Begin typing your search above and press return to search.

చిన్న బ్రేక్.. మళ్లీ బ్యాటింగ్ మొదలు

మహావతార నరసింహ.. గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే ఈ మూవీనే.

By:  Garuda Media   |   17 Aug 2025 9:29 AM IST
చిన్న బ్రేక్.. మళ్లీ బ్యాటింగ్ మొదలు
X

మహావతార నరసింహ.. గత కొన్నేళ్లలో ఇండియన్ సినిమాలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే ఈ మూవీనే. ఈ చిత్రం రిలీజవుతున్నపుడు అసలేమాత్రం అంచనాలు లేవు. కానీ కన్నడలో తెరకెక్కిన ఈ యానిమేషన్ మూవీ.. దేశవ్యాప్తంగా బాక్సాఫీస్‌లో పెను సంచలనాలకు తెర తీసింది.

పెద్దగా పబ్లిసిటీ లేకుండా రిలీజైన ఈ చిత్రాన్ని జనాలే నెత్తిన పెట్టుకుని మోశారు. మౌత్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం.. సంచలన వసూళ్లు సాధించింది. పెద్ద పెద్ద స్టార్లున్న సినిమాలు కూడా ఒకట్రెండు వారాలకే రన్ ముగిస్తుంటే.. విడుదలైన నాలుగో వారంలోనూ ఈ సినిమా దూకుడు చూపిస్తోంది. ఈ వీకెండ్లో వార్-2, కూలీ లాంటి భారీ చిత్రాలు బరిలో ఉండడంతో ఒక రెండు రోజులు ‘మహావతార నరసింహ’ దూకుడు తగ్గింది.

ఆ సినిమాకు థియేటర్లను బాగా తగ్గించారు. ఐతే ఈ రెండు పెద్ద సినిమాలూ ఆశించిన టాక్ తెచ్చుకోలేదు. ‘కూలీ’కి ముందు నుంచి ఉన్న హైప్ వల్ల వసూళ్లు నిలకడగానే ఉన్నాయి. కానీ ‘వార్-2’ జోరు మాత్రం తగ్గింది.

దీంతో ఎగ్జిబటర్ల చూపు మళ్లీ ‘మహావతార నరసింహ’ మీద పడింది. ఆ సినిమాకు షోలు పెంచుతున్నారు. ఆల్రెడీ ఉన్న షోలన్నీ ఫుల్స్ అవుతుండడంతో షోలు పెంచక తప్పని పరిస్థితి.

శనివారం హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్న ప్రతి షో ఫాస్ట్ ఫిల్లింగ్ లేదా సోల్డ్ ఔట్ మోడ్‌లోనే ఉంది. నాలుగో వారంలో ఒక చిన్న సినిమాకు ఈ స్థాయి స్పందన రావడం అసామాన్యం. ఆల్రెడీ ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్ల మార్కును దాటేసింది.

ఒక దశలో 300 కోట్ల వసూళ్లు కష్టమే అనుకున్నారు కానీ.. ఈ వారం ఈ సినిమా జోరు చూస్తుంటే అదేమీ అసాధ్యం కాదనిపిస్తోంది. 'మహావతార నరసింహ'కు అతి పెద్ద అడ్డంకి అనుకున్న రెండు చిత్రాలకూ డివైడ్ టాక్ వచ్చింది కాబట్టి.. ఈ సినిమా మరి కొన్ని వారాలు థియేటర్లలో నిలవడం ఖాయం. పబ్లిసిటీ లేకుండా రిలీజైన ఒక అనువాద, యానిమేటెడ్ మూవీకి ఇలాంటి స్పందన రావడం అద్భుతం అనే చెప్పాలి.