ఇండియన్ యానిమేషన్‌కే గర్వకారణం ఆ సినిమా..
ఆ సినిమా మరేదో కాదు, యానిమేటెడ్ మూవీగా వచ్చిన మహావతార్ నరసింహ. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో దూసుకెళ్తుంది.
By: Sravani Lakshmi Srungarapu | 2 Aug 2025 7:20 PM ISTచిన్న మూవీగా వచ్చి కొత్త రికార్డులు సృష్టించిన సినిమాలు ఇండస్ట్రీలో చాలానే ఉన్నాయి. అలా వచ్చిన ఓ సినిమా ఇప్పుడు సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తుంది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాలో భారీ క్యాస్టింగ్, పెద్ద పెద్ద సెట్స్ లాంటివి ఏమీ లేవు అయినా సరే మూవీ హౌస్ ఫుల్స్ తో భారీ కలెక్షన్లను అందుకుంటుంది.
ఎక్కడ చూసినా ఆ సినిమా గురించే..
ఆ సినిమా మరేదో కాదు, యానిమేటెడ్ మూవీగా వచ్చిన మహావతార్ నరసింహ. ఎలాంటి అంచనాల్లేకుండా వచ్చిన ఈ మూవీ ఇప్పుడు థియేటర్లలో దూసుకెళ్తుంది. ఈ మూవీని చూడ్డానికి ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడుతున్నారు. అంతెందుకు ఇప్పుడెక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా మొత్తం ఇదే సినిమాకు సంబంధించిన వీడియోలే కనిపిస్తున్నాయి.
హోంబలే ఖాతాలో మరో భారీ విజయం
శాండల్‌వుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ రూపొందిస్తున్న ప్రతీ సినిమా ఇప్పుడు భారీ విజయాల్ని అందుకుంటుంది. కెజిఎఫ్, సలార్ సినిమాలతో మంచి సక్సెస్‌లను అందుకున్న హోంబలే ఫిల్మ్ ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఓ భారీ వెంచర్ అయిన మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ కోసం చాలా స్ట్రాంగ్ పునాదిని వేసింది.
మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ లో వరుస సినిమాలు
ఈ యూనివర్స్ లో మహా విష్ణువు దశావతారాల ఆధారంగా పదేళ్లపాటూ వరుసగా సినిమాలు రూపొందనున్నాయి. బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లతో దూసుకెళ్తున్న ఈ సినిమాకు రోజురోజుకీ వసూళ్లు పెరుగుతున్నాయి. అందులో భాగంగానే ఈ సినిమా ఇప్పుడో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన యానిమేటెడ్ మూవీగా మహావతార్ రికార్డు సృష్టించింది.
హాలీవుడ్ మూవీని అధిగమించి మరీ కొత్త రికార్డు
ఈ సినిమా తో పాటూ హరి హర వీరమల్లు రిలీజైనప్పటికీ ఆడియన్స్ ఈ మూవీని చూడ్డానికి ఎంతో ఆసక్తి చూపించారు. ఆడియన్స్ హృదయాన్ని గెలుచుకున్న ఈ సినిమా మొత్తానికి స్లీపర్ హిట్ గా నిలిచింది. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటివరకు ఇండియాలో రూ.60 కోట్లు కలెక్ట్ చేయడమే కాకుండా హాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ అయిన స్పైడర్ మ్యాన్: అక్రాస్ ది స్పైడర్‌వర్స్ కలెక్షన్లను కూడా అధిగమించింది. ఈ రేర్ ఫీట్ ఇండియన్ యానిమేషన్‌కే గొప్ప గర్వకారణం. కాగా మహావతార్: నరసింహా హిందీ వెర్షన్ రూ.38 కోట్లు కలెక్ట్ చేయగా, మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లే వస్తున్నాయి.