Begin typing your search above and press return to search.

మరో 'మహావతార్'.. యానిమేటెడ్ ఫిల్మ్ ను డామినేట్ చేస్తుందా?

మహావతార్‌ నరసింహ.. ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

By:  M Prashanth   |   19 Aug 2025 9:00 PM IST
మరో మహావతార్.. యానిమేటెడ్ ఫిల్మ్ ను డామినేట్ చేస్తుందా?
X

మహావతార్‌ నరసింహ.. ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అయిందో అందరికీ తెలిసిందే. చిన్న మూవీగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం సాధించింది. రియల్ సక్సెస్ అంటే ఏంటో అసలు రుచి చూపించింది. మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతూ భారీ వసూళ్లను సాధిస్తోంది.

శ్రీమహావిష్ణువు నరసింహ అవతారం ఆధారంగా అశ్విన్‌ కుమార్‌ దర్శకత్వం వహించిన ఆ సినిమాను కన్నడ ప్రముఖ నిర్మాత సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ గ్రాండ్ గా రూపొందించింది. అయితే దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన యానిమేటెడ్‌ సినిమాగా ఇప్పటికే మహవతార్ నరసింహ మూవీ రికార్డు నెలకొల్పింది.

ఇప్పటి వరకు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. దాదాపు నెల రోజులుగా సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ ను కొనసాగిస్తోంది. అయితే మహవతార్ ఫ్రాంచైజీ తదుపరి భాగం మహావతార్ పరశురామ్ 2025 నవంబర్‌ లో సెట్స్ పైకి వెళ్లనుంది. అంతకుముందు.. మహావతార్ నరసింహ మూవీ ఓటీటీలోకి రానుందని టాక్.

అదే సమయంలో బాలీవుడ్ లో మహవతార్ అనే ఫీచర్ ఫిల్మ్ రూపొందుతోంది. అమర్ కౌశిక్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ లీడ్ రోల్ లో నటించనున్నారు. ఇప్పుడు మహావతార్ నరసింహ భారీ విజయం తర్వాత ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందోన్నది ఆసక్తికరంగా మారింది.

నిజానికి.. విక్కీ కౌశల్ మహావతార్ మూవీ ఇంకా సెట్స్ పైకి వెళ్లలేదు. వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా సినిమా రిలీజ్ అవుతుందని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి. విక్కీ కౌశల్ ఇతర కమిట్మెంట్ల కారణంగా ఆలస్యమవుతూ వస్తోంది. మూవీ కోసం విక్కీ భారీ భౌతిక పరివర్తన చెందాల్సి ఉందని, అందుకే మేకర్స్ టైమ్ తీసుకుంటున్నారని టాక్.

అయితే మహవతార్ పరశురామ్ 2027లో రిలీజ్ కానుంది. ఇప్పుడు విక్కీ కౌశల్ మహావతార్ కూడా అప్పుడే రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మొత్తం మీద విష్ణు అవతారంపై రెండు సినిమాలు దాదాపు ఒకే సమయంలో రూపొందుతున్నాయి. ప్రేక్షకులు వాటిని ఎలా స్వీకరిస్తారో చూడాలి. అంతే కాదు అటు యానిమేటెడ్ మూవీ.. ఇటు ఫీచర్ ఫిల్మ్.. ఏది ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి మరి.