మహావతార్ నరసింహా ఆస్కార్ ట్విస్ట్..!
98వ ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ లో యానిమేషన్ మూవీ కేటగిరిలో మహావతార్ నరసింహ సినిమా ఉంది. ఇది ఒక విధంగా యానిమేషన్ సినిమాలు తీసే మేకర్స్ కి ప్రోత్సాహకరంగానే ఉంటుంది.
By: Ramesh Boddu | 23 Nov 2025 9:21 AM ISTఇండియన్ స్క్రీన్ మీద యానిమేషన్ సినిమాలకు మళ్లీ ఊపు తెప్పించిన మూవీ మహావతార్ నరసిం హా. ఈ సినిమాతో రెండు అద్భుతమైన విషయాలు మేకర్స్ కి అర్థమయ్యాయి. ఈ సినిమా సక్సెస్ పురాణ ఇతిహాసాల మీద ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఉన్నారన్నది తెలిసింది ఒకటైతే యానిమేషన్ రంగంలో ఇలాంటి ప్రయోగాలు ఎన్నో చేయొచ్చు అనే రెండో విషయం అర్థమైంది. ఐతే ఈ క్రమంలో మహావతార్ అందుకున్న సక్సెస్ ని చూసి చాలా ప్రొడక్షన్ హౌస్ లో యానిమేషన్ సినిమాలను మొదలు పెట్టారు. టాలీవుడ్ నుంచి కూడా అలాంటి అటెంప్ట్ ఒకటి చేస్తున్నారు.
ప్రహ్లాదుని భక్తిని ప్రపంచానికి తెలిసేలా..
మహావతార్ సినిమా హిరణ్యకశ్యపుడిని నరసింహ స్వామి సంహరించడమనే కథతో తెరకెక్కింది. అంతేకాదు ప్రహ్లాదుని భక్తిని ప్రపంచానికి చూపించింది. ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ప్రేక్షకులను మెప్పించింది. మంచి సీన్స్, దానికి తగిన సంగీతం ఇలా మహావతార్ నరసిం హ థియేటర్ లోనే ఒక డివోషనల్ వైబ్ ఇచ్చి ఆడియన్స్ ని కదిలించింది. ఐతే మహావతార్ నరసిం హా సినిమా ఇప్పటికే రికార్డులు, రివార్డులు అందుకోగా ఇప్పుడు ఆ సినిమా ఆస్కార్ కు కూడా నామినేట్ అయ్యింది.
98వ ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్ లో యానిమేషన్ మూవీ కేటగిరిలో మహావతార్ నరసింహ సినిమా ఉంది. ఇది ఒక విధంగా యానిమేషన్ సినిమాలు తీసే మేకర్స్ కి ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఐతే మహావతార్ ని మించి విజువల్స్ తో మెప్పించిన హాలీవుడ్ సినిమాలు పోటీలో ఉన్నాయి. వాటి సరసన లిస్ట్ లో మహావతార్ నామినేట్ అవ్వడమే అద్భుతమైన విషయమని చెప్పొచ్చు.
మహావతార్ నరసింహా ఆస్కార్ నామినేట్..
అశ్విన్ కుమార్ ఈ సినిమాను ఎంతో వ్యయ ప్రయాసలతో చేశారు. హోంబలే ప్రొడక్షన్ మొత్తం 30 కోట్లతో ఈ సినిమా నిర్మించగా టోటల్ రన్ లో 300 కోట్లకు అటు ఇటుగా కలెక్ట్ చేసింది మహావతార్ నరసింహ సినిమా. ఇప్పుడు ఆస్కార్ కి కూడా నామినేట్ అయ్యి సినిమా రేంజ్ ఏంటో మరోసారి చూపించింది. ఆస్కార్ వస్తుందా రాదా అన్న విషయం పక్కన పెడితే యానిమేషన్ రంగంలో సినిమాలను కొన్నాళ్లుగా సరైన గుర్తింపు లేకుండా ఉండగా మహావతార్ వల్ల ఆ కేటగిరిలో మరిన్ని సినిమాలు పోటీకి వచ్చేలా ఉన్నాయి.
మహావతార్ తో పాటు ఈ ఇయర్ యానిమేషన్ మూవీస్ లిస్ట్ లో పాప్ డెమాన్ హంటర్స్, ఇన్ఫినిటీ కాస్టెల్, డెమాన్ స్లేయర్ : కిఎట్సు నో యైబా సినిమాలతో పాటు మరికొన్ని సినిమాలు ఈ కేటగిరిలో పోటీ పడుతున్నాయి. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ మహావతార్ లో ఉన్నాయా అంటే కచ్చితంగా కొన్ని ఫ్రేమ్స్ బాగున్నాయని చెప్పొచ్చు. ఐతే విజువల్ క్వాలిటీ ఇంకా రీచింగ్ ని బట్టి ఆస్కార్ ఎవరికి దక్కుతుంది అన్నది చూడాలి.
