Begin typing your search above and press return to search.

మహావతార్ ఎన్ని అద్భుతాలో..?

హోంబలే ప్రొడక్షన్స్ ఏం చేసినా సరే అదో ట్రెండ్ సెట్ అన్నట్టుగా ఉంది. మాస్ యాక్షన్ సినిమాలతో కన్నడ పరిశ్రమ రేంజ్ పెంచిన ప్రొడక్షన్ అది.

By:  Ramesh Boddu   |   30 July 2025 11:00 PM IST
మహావతార్ ఎన్ని అద్భుతాలో..?
X

హోంబలే ప్రొడక్షన్స్ ఏం చేసినా సరే అదో ట్రెండ్ సెట్ అన్నట్టుగా ఉంది. మాస్ యాక్షన్ సినిమాలతో కన్నడ పరిశ్రమ రేంజ్ పెంచిన ప్రొడక్షన్ అది. కె.జి.ఎఫ్ తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కన్నడ సినిమా రేంజ్ ని పాన్ ఇండియా లెవెల్ లో అదరగొట్టేలా చేశారు. ఇక యానిమేటెడ్ సినిమాగా మహావతార్ నరసిం హ తో మరో సంచలనం సృష్టించారు. మహవతార్ యానిమేటెడ్ సీరీస్ లను భారీ రేంజ్ లో ప్లాన్ చేశారు హోంబలె బ్యానర్.

ఆడియన్స్ ని సంబ్రమాశ్చర్యాలకు గురి చేస్తూ..

అందులో భాగంగానే వచ్చిన మహావతార్ నరసింహ ఆడియన్స్ ని సంబ్రమాశ్చర్యాలకు గురి చేసింది. అసలు యానిమేటెడ్ సినిమా ఈ రేంజ్ అద్భుతాలు చేయడం ఈమధ్య కాలంలో జరగలేదు. సినిమా 6 కోట్లతో తీస్తే ఇప్పటికే 30 కోట్ల పైన కలెక్ట్ చేసింది. ఐతే ఇండియన్ సినిమాలకు కొత్త మార్గదశకాన్ని చూపిస్తుంది మహావతార్ మూవీ. ఎందుకంటే హాలీవుడ్లో చాలా వరకు యానిమేటెడ్ సినిమాలకే భారీ క్రేజ్ ఉంటుంది.

అవతార్ లాంటి సినిమాలు ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తున్నాయంటే యానిమేటెడ్ సినిమాల మీద ఆడియన్స్ ఆసక్తి ఏంటన్నది తెలుస్తుంది. డిస్నీ, పిక్సర్ లాంటి సంస్థల నుంచి వచ్చే యానిమేటెడ్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ఐతే ఇండియన్ సినిమాల్లో ఈ యానిమేటెడ్ సినిమాలు అంత అద్భుతాలు చేసిన సందర్భాలు తక్కువ. మన దగ్గర యానిమేటెడ్ షోస్ అది కూడా చిల్డ్రెన్ షోస్ చాలా ఫేమస్. కానీ సినిమాలకు వస్తే అవి అంత క్లిక్ అవ్వలేదు.

యానిమేటెడ్ సినిమాలకు డిమాండ్ ఏర్పడేలా..

కానీ మహావతార్ సినిమా చూస్తే ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కూడా యానిమేటెడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఏర్పడేలా ఉంది. మహావతార్ సినిమాలు ఇంకా చాలా రాబోతున్నాయి. సో హోంబలే ఒక పథకం ప్రకారంగానే ఈ సినిమాలను మొదలు పెట్టిందని చెప్పొచ్చు. మహావతార్ సినిమా రికార్డులు ఇంకా కొనసాగుతున్నాయి. సినిమా ఫుల్ రన్ లో మంచి వసూళ్లను రాబట్టేలా ఉంది.

ఈ సినిమా ఇంత గొప్ప సక్సెస్ అయ్యింది కాబట్టి ఇక రాబోతున్న నెక్స్ట్ సినిమాల మీద కూడా మరింత ఫోకస్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఏది ఏమైనా వెండితెర మీద యానిమేటెడ్ సినిమాల్లో ముఖ్యంగా మన మేకర్స్ చేసిన మహావతార్ చేస్తున్న అద్భుతాలు మాత్రం సంచలనానికి నాంది పలికిందని చెప్పొచ్చు.