Begin typing your search above and press return to search.

వారణాసి: నిన్న రాముడు.. నేడు యముడు.. క్లారిటీ ఇవ్వవయ్యా రాజమౌళి!

ఈ పాత్ర కోసం విక్రమ్ తన మేకోవర్ కూడా మార్చబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

By:  Madhu Reddy   |   21 Feb 2026 9:25 PM IST
వారణాసి: నిన్న రాముడు.. నేడు యముడు.. క్లారిటీ ఇవ్వవయ్యా రాజమౌళి!
X

ఇండియన్ సినిమా దగ్గర రాజమౌళి పేరు చెబితేనే ఒక వైబ్రేషన్. ఇప్పుడు ఆయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న 'వారణాసి' సినిమాతో పాన్ వరల్డ్ స్థాయిని టార్గెట్ చేస్తున్నారు. అసలే ఈ సినిమాలో మహేష్ ఐదు విభిన్న పాత్రలు చేస్తున్నారని టాక్ ఉండగా, తాజాగా మరో సంచలన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం విలక్షణ నటుడు విక్రమ్ ఎంట్రీ ఇస్తున్నారట. సోషల్ మీడియాలో మహేష్ రాముడి లుక్ వైరల్ అవుతున్న వేళ, ఈ వార్త అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లింది.

శ్రీరాముడిగా మహేష్ బాబు.. థియేటర్లో సందడి:

వారణాసి సినిమా నుంచి వస్తున్న అప్‌డేట్స్ అన్నీ ఒక ఎత్తు అయితే, తాజాగా బయటకు వచ్చిన మహేష్ బాబు 'శ్రీరాముడి' లుక్ మరో ఎత్తు. చేతిలో విల్లు పట్టుకుని, ఎంతో తేజస్సుతో కనిపిస్తున్న మహేష్ రాముడి గెటప్ ఇప్పుడు నెట్టింట షేక్ చేస్తోంది. మైత్రీ మూవీస్‌కు సంబంధించిన ఒక థియేటర్లో ఈ లుక్‌తో కూడిన భారీ స్టాండీని ఏర్పాటు చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక నిన్నటి వరకు అడ్వెంచరస్ థ్రిల్లర్ అనుకున్న ఈ సినిమాలో ఈ ఆధ్యాత్మిక టచ్ ఏంటో అర్థం కాక నెటిజన్లు జుట్టు పీక్కుంటున్నారు. రాజమౌళి ఏదో పెద్ద ప్లానే చేస్తున్నాడని ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది.

యముడిగా విక్రమ్.. జక్కన్న క్లారిటీ ఇచ్చేనా?

ఇదిలా ఉండగా మరోవైపు ఈ సినిమాకి సంబంధించిన మరో క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.. కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఇందులో ఒక అతిథి పాత్రలో నటించబోతున్నారని అది కూడా సాదాసీదా పాత్ర కాదు, సాక్షాత్తూ 'యముడి' పాత్రలో ఆయన కనిపించబోతున్నారని ఆ న్యూస్ సారాంశం. పైగా విక్రమ్ పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ, కథలో అది చాలా ఇంపార్టెన్స్ ఉన్న రోల్ కావడంతో ఆయన వెంటనే ఓకే చెప్పేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలకు తగ్గట్టుగా.. వారం రోజుల్లోనే విక్రమ్ పార్ట్ షూటింగ్ పూర్తి చేసేలా రాజమౌళి ప్లాన్ చేశారట.

ఈ పాత్ర కోసం విక్రమ్ తన మేకోవర్ కూడా మార్చబోతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇది విన్న నెటిజన్స్.. నిన్నేమో రాముడు.. నేడేమో యముడు.. ఇలా రోజుకొక రూమర్ వస్తున్న వేళా ఇకనైనా స్పందించి క్లారిటీ ఇవ్వవయ్యా రాజమౌళి అంటూ మహేష్ అభిమానులు కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరి ఈ రూమర్స్ కి రాజమౌళి స్పందించి చెక్ పెడతారేమో చూడాలి.