Begin typing your search above and press return to search.

మహావతార్ నరసింహ.. సోలో బాక్సాఫీస్ సునామీ!

బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సందడి చేస్తున్న మహావతార్ నరసింహ.. భారీ వసూళ్లను రాబడుతోంది.

By:  M Prashanth   |   5 Aug 2025 12:25 PM IST
మహావతార్ నరసింహ.. సోలో బాక్సాఫీస్ సునామీ!
X

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించడం.. ఇప్పటికీ ఎన్నో సినిమాల విషయంలో అదే జరిగింది. ఇప్పుడు యానిమేషన్ మూవీ మహావతార్ నరసింహ మూవీకి అదే రిపీట్ అయింది. ఎలాంటి ప్రచారం లేకుండా విడుదల అయిన ఆ సినిమా.. సంచలనం సృష్టిస్తోంది. సంక్రాంతి పండుగ తరహా వాతావరణం థియేటర్స్ లో ఫుల్ గా కనిపిస్తోంది.

బాక్సాఫీస్ వద్ద ఓ రేంజ్ లో సందడి చేస్తున్న మహావతార్ నరసింహ.. భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటికే ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన ఆ మూవీ.. రీసెంట్ గా రూ.100 కోట్ల క్లబ్ లో ఎంట్రీ ఇచ్చింది. ఇండియాలో పది రోజులకు గాను రూ.105 కోట్లు కలెక్ట్ చేసింది. అలా చేసిన ఫస్ట్ యానిమేషన్ మూవీగా కొత్త చరిత్రను క్రియేట్ చేసింది.

మొదటి రోజు రూ.1.35 కోట్లు మాత్రమే రాబట్టిన ఆ సినిమా.. పదో రోజు ఏకంగా రూ.10 కోట్లకు పైగా కలెక్షన్లు సొంతం చేసుకోవడం విశేషం. మొత్తానికి ఓ రేంజ్ లో సందడి చేస్తున్న మహావతార్ నరసింహ.. సోలోగా థియేటర్స్ ను ఏలుతోంది. ఆ సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ వసూళ్ళ పరంగా డీలా పడిపోయాయని చెప్పాలి.

ఇప్పుడు పదకొండో రోజు రూ.8 కోట్లు రాబట్టింది మహావతార్ నరసింహ. అదే సమయంలో మిగతా సినిమాలన్నీ అందులో సగం కూడా రాబట్టలేకపోయాయి. అజయ్ దేవగన్ సన్ ఆఫ్ సర్దార్ 2 మూవీ నాలుగో రోజు దాదాపు రూ. 2.50 కోట్ల నికర వసూళ్లు మాత్రమే ఆర్జించింది. 10.20 శాతం తక్కువ ఆక్యుపెన్సీ రేటు ను సొంతం చేసుకుంది.

ధడక్ 2 వసూళ్లు పేలవంగానే ఉన్నాయి. నాలుగో రోజు దాదాపు రూ. 1.40 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. హిందీ మార్కెట్‌ లో మొత్తం ఆక్యుపెన్సీ 12.75 శాతం మాత్రమే. మరోవైపు, టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీ కూడా సోమవారం నాడు తక్కువ వసూళ్లే రాబట్టినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి మహావతార్ నరసింహ రిలీజ్ అయ్యాక వివిధ చిత్రాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా అంత సందడి చేయలేకపోయాయి. ఇప్పుడు ఈ వారం మరికొన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. కానీ మహావతార్ నరసింహ దూకుడు మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. మరి ఓవరాల్ గా ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.