కర్ణుడి పవర్‌ఫుల్ క్యారెక్టర్.. లారెన్స్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్?
భారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం మైథాలాజికల్ కాన్సెప్టులను పాన్-ఇండియా విజువల్ స్పెక్టాకిల్స్‌గా తెరకెక్కించే కొత్త శకం నడుస్తోంది.
By: Madhu Reddy | 23 Sept 2026 11:50 AM ISTభారతీయ సినీ పరిశ్రమలో ప్రస్తుతం మైథాలాజికల్ కాన్సెప్టులను పాన్-ఇండియా విజువల్ స్పెక్టాకిల్స్‌గా తెరకెక్కించే కొత్త శకం నడుస్తోంది. రామాయణ, మహాభారతాలలోని పాత్రలను ఆధునిక సాంకేతికతతో, భారీ బడ్జెట్‌తో వెండితెరపై ఆవిష్కరిస్తూ దర్శకులు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు రమేష్ వర్మ దర్శకత్వంలో రాఘవ లారెన్స్ కథానాయకుడిగా 'మహావీర్ కర్ణ' అనే పాన్-ఇండియా ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది. మహాభారతంలో అత్యంత ఇంటెన్స్, ఎమోషనల్ క్యారెక్టరైన 'కర్ణుడి' పాత్రను లారెన్స్ పోషించబోతుండటం సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ పవర్‌ఫుల్ పాత్ర లారెన్స్ కెరీర్‌ను ఎలా ప్లస్ అవుతుందో చూద్దాం ..
లారెన్స్ మాస్ అపీల్:
మహాభారతంలో కర్ణుడి పాత్ర కేవలం ఒక యోధుడి కథ మాత్రమే కాదు,అది ఆత్మాభిమానం, త్యాగం, స్నేహం మరియు తీవ్రమైన ఆవేశం మేళవించిన ఒక అద్భుతమైన భావోద్వేగ కాన్వాస్. రాఘవ లారెన్స్‌లో సహజంగానే మాస్ ఆడియన్స్‌ను కట్టిపడేసే ఎనర్జీ, హై వోల్టేజ్ డ్రామా పండించగల ప్రత్యేకమైన నటనా వైవిధ్యం ఉన్నాయి. ఇక 'జిగర్తండ డబుల్ ఎక్స్' లో తన నటనతో తీవ్రమైన ఎమోషన్స్‌ను పండించగలనని ఆయన నిరూపించారు. కర్ణుడి పాత్రలోని ఆవేదనను, వీరత్వాన్ని లారెన్స్ తనదైన మాస్ అపీల్‌తో తెరపై ఆవిష్కరిస్తే, అది సీన్లకు ఇచ్చే ఎలివేషన్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది.
పాన్-ఇండియా రేంజ్ నయా మార్కెట్ పొటెన్షియల్:
లారెన్స్ కెరీర్‌లో ఇప్పటివరకు సాధించిన విజయాల్లో ఎక్కువగా 'కాంచన' ఫ్రాంచైజ్ హారర్-కామెడీలదే ముఖ్య పాత్ర. తమిళ్, తెలుగు మార్కెట్లలో ఆయనకు మంచి పట్టు ఉన్నప్పటికీ, ప్రాన్-ఇండియా స్థాయిలో రూ. 100 కోట్ల పైచిలుకు బెంచ్‌మార్క్‌ను అందుకోవడం ఇంకా సాధ్యపడలేదు. మైథాలజీ కథలకు దేశవ్యాప్తంగా, అన్ని భాషల ఆడియన్స్‌లోనూ భాషా భేదం లేకుండా సహజమైన ఆదరణ ఉంటుంది. కర్ణుడి వంటి అందరికీ పరిచితమైన పవర్ ఫుల్ పౌరాణిక పాత్రను సరైన విజువల్ స్పెక్టాకిల్‌గా మలిచితే, లారెన్స్ మార్కెట్ పరిధి దక్షిణాదిని దాటి నార్త్ ఇండియా వరకు విస్తరించే అవకాశం ఉంది.
బాక్సాఫీస్ రిస్క్ వర్సెస్ క్రియేటివ్ విజన్:
రాఘవ లారెన్స్ ట్రాక్ రికార్డ్ మరియు దర్శకుడు రమేష్ వర్మ మునుపటి చిత్రాల ఆధారంగా ఈ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కడంపై సోషల్ మీడియాలో కొన్ని అనుమానాలు, విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే, సరిగ్గా ప్రణాళిక రచించి, స్క్రిప్ట్‌ను ఎమోషనల్ అండ్ విజువల్ పీక్స్‌లో నిలబెడితే అంచనాలు లేని కాంబినేషన్లే బాక్సాఫీస్ వద్ద అనూహ్యమైన అద్భుతాలు సృష్టిస్తాయి.
కెరీర్‌ను మలుపు తిప్పే సువర్ణావకాశం:
నటుడిగా తనలోని విభిన్న కోణాలను ఆవిష్కరించేందుకు లారెన్స్‌కు దక్కిన అతిపెద్ద వేదిక 'మహావీర్ కర్ణ'. విమర్శలను తిప్పికొడుతూ, కర్ణుడి పాత్రలోని గంభీరతను, భావోద్వేగాలను పూర్తిస్థాయిలో పండిస్తే, ఈ చిత్రం ఆయన ఇమేజ్‌ను, మార్కెట్ స్థాయిని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లే అసలైన టర్నింగ్ పాయింట్‌గా నిలవడం తథ్యం.
