్ స్టార్ మ‌హేష్ మాత్రం ప్ర‌భాస్ కు స‌రి తూగుతాడు. క‌టౌట్ క్లాస్ అయినా? రూపంలో భారీ మార్పులు తీసుకొస్తే? మ‌హేష్ మాస్ అప్పిరియ‌న్స్ పీక్స్ లోనే ఉంటుంది. అలాంటి స‌మ‌యంలో మ‌హేష్ కి మాస్ కాన్సెప్ట్ ఒక‌టి ప‌డితే? అదే రేంజ్ లో హైలైట్ అవుతాడు. `వార‌ణాసి`తో పాన్ ఇండియా మార్కెట్లోకి ఎలాగూ అడుగు పెడుతున్నాడు. ఇదే సినిమాతో ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్ కి క‌నెట్ట్ అవుతున్నాడు. ఈ ఒక్క చిత్రంతోనే మ‌హేష్ గ్లోబ‌ల్ మార్కెట్ కి రీచ్ అవుతాడు. అదే జ‌రిగితే ప్ర‌భాస్ కు పోటీ త‌ప్ప‌న‌ట్లే. బాక్సాఫీస్ వ‌ద్ద నెంబ‌ర్ల వేట త‌ప్ప‌దు.

గతంలో వీరి మ‌ధ్య మార్కెట్లో పోటీ 100 - 200 కోట్ల వద్ద ఉండేది.

కానీ మహేష్ - రాజమౌళి సినిమా 2000 కోట్ల మార్కును లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభాస్ సినిమాలు కూడా 1000 నుండి 1500 కోట్ల రేంజ్‌లో బిజినెస్ చేస్తున్నాయి. అంటే భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన మొదటి రెండు స్థానాల కోసం వీరిద్దరి మధ్య గట్టి పోటీ ఉంటుద‌న్న‌ది స్ప‌ష్ట‌మ‌వుతోంది. ప్ర‌భాస్ ఎన్నో పాన్ ఇండియా సినిమాలు చేసి సంపాదించుకున్న క్రేజ్ ను మ‌హేష్ ఒక్క సినిమాతోనే ప్లాన్ చేసాడు. ఇదంతా రాజ‌మౌళి వ‌ల్లే సాధ్య‌మ‌వుతుంది.