Begin typing your search above and press return to search.

లక్ష మందితో SSMB29 గ్రాండ్ ఈవెంట్!

ఈ మధ్యకాలంలో హై ప్రొఫైల్ ఫిల్మ్ ఈవెంట్ల కోసం డిజిటల్ ఫ్లాట్ ఫారంలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలా ఈ ఈవెంట్ కోసం కూడా రాజమౌళి డిజిటల్ ప్లాట్ఫారం ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

By:  Madhu Reddy   |   3 Nov 2025 5:19 PM IST
లక్ష మందితో SSMB29 గ్రాండ్ ఈవెంట్!
X

ప్రస్తుతం దేశం మొత్తం చూపు దర్శక ధీరుడు రాజమౌళి ఇచ్చే అప్డేట్ పైనే ఉంది. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుని హీరోగా పెట్టి పాన్ వరల్డ్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి ఇన్ని రోజులైనా కూడా దీని నుంచి టైటిల్ కానీ హీరో ఫస్ట్ లుక్ కానీ అధికారికంగా రాలేదు.దాంతో మహేష్ బాబు అభిమానులు కాస్త నిరాశలో ఉన్న ఈ సమయంలో రాజమౌళి మహేష్ బాబు అభిమానుల్లో కొత్త జోష్ నింపబోతున్నారు. నవంబర్ 15న ఎస్ఎస్ఎంబి 29కి సంబంధించి ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు టైటిల్ కూడా అనౌన్స్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే చిత్ర యూనిట్ రామోజీ ఫిలిం సిటీ లో ఈవెంట్ కి సంబంధించి సన్నాహాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది.

ఫస్ట్ లుక్ టీజర్ లాంచ్ హైదరాబాదులో జరుగుతుందని, అలాగే అది జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ అవుతుందని కూడా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఎస్ఎస్ఎంబి 29 మూవీకి సంబంధించిన గ్రాండ్ ఈవెంట్ ని రామోజీ ఫిలిం సిటీ లో చేయబోతున్నారట. ఈ ఎస్ఎస్ఎంబి 29 ఈవెంట్ కి దాదాపు లక్ష మంది హాజరు కావాలని ఓ పెద్ద ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో ఒక రూమర్ వినిపిస్తోంది. రామోజీ ఫిలిం సిటీ లో ఈ గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ సందడి ఇప్పటికే నెలకొన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. అలాగే జియో హాట్ స్టార్ లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా అక్కడున్న ప్రేక్షకులకు అందుబాటులోకి రానున్నట్టు తెలుస్తోంది.

ఈ మధ్యకాలంలో హై ప్రొఫైల్ ఫిల్మ్ ఈవెంట్ల కోసం డిజిటల్ ఫ్లాట్ ఫారంలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అలా ఈ ఈవెంట్ కోసం కూడా రాజమౌళి డిజిటల్ ప్లాట్ఫారం ని ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ ఈవెంట్ ని ప్రత్యక్షంగా వీక్షించే వారితో పాటు ఆన్లైన్ వీక్షకుల్ని కూడా ఆకర్షించడం కోసం ఈ ఏర్పాట్లన్నీ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇలా డిజిటల్ వేదిక ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయడంతో పాటు ఇలాంటి ఒక పెద్ద ఈవెంట్ ని పెడితే ఈ సినిమా ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్తుంది అనే ఉద్దేశంతోనే రాజమౌళి ఈ ప్లాన్ చేసినట్టు సమాచారం.అలాగే ఈ ఈవెంట్లో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ చేతుల మీదుగా ఈ సినిమా టైటిల్ లాంచ్ ఉంటుంది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ ఈవెంట్ లో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, రాజమౌళి, పృథ్వీరాజ్ సుకుమారన్ లతో పాటు చిత్ర యూనిట్ అందరూ హాజరవుతారని సమాచారం.

ఏది ఏమైనప్పటికి రాజమౌళి సినిమాలను అద్భుతంగా తెరకెక్కించడమే కాదు సినిమాని ప్రేక్షకుల్లోకి బలంగా తీసుకువెళ్లడం కోసం ఇలాంటి డిఫరెంట్ ఆలోచనలు కూడా చేస్తారు. ప్రస్తుతం ఎంతోమంది నవంబర్ 15న జరగబోయే ఈ గ్లోబ్ ట్రోటర్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమాకి వారణాసి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు చాలా రోజుల నుండి వార్తలు వినిపిస్తున్నాయి. కానీ తాజాగా వారణాసి అనే మూవీ టైటిల్ ని మరో డైరెక్టర్ రిజిస్ట్రేషన్ చేయించుకొని టైటిల్ పోస్టర్ ని కూడా తాజాగా రిలీజ్ చేశారు. దీంతో మహేష్ బాబు రాజమౌళిల సినిమాకి వారణాసి అనే టైటిల్ పెట్టట్లేదని అర్థమైంది. మరి చూడాలి ఎస్ఎస్ఎంబి 29 టైటిల్ ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో తెలియబోతోంది.