కింగ్డమ్ vs నరసింహ.. బుకింగ్స్ లో అప్పర్ హ్యాండ్ ఎవరిది?
ప్రస్తుతం, బుక్ మై షో బుకింగ్స్ పరంగా చూస్తే ‘మహావతార్ నరసింహ’ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.
By: M Prashanth | 1 Aug 2025 6:21 PM ISTబాక్సాఫీస్ వద్ద అసలైన హడావుడి చూసి చాలా రోజులైంది. మంచి సినిమాల కోసం ప్రేక్షకులు చూస్తుంటే బిజినెస్ రేంజ్ పెరిగేలా కంటెంట్ ఉన్న సినిమా రావాలని డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ ఎదురుచూస్తున్నారు. ఇక లేటెస్ట్ గా థియేటర్లలో సందడి చేస్తున్న 'కింగ్డమ్', 'మహావతార్ నరసింహ' చిత్రాలు అందులో కీలకంగా నిలుస్తున్నాయి. రెండు సినిమాలూ రివ్యూస్ పరంగా మిక్స్‌డ్ టాక్ దక్కించుకున్నా, ఫ్యామిలీ ఆడియన్స్‌తో పాటు యూత్ కూడా ఈ సినిమాలపై ఆసక్తిని చూపిస్తున్నారు. ప్రత్యేకంగా నరసింహ వంటి యానిమేటెడ్ మూవీకి ఈ స్థాయి డిమాండ్ ఉండడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
రేటింగ్స్ వర్సెస్ పబ్లిక్ టాక్
‘కింగ్డమ్’ సినిమాకు బుక్ మై షోలో పబ్లిక్ వోటింగ్‌లో 7.8/10 రేటింగ్ వస్తే, ‘మహావతార్ నరసింహ’ సినిమాకు భారీగా 9.8/10 రేటింగ్ రావడం విశేషం. ఓవర్సీస్, దేశవాళీ మార్కెట్లలో రెండు సినిమాలకు కూడా ఓ మోస్తరు బజ్ కనిపిస్తోంది. ‘కింగ్డమ్’ విజయ్ దేవరకొండ యాక్షన్ లుక్, కథాంశం, విజువల్స్ బాగున్నాయన్న కామెంట్లు వస్తున్నాయి. మరోవైపు, మహావతార్ నరసింహ యానిమేషన్ వర్క్, హిందూ మైథాలజీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇదివరకు ఇండియన్ యానిమేటెడ్ సినిమాలకు ఈ రేంజ్ డిమాండ్ రాలేదు. కానీ, ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కూడా థియేటర్లకు వెళ్తున్నట్టు తెలుస్తోంది.
బుకింగ్స్ లో దుమ్మురేపిన నరసింహ
ప్రస్తుతం, బుక్ మై షో బుకింగ్స్ పరంగా చూస్తే ‘మహావతార్ నరసింహ’ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఒక్క గంటలో 16.47 వేల టికెట్లు బుక్ అవ్వడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే ఇలాంటి ఓవర్‌నైట్ బుకింగ్స్ కనిపించేవి. కానీ, ఇప్పుడు యానిమేటెడ్ సినిమా అయినా కూడా ప్రేక్షకులు థియేటర్‌కు రావడాన్ని బట్టి కంటెంట్‌కి ప్రాముఖ్యత పెరుగుతోందని చెప్పొచ్చు. ఇదే సమయంలో ‘కింగ్డమ్’ కూడా 8.64 వేల టికెట్లు గంటలో అమ్ముడై డీసెంట్ రన్ చూపిస్తోంది. రెండు సినిమాలూ దేశవ్యాప్తంగా ట్రెండింగ్ లో కొనసాగుతున్నాయి. కానీ ఈ సినిమా కంటే నరసింహా సినిమాకు డబుల్ బుకింగ్స్ ఉండడం విశేషం.
‘కింగ్డమ్’లో విజయ్ దేవరకొండ మాస్ లుక్, యాక్షన్, మ్యూజిక్ వంటి అంశాలు యూత్‌ను థియేటర్‌కు ఆకర్షించాయి. సినిమా టాక్ మిక్స్‌డ్ గా ఉన్నా, విజువల్ ప్రెజెంటేషన్, ఫస్ట్ హాఫ్ ఎనర్జీ బాగుందన్న స్పందన ఉంది. ‘మహావతార్ నరసింహ’లో అనిమేషన్, డివోషనల్ ఎలిమెంట్స్, టెక్నికల్ స్టాండర్డ్ లను భారీగా మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా, చిన్న పిల్లలు, కుటుంబ సభ్యులు ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. థియేటర్స్‌లో స్క్రీన్ కౌంట్ పెరగడం, షోలు హౌస్‌ఫుల్ అవడం దీనికి ఉదాహరణ.
ఫ్యామిలీస్ ఫోకస్
ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకే పెద్దగా ఆదరణ ఇస్తున్నారని మరోసారి తెలుస్తోంది. పెద్ద హీరోలు లేకున్నా, యానిమేషన్ సినిమా అయినా, ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద ఎత్తున థియేటర్లకు వెళ్లడం ఆసక్తికర పరిణామం. ‘మహావతార్ నరసింహ’ సినిమాకు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఫుల్ రన్స్ రావడం స్పెషల్. ‘కింగ్డమ్’ మాత్రం యూత్ ఆడియన్స్‌తో పాటు మాస్ సెంటర్స్‌లో మెరుగ్గా రన్ అవుతోంది. మొత్తానికి, ప్రస్తుతం ఈ రెండు చిత్రాలూ బుకింగ్స్, రేటింగ్స్ పరంగా బాగానే నడుస్తున్నాయి. వీక్ ఎండ్‌లో వచ్చే కలెక్షన్స్ ఈ సినిమాల లాంగ్ రన్‌కు కీలకం కానుంది.
