హనుమంతుడి కోసం జక్కన్న గాలింపు
చాలా కాలంగా తెలుగు ఆడియన్స్ అందరూ ఎదురుచూస్తున్న మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు సంబంధించిన టైటిల్ ను వారణాసి అని అనౌన్స్ చేయడంతో ఇప్పుడందరి దృష్టి దానిపైనే ఉంది.
By: Sravani Lakshmi Srungarapu | 19 Nov 2025 5:15 PM ISTచాలా కాలంగా తెలుగు ఆడియన్స్ అందరూ ఎదురుచూస్తున్న మహేష్ బాబు- రాజమౌళి సినిమాకు సంబంధించిన టైటిల్ ను వారణాసి అని అనౌన్స్ చేయడంతో ఇప్పుడందరి దృష్టి దానిపైనే ఉంది. రీసెంట్ గా రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ లో రిలీజైన ఫస్ట్ గ్లింప్స్ యావత్ ప్రపంచాన్నే టాలీవుడ్ వైపుకు మళ్లేలా చేసింది.
రాముడిగా కనిపించనున్న మహేష్ బాబు
ఈ గ్లింప్స్ చూశాక రాజమౌళి మరో ఎపిక్ మూవీతో రాబోతున్నారని అందరికీ క్లారిటీ వచ్చింది. వారణాసి మూవీ సైన్స్, హిస్టరీ, పురాణాలను బేస్ చేసుకుని ఉండబోతుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతుంది. అంతేకాదు వారణాసి మూవీని పురాణాలకు లింక్ చేసిన జక్కన్న ఈ సినిమాలో మహేష్ బాబు 30 నిమిషాల పాటూ శ్రీరాముడిగా కనిపించనున్నారనే విషయాన్ని కూడా వెల్లడించారు.
హనుమంతుడిగా ఎవరు?
సినిమాను రామాయణంకు లింక్ చేయడం, పైగా మహేష్ రాముడిగా కనిపిస్తున్నాడంటే సినిమాలో కచ్ఛితంగా హనుమంతుడి పాత్ర కూడా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పే పన్లేదు. రామాయణంలో హనుమంతుడి పాత్ర చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే వారణాసిలో హనుమంతుడి పాత్ర కోసం జక్కన్న ఎవరిని తీసుకుంటారనేది అందరికీ ఆసక్తికరంగా మారగా, తాజాగా దీనిపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది.
తమిళ హీరోని తీసుకోవాలనే ప్లాన్ లో జక్కన్న
వారణాసి మూవీలో హనుమంతుడి క్యారెక్టర్ కోసం రాజమౌళి ఓ తమిళ హీరోని పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. తమిళ హీరోను తీసుకుంటే క్రేజ్ తో పాటూ కోలీవుడ్ లో మూవీకి మంచి ఓపెనింగ్స్ వస్తాయనే ఆలోచనతోనే జక్కన్న ఈ నిర్ణయం తీసుకుని ఉంటారని అందరూ భావిస్తున్నారు. ఈ పాత్ర కోసం కన్నడ యాక్టర్ కిచ్చా సుదీప్ పేరు కూడా వినిపించింది కానీ మళ్లీ ఇప్పుడు జక్కన్న చూపు తమిళ హీరోపై పడిందంటున్నారు. రాజమౌళి చివరకి ఎవరిని ఫైనల్ చేస్తారో? చూడాలి మరి.
