రానాకి షాక్ ఇచ్చిన మహావతార్..?
హిరణ్యకశ్యప సినిమాకు గుణశేఖర్ కొంత వర్క్ కూడా చేశారట. కానీ ఇప్పుడు వీళ్లందరికీ మహావతార్ నరసింహ పెద్ద షాక్ ఇచ్చింది.
By: Ramesh Boddu | 13 Aug 2025 9:53 AM ISTమహావతార్ నరసింహ సినిమా సెన్సేషనల్ విక్టరీ ఇండియన్ యానిమేషన్ రంగానికి మంచి ఊపు తెచ్చింది. స్టార్ కాస్ట్.. రెమ్యునరేషన్.. డేట్స్.. షెడ్యూల్ ఇవేవి లేకుండా యానిమేటెడ్ సినిమాలు చేస్తే అవి ఆడియన్స్ కు రీచ్ అయితే ఎలాంటి రిజల్ట్ వస్తుందో మరోసారి ప్రూవ్ చేసింది మహవతార్ నరసింహ సినిమా. ఈ సినిమా ఆడుతున్న థియేటర్లు టెంపుల్ లా చూస్తున్నారు అంటే సినిమా చూపించిన ప్రభావం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
మహావతార్ వల్ల రానాకు నష్టం..
మహావతార్ సక్సెస్ దగ్గుబాటి హీరో రానాని కన్ ఫ్యూజన్ లో పడేసింది. అదేంటి మహావతార్ వల్ల రానాకు కలిగిన నష్టం ఏంటంటే.. రానా హిరణ్యకశ్యప అనే సినిమా చేయాలని అనుకున్నాడు. అది అటు ఇటుగా మహావతార్ నరసింహ కథ లాంటిదే. ఆ కాన్సెప్ట్ తోనే రానా సినిమా చేయాలని అనుకున్నాడు. ఈ సినిమాకు త్రివిక్రం హెల్ప్ చేస్తున్నాడన్న టాక్ ఉంది.
కట్ చేస్తే రానా ఆలోచనలకు బ్రేక్ వేసేలా మహావతార్ వచ్చింది. ఈ సినిమా సృష్టిస్తున్న సంచలనాలు చూస్తే రానా ఇక హిరణ్యకశ్యప సినిమా చేస్తాడని చెప్పలేం. కానీ రానా ఆలోచన ఎలా ఉందో తెలియాలి. మరోపక్క టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణశేఖర్ కూడా హిరణ్యకశ్యప మీద ఒక సినిమా చేయాలని అనుకున్నారు. రానాతోనే ఆయన సినిమా ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ కుదరలేదు.
మైథాలజీ కి ప్రేక్షకులు పట్టం..
హిరణ్యకశ్యప సినిమాకు గుణశేఖర్ కొంత వర్క్ కూడా చేశారట. కానీ ఇప్పుడు వీళ్లందరికీ మహావతార్ నరసింహ పెద్ద షాక్ ఇచ్చింది. మహావతార్ నరసింహ కన్నా ఆ కథను ఇంకా గొప్పగా తీస్తారని చెప్పలేం. మరి రానా, గుణశేఖర్, త్రివిక్రం హిరణ్యకశ్యపుడు సినిమాపై వీళ్ల నెక్స్ట్ స్టెప్ ఏంటన్నది చూడాలి.
మహావతార్ సీరీస్ లు మాత్రం ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం పక్కా అనేలా మొదటి సినిమాతోనే హోంబలే ప్రొడక్షన్స్ అదరగొట్టారు. మహావతార్ నరసింహ సినిమాను అశ్విన్ కుమార్ డైరెక్ట్ చేశాడు. నెక్స్ట్ మహావతార్ పరశురామ 2027 రిలీజ్ ఉంటుందని తెలుస్తుంది. వెండితెర మీద పురాణ ఇతిహాస కథలకు మంచి డిమాండ్ ఏర్పడింది. మైథాలజీ మూవీస్ కి ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఆడియన్స్ ని ఎంత మెప్పిస్తే అంత గొప్ప విజయాన్ని అందుకునే విధంగా ఆ సినిమాలు వస్తున్నాయి. మహావతార్ నరసింహ చేస్తున్న అద్భుతాలు అయితే నెవర్ బిఫోర్ అనిపించేలా ఉన్నాయి.
యానిమేటెడ్ సినిమాలకు నేషనల్ వైడ్ గా మంచి డిమాండ్ ఏర్పడేలా మహావతార్ కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్నాడు. మరి మహావతార్ నెక్స్ట్ రాబోతున్న సినిమాలు ఏం చేస్తాయో చూడాలి.
